TB vaccine
-
కరోనా :టీబీ వ్యాక్సిన్‌తో తక్కువ మరణాలు
వాషింగ్టన్ : క్షయ వ్యాధి నివారణకు ఇచ్చే బిసిజి (కాల్మెట్-గురిన్ ) వ్యాక్సిన్ ద్వారా కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. భారత్, చైనా, పోర్చుగల్ వంటి దేశాలు టీబీ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా అమలుచేస్తున్నందునే ఈ దేశాల్లో కోవిడ్ మరణాల రేటు తక్కువగా ఉందని అమెరికాలో న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు, కరోనా కేసులు మృతులు సంఖ్య తక్కువగా ఉండడానికి సంబంధం ఉందని వైద్య పరిశోధనలకు సంబంధించిన మెడ్ఆరెక్సివ్ వెబ్సైట్ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ అధ్యయనాన్ని ప్రచురించింది. (కోవిడ్–19కి విరుగుడు టీబీ వ్యాక్సిన్! ) కరోనా లింక్ అదేనా క్షయ, కరోనా రెండూ తుంపర్ల ద్వారా ఇతరులకు సంక్రమిస్తాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్‌కి, కరోనాకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే టీబీ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన దేశాల్లో కరోనా మరణాల రేటు 2.65 శాతంగా ఉంటే, అమరికా, ఇటలీ, నెదర్లాండ్ వంటి దేశాల్లో మరణాల రేటు 9.19 శాతం ఉందని యూఎస్ పరిశోధకుల బృందం వెల్లడించింది. అయితే కరోనా వైరస్‌కు, బిసిజి టీకాకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇప్పటివరకు కనుగొనలేదు. దీనిపై క్రినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాక్సిన్ వల్లే రోగ నిరోధక శక్తి అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లోనే కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. దీనికి కారణం ఆయా దేశాలన్నింటిలోనూ టీబీ కేసులు అత్యంత స్వల్పం. టీబీని నిరోధించే బీసీజీ వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనలు కూడా లేవు అని ప్రాథమికంగా అంచనా వేశారు. కెనడాలో టొరాంటో యూనివర్సిటీ ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎలీనార్ ఫిష్ దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు చెయ్యాలన్నారు. టీబీ వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఈక్వెడార్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో 1980 కాలం నుంచే టీకాను తప్పనిసరి చేసినందున, బెల్జియం, నెదర్లాండ్ దేశాలతో పోలీస్తే ఈ దేశాల్లో తక్కువ కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. -
కరోనాకు విరుగుడు అదేనా?
వాషింగ్టన్: క్షయకి, కరోనాకి సంబంధం ఉందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రెండూ అంటువ్యాధులే. నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా అంటుకుంటాయి. రెండు వ్యాధి లక్షణాల మధ్య కొంత సారూప్యత ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించినవే ఈ రెండు వ్యాధులే. అందుకే టీబీ వ్యాక్సిన్ భారత్‌ను కోవిడ్–19 బారి నుంచి రక్షిస్తోందని అమెరికాలో న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు, కరోనా కేసులు మృతులు సంఖ్య తక్కువగా ఉండడానికి సంబంధం ఉందని వైద్య పరిశోధనలకు సంబంధించిన మెడ్ఆరెక్సివ్ వెబ్సైట్ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ అధ్యయనాన్ని ప్రచురించింది. (కరోనా: 48 గంటల్లో వైరస్ క్రిములు ఖతం!) ట్యూబర్ కొలాసిస్ (టీబీ) వ్యాధి ఉన్న దేశాల్లో బాకిలస్ కాల్మెట్టె గ్యురిన్ (బీసీజీ) వ్యాక్సినేషన్ చేస్తారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న పలు దేశాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తక్కువగా ఉండడమే కాదు, మృతుల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన న్యూ యార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫసర్ గొంజాలొ ఒటాజు వెల్లడించారు. చైనాకి పొరుగునే ఉన్న జపాన్ వంటి దేశాలు లాక్డౌన్ చర్యలు తీసుకోకపోయినప్పటికీ ఈ వ్యాధి ఎందుకు విస్తరించలేదని తొలుత సందేహాలు కలిగితే ఆ దిశగా పరిశోధనలు సాగించామన్నారు. బీసీజీ వ్యాక్సిన్ అనేది కేవలం క్షయ వంటి వ్యాధులకే కాదు ఇతర అంటు వ్యాధులకి కూడా విరుగుడుగా పని చేస్తుందని, అందుకే ఆ వ్యాక్సిన్ నిర్బంధంగా వాడుతున్న దేశాల్లో కోవిడ్ విస్తరణను అధ్యయనం చేస్తే తక్కువగా ఉందని తేలిందని ప్రొఫెసర్ ఒటాజు తెలిపారు. సంపన్న దేశాల్లో కరోనా పడగ అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లోనే కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. దీనికి కారణం ఆయా దేశాలన్నింటిలోనూ టీబీ కేసులు అత్యంత స్వల్పం. టీబీని నిరోధించే బీసీజీ వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనలు కూడా లేవు. కరోనా బట్టబయలైన చైనాలో కూడా బీసీజీ వ్యాక్సిన్ వినియోగం తక్కువగానే ఉంది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే కరోనాను విజయవంతంగా అదుపు చేయగలిగాయి. ఈ దేశాల్లో బీసీజీ వ్యాక్సిన్ ప్రజలందరూ తప్పనిసరిగా తీసుకోవాలన్న జాతీయ నిబంధనలు ఉన్నాయి. అలాగే భారత్ కూడా క్షయ సోకకుండా బీసీజీ వ్యాక్సిన్ విస్తృతంగా వినియోగిస్తోంది. అందుకే ఆయా దేశాల్లో కరోనా వ్యాధి విస్తరణ తక్కువగా ఉందని ఒటాజు వివరించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకి బీసీజీ వ్యాక్సిన్? కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవాలంటే ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. అందుకే అమెరికా, ఇటలీ వంటి దేశాలు అత్యవసర విధులు అందించే వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు వైరస్ నుంచి రక్షణ కోసం బీసీజీ వ్యాక్సిన్ వెయ్యాలని సిఫారసులు చేస్తున్నాయి. ఇక మిగిలిన దేశాలు ఆచితూచి వ్యవవహరిస్తున్నాయి. కెనడాలో టొరాంటో యూనివర్సిటీ ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎలీనార్ ఫిష్ దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు చెయ్యాలన్నారు. నెదర్లాండ్స్ కరోనా కట్టడికి బీసీజీ వ్యాక్సిన్‌ను 200 మంది వైద్య సిబ్బందికి ప్రయోగాత్మకంగా ఇచ్చింది. అయితే ఇది పని చేస్తుందా అనే అన్నది తెలియడానికి మరో మూడు నెలలు పడుతుంది. ఈలోగా ఇదే అంశంపై సంపూర్ణ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ ఒటాజు వెల్లడించారు. చదవండి: ‘కరోనాకు నా రక్తంలోనే సమాధానం ఉందేమో’ -
క్షయపై యుద్ధం!
