Tata Motors SUV Nexon
-
పండుగ ఆఫర్, టాటా మోటర్స్‌పై భారీ తగ్గింపు
దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటర్స్ తన బీఎస్6 పాపులర్ మోడల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 2020 లో కొన్ని సెలక్ట్ మోడళ్లపై రూ.65,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు టాటామోటర్స్ అధికారికంగా ప్రకటించింది. ఆఫర్లు ప్రకటించిన కార్లలో టియాగో హ్యాచ్‌బ్యాక్, టైగర్ సెడాన్, నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ, హారియర్ ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఈ కార్లపై నవంబర్ 1, 2020 నుంచి డిస్కౌంట్లు వర్తించనున్నాయి. ఈ ఆఫర్లు 2020 నవంబర్ 30 వరకు చెల్లుతాయి. ఈ ప్రయోజనాలు వినియోగదారుల పథకం, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు కార్పొరేట్ ఆఫర్లను కలిగి ఉంటాయి, ఇవి అక్టోబర్ 2020 వరకు చెల్లుతాయి. హారియర్ ఎస్యూవీ వాహనంపై గరిష్టంగా రూ. 65,000 వరకు తగ్గింపును అందించనున్నారు. అదేవిధంగా ఈ నెలలో టాటా ఆల్ట్రోజ్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ నెల . ఈ నెల ఆఫర్లలో కన్స్యూమర్ స్కీమ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ , కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. అధికారిక వెబ్సైట్లో తెలిపిన ప్రకారం టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ పై మొత్తం రూ. 25,000వరకు ప్రయోజనం పొందవచ్చు. అదేవిధంగా టైగర్ సెడాన్‌పై గరిష్టంగా రూ. 30,000 వరకు లాభం చేకూరనుంది. ఇందులో రూ. 15,000 వరకు కన్స్యూమర్ స్కీం ద్వారా, మిగిలిన రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్లో పొందవచ్చు. చదవండి: ఈ చిన్న షేర్లు మార్కెట్లనే మించాయ్ -
ఆ వాహనాల ధరలు ఇక మోతే
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. తన ప్యాసింజర్ వాహనాలను ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది.ఇన్పుట్ కాస్ట్ భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ ప్యాసింజర్ వాహనాలపై రూ. 25వేల వరకు ధర పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇటీవల లాంచ్ చేసిన ఎస్యూవీ నెక్సాన్ సహా పలు వాహనాల ధరలు డిసెంబర్ 31తరువాత పెరగనున్నాయని సంస్థ తెలిపింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న తయారీ ఖర్చులు, ఇతరత్రా ఆర్థిక కారణాల వల్ల మేం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2018 జనవరి నుంచి పలు మోడళ్లపై రూ. 25వేల వరకు ధరలు పెంచుతున్నట్టు చెప్పారు. కాగా ఇటీవల ఇయర్ ఎండింగ్, ఖర్చులు, తదితర కారణాల రీత్యా టాటామోటార్స్, మారుతితో పాటు మరిన్ని ఆటోమొబైల్ సంస్థలు ధరల పెంపునకు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఇప్పటికే టొయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా, స్కోడా, ఇసుజు లాంటివి జనవరి నుంచి తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. -
ఏటా రెండు కొత్త వాహనాలు
గ్రేటర్ నోయిడా: ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు టాటామోటార్స్ కసరత్తు ప్రారంభిచింది. ఇకపై ఏడాదికి రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రయాణికుల వాహనాల మార్కెట్లో కోల్పోయిన వాటా సాధించడం లక్ష్యమని కంపెనీ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ చెప్పారు. కొత్త మోడళ్లను అందించలేకపోవడం వల్లే అమ్మకాల్లో వెనకబడ్డామని ఆయన అంగీకరించారు. అందుకే ఏడాదికి రెండు మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే కొత్త హ్యాచ్‌బాక్ బోల్ట్‌ను, కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌ను ఇటీవలనే ఆవిష్కరించామని చెప్పారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇవి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటీవలే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ నెక్సన్‌ను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ ఎస్యూవీ విడుదలకు ముందే మరికొన్ని కొత్త మోడళ్లను కస్టమర్లకు అందిస్తామని తెలిపారు.