Tax refunds
-
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్‌లైన్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్‌ను సంబంధిత పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్‌పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్‌పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
వారికి ఐటీ శాఖ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ : శాలరీ క్లాస్ పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రిటర్నుల్లో ఆదాయాన్ని తక్కువ చేసి చూపించినా.. తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఎవరైనా ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిస్తే వారిపై విచారణ చేపట్టనున్నామని, ఆ ఉద్యోగస్తులపై వారి ఎంప్లాయర్స్(సంస్థలు) కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలిపింది. ప్రముఖ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు మోసపూరితంగా ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను క్లయిమ్ చేసుకుంటున్నారని ఇటీవల పలు రిపోర్టులు వచ్చాయి. పన్ను మధ్యవర్తుల ద్వారా తప్పుడు ఆదాయాలు చూపుతున్నట్టు తెలిపాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈ అడ్వయిజరీ జారీచేసింది. ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం, తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచడం వంటి మోసాలకు పాల్పడితే, ఆదాయపు పన్ను చట్టంలోని పలు పీనల్, ప్రాసిక్యూషన్ నిబంధనల కింద చర్యలు తీసుకుంటామని ఈ అడ్వయిజరీలో తెలిపింది. బెంగళూరుకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలోని పలువురు ఉద్యోగులు తప్పుడు మార్గాల ద్వారా పన్ను రీఫండ్స్‌ను పొందారని డిపార్ట్మెంట్కు చెందిన విచారణ విభాగం తేల్చిన సంగతి తెలిసిందే. ట్యాక్స్ అడ్వయిజరీలతో ఈ మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. దీంతో శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారులకు, ఐటీ శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. కాగ, శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ ఫైలింగ్ సీజన్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్ ప్రారంభించింది. కొత్త ఐటీఆర్ నిబంధనలను కూడా తీసుకొచ్చింది. -
ప్రత్యేక హోదా రాష్ట్రాలకు టాక్స్ రీఫండ్..
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలు చెల్లించే టాక్స్‌ను తిరిగి ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ శుక్లా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. వైఎస్ఆర్ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2017 అక్టోబర్ 5న జారీ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) చేసిన ప్రకటన అనుగుణంగా ఈ వెసులుబాటు కల్పిస్తునట్లు మంత్రి తెలిపారు. గతంలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకం మినహాయింపుకు అర్హత పొందిన పరిశ్రమలకు ఇది వర్తిస్తుందన్నారు. ఆయా పరిశ్రమలు చెల్లించిన సెంట్రల్ టాక్స్, ఇంటిగ్రేటెడ్ టాక్స్ కింద చెల్లించే మొత్తాలతో కొంత శాతాన్ని బడ్జేట్ మద్దతు ద్వారా వాపసు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జీఎస్టీ అమలు నుంచి స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు ఎలాంటి పన్ను ప్రోత్సహకాన్ని ప్రకటించలేదని మంత్రి స్పష్టం చేశారు. హోమియోపతి బూటకం కాదు.. హోమియోపతి బూటకం కాదని సహాయ మంత్రి యసో నాయక్ రాజ్యసభలో మంగళం తెలిపారు. ఈ వైద్య విధానంతో పద్ధతి ప్రకారం నిర్వహించిన అనేక సమగ్ర అధ్యయనాల సమీక్షల ద్వారా నిశ్చయమైన, నిర్ధిష్టమైన ఫలితాలు ఉంటాయన్నారు. రాజ్యసభలో వైఎస్ఆర్ నేత విజయసాయి రెడ్డి అగిడిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. అనేక రోగాలకు సంబంధించి హోమియోపతిలో లభించే వైద్య చికిత్సా విధానాలపై నాలుగు సిస్టమాటిక్/మెటా- అనాలిస్లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితం అయినట్లు చెప్పారు. వీటిలో మూడు అధ్యయనాలపై వందలాది క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత హోమియోపతి క్లినికల్‌గా సమర్ధవంతమైన ఫలితాలు ఇచ్చినట్లు నిరూపితమైందన్నారు. హోమియోపతి చికిత్స సురక్షితమైనది, సమర్ధవంతమైనదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో హోమియోపతిపై అనేక హై క్వాలిటీ సర్వేలు నిర్వహించారు. దీంట్లో ఈ చికిత్సా విధానానికి ప్రజలలో అత్యధిక ఆమోదం ఉన్నట్లు వెల్లడైనందునే ప్రభుత్వం హోమియోపతిని పోత్సహిస్తున్నట్లు మంత్రి నాయక్ చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో 50 శాతం రోగులు హోమియో చికిత్స ద్వారా స్వస్థత పొందినట్లు మంత్రి తెలిపారు. -
ఇక పన్ను రిఫండ్లు పది రోజుల్లోనే..!
- ఎలక్ట్రానిక్ ఆధారిత వెరిఫికేషన్‌తో సాకారం: ఐటీ శాఖ న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఇకపై పన్ను రిఫండ్లు 7-10 రోజుల వ్యవధిలోనే ట్యాక్స్ పేయర్ల ఖాతాల్లోకి వచ్చే విధంగా ఆదాయపు పన్ను(శాఖ) ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా ఐటీ రిటర్నులను వేగంగా పరిశీలించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచామని... ఎలక్ట్రానిక్, ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌ను విజయవంతంగా మొదలుపెట్టినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ అసెస్మెంట్ సంవత్సరం(2015-16)లో దాఖలైన ఐటీఆర్‌లకు సంబంధించి అర్హులైన పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా పది రోజుల్లో రిటర్న్‌లను తనిఖీ చేసి, రిఫండ్లను బ్యాంక్ ఖాతాల్లోకి జమచేసేందుకు వీలవుతుందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఐటీ రిఫండ్లకు నెలల వ్యవధి.. కొన్ని కేసుల్లో అయితే సంవత్సరాలు కూడా పడుతుండటంతో సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసినట్లు ఐటీ శాఖ అధికారి చెప్పారు. దేశంలో పన్ను సంబంధ యంత్రాంగంలో ఈ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ఈ-ఫైలింగ్ సిస్టమ్ కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారుతాజా గణాంకాల ప్రకారం ఈ నెల 7 నాటికి(ఐటీఆర్ ఫైలింగ్‌కు ఆఖరి తేదీ) ఐటీ శాఖకు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా 2.06 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు అంచనా. గతేడాది(1.63 కోట్లు)తో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైంది. తమ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ) ఈ నెల 7 వరకూ మొత్తం 45.18 లక్షల రిటర్నులను పరిశీలించి.. 22.14 లక్షల మంది అసెస్సీలకు ప్రస్తుత అసెంట్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రిఫండ్లను చెల్లించినట్లు ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవధిలో 32.95 లక్షల ఈ-రిటర్నులను ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ చేసినట్లు సమాచారం.