ఒంగోలు: క్షయవ్యాధి అంతానికి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మార్చి 24న జరిగే అంతర్జాతీయ క్షయవ్యాధి నివారణా దినోత్సవంతోపాటు ప్రతి నెలా మూడో శుక్రవారం విధిగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ అవగాహన కల్పించడం, వారిద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా వ్యాధి నిర్మూలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈనెల 17న తొలి మీటింగ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సి.హెచ్. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు తదితరాలపై జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి మద్దిశెట్టి శ్రీనివాసరావు ‘సాక్షి’ పలు విషయాలు వెల్లడించారు. జిల్లాలో పరిస్థితి: జిల్లాలో 2003 నుంచి ఇప్పటివరకు 57786 మంది వ్యాధిగ్రస్తులను విజయవంతంగా క్షయవ్యాధి బారినుంచి కాపాడారు. అంతే కాకుండా ప్రతి ఏటా 4వేల మంది వరకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే వ్యాధిగ్రస్తులను నిర్ధారించేందుకు 19 ప్రాంతాల్లో అధునాతనమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రిమ్స్‌లో ఒకటి, మార్కాపురం జిల్లా వైద్యశాలలో మరొక సిబినాట్ (కాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్టు) అనే పరికరాలు ఉన్నాయి. ఇవి కాకుండా 17 కమ్యూనిటీ వైద్యశాలల్లో ఆర్.టి.పి.సి.ఆర్ ( రియల్ టైమ్ పొలిమరైజ్ చేంజ్ రియాక్షన్) అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో మైక్రోస్కోప్ ద్వారా కళ్లెను పరీక్షించి వ్యాధిని నిర్ధారించేవారు. అయితే మైకోస్కోపు ద్వారా 50వేల మైక్రో క్రిములుంటేనే వ్యాధి నిర్థారణ జరిగేది. కానీ ఆర్టీపీసీఆర్, సిబినాట్ పరికరాల ద్వారా 10 మైక్రో క్రిములు ఉన్నా వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతోంది. ఆ తరువాత సెన్సిటివ్, రెసిస్టెన్స్ అనే రెండు రకాలుగా వ్యాధిని పేర్కొంటూ చికిత్స ప్రారంభిస్తారు. రెండు వారాలపాటు నిరంతరంగా దగ్గు ఉంటే కళ్లె పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు విపరీతంగా పట్టడం, బరువు తగ్గిపోవడం వంటివి క్షయవ్యాధి లక్షణాలుగా చెబుతారు. 2018 జనవరి నుంచి 2019 ఫిబ్రవరి వరకు పరిశీలిస్తే 19935 అనుమానిత కేసులను గుర్తించి పరీక్షలు నిర్వహించగా 6425 మందికి టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వారిలో 5728 మందికి చికిత్స పూర్తిచేశారు. వారిలో 517 మందికి మాత్రం హెచ్ఐవీ, టీబీ సోకిందని తేలింది. చికిత్స ఇలా: ఈ వ్యాధి ఊపిరితిత్తులపై దీని ప్రభావాన్ని చూపిస్తుంది. దగ్గు, జ్వరం, రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, విపరీతంగా బరువు తగ్గిపోవడం వంటివి ప్రాథ«మిక లక్షణాలు. ఫస్ట్‌లైన్ ఆసే అనే పరీక్ష ద్వారా వ్యాధిని నయం చేయడం సాధ్యపడుతుంది. అందుకు వ్యాధిగ్రస్తుని శరరీం సహకరిస్తుందని భావిస్తే వారికి చికిత్స ప్రారంభిస్తారు. ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా ఇచ్చే మందులను వాడడం ద్వారా వ్యాధిని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం ఒకసారి ఎవరైనా దేశంలో ఎక్కడైనా క్షయవ్యాధిగ్రస్తుడిగా నిర్ధారణ అయితే అతనికి ఆరు నెలలకు సంబంధించిన మందులు రిలీజ్ అవుతాయి. అయితే ప్రతి రెండు నెలలకోసారి అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులను పంపిణీ చేస్తుంటారు. ఒక వేళ ఎవరైనా ఇతరత్రా ప్రాంతాలకు వలస వెళితే తమ వద్దనుంచి ఒక చిన్న రశీదును తీసుకొని అక్కడవైద్యశాలలో తిరిగి వైద్యాన్ని కొనసాగించుకోవచ్చు. ఒక వేళ సెన్సిటివ్ కాకుండా రెసిస్టెన్స్ అయితే మాత్రం సెకండ్ లైన్ ఆసే టెస్టుకు పంపుతారు. అక్కడ వ్యాధి గ్రస్తునికి ప్రతి నెలా ఎకో టెస్టు నిర్వహిస్తూ మందులు ఇస్తారు. తొలి రెండు వారాలు మాత్రం ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ టెస్టును నోడల్ డి.టి.ఆర్.బి సెంటర్లో అందిస్తారు. ఇది మనకు సమీపంలో గుంటూరులో ఉంది. తొలి రెండు వారాలు రోజుకు నాలుగు బిళ్లల చొప్పున ఇస్తారు. అనంతరం డిశ్చార్జి చేసి రోజు మార్చి రోజు రెండు బిళ్లలు చొప్పున మింగాల్సి ఉంటుంది. అయితే సెకండ్ లెవల్ టెస్టులో సైడ్ ఎఫెక్టŠస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికిగాను డ్రగ్ సెన్సిటివ్ టెస్టు నిర్వహిస్తూ వైద్యం అందిస్తారు. ఈ బిళ్ల ఒక్కొక్కటి పదివేల రూపాయలు విలువ చేస్తుంది. ఆరు నెలలపాటు ఈ వైద్యం అందిస్తారు. ఇటువంటి వారు ప్రకాశం జిల్లాలో కేవలం 11మంది మాత్రమే ఉన్నారు. అయితే కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లోను చికిత్స పొందుతుంటారు. అటువంటి వారికి కూడా తాము ఉచితంగా విలువైన మందులను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. క్షయవ్యాధిగ్రస్తునిగా నిర్థారణ అయిన ప్రతి ఒక్కరు తమ ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ ఇచ్చినట్లయితే మందులతోపాటు వారి పోషణకుగాను ఆరు నెలలపాటు నెలకు రూ. 500 చొప్పున నగదు కూడా నేరుగా అతని ఖాతాకే జమచేయడం జరుగుతుంది. ప్రధానంగా టీబీని 2025 నాటికి పూర్తిగా తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మందుల విషయంలో రాజీ లేదు.. డ్రగ్ రెసిస్టెంట్ టి.బి సెంటర్ ఇప్పటివరకు నెల్లూరులో ఉంది. మన జిల్లాలో లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 21న ఒంగోలు రిమ్స్‌లో ఈ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. మందుల విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరంలేదని, ఖరీదైన మందులను ప్రభుత్వం సరఫరాచేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే ఉచిత మందులను పేద రోగగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి మద్దిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మద్దిశెట్టి శ్రీనివాసరావు -
వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న పాక్!
ఇస్లామాబాద్: తమ దేశంలో ట్యూబర్క్లోసిస్ (టీబీ) వ్యాక్సిన్ కొరత చాలా ఉండటంతో పాకిస్థాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. గత రెండు నెలల నుంచి ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో టీబీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని పాక్ అధికారులు భావిస్తున్నారు. కొరత వల్ల చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చి వ్యాధుల నుంచి కాపాడుకోలేకపోతామని స్థానిక ఆరోగ్య సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య సర్వీసు(ఎన్హెచ్ఎస్)కు బీసీజీ సిరంజీలు అవసరమని ఓ లేఖలో వెల్లడించింది. అందుకు స్పందించిన ఎన్హెచ్ఎస్ కార్యదర్శి అయుబ్ షేక్ మాట్లాడుతూ... ఇటీవలే కొనుగోలు చేసిన సిరంజీలు, ఇతర మెడికల్ ఐటమ్స్ ను వారంలోగా పంపిస్తామని చెప్పారు. వాక్సిన్స్ అందుబాటులో లేకపోతే చిన్నారుల ఆరోగ్యం ఏమైతుందోనని పంజాబ్ ప్రాంతం అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల ఆరు లక్షల వ్యాక్సిన్స్ అందిస్తామని ఎన్హెచ్ఎస్ వెల్లడించింది. పంజాబ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయని తమ లేఖలో జాతీయ ఆరోగ్యశాఖకు వివరించారు.