Teacher suspend
-
లీటరు పాలు..81 మంది విద్యార్థులకు
సోన్‌భద్ర: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఎంత దారుణంగా అమలవుతుందో తెలిపే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా చోపన్ బ్లాక్‌లోని కోటా గ్రామ పంచాయతీలో ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సలాయి బన్వా ప్రాథ మిక పాఠశాలలో 81 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి రోజూ మధ్యాహ్నం గ్లాసు పాలు అందించాల్సి ఉంటుంది. పాఠశాల నిర్వాహకుడు (శిక్షామిత్ర)మాత్రం లీటరు పాలు తెప్పించి, వాటిని బకెట్ నీళ్లలో కలిపి ఒక్కో విద్యార్థికి అరగ్లాసు చొప్పున అందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగన్ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల నుంచి వివరాలను తెలుసుకుని ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మిర్జాపూర్ జిల్లా సియూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఒక మహిళ రొట్టెలు, మరో మహిళ ఉప్పు పంచుతున్న వీడియో ఒకటి ఆగస్టులో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా అధికారులు అప్పట్లో హడావుడి చేశారు. -
మరో వికెట్ ఔట్ !
– ఏడాదిగా బినామితో పని చేయిస్తున్న టీచర్ – డీఈఓ ఆకస్మిక తనిఖీలో బట్టబయలు – సస్పెన్షన్ వేటు వేసిన డీఈఓ అనంతపురం ఎడ్యుకేషన్/ నల్లమాడ : జిల్లా విద్యాశాఖ అధికారిగా శామ్యూల్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఉపాధ్యాయులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా వేళలు, చెప్పాపెట్టకుండా గైర్హాజరు అంశాలపై డేగకన్ను ఉంచారు. ఈ క్రమంలోనే తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యవైఖరి అవలంభించే వారిపై ఇప్పటికే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నల్లమాడలో చాంప్లానాయక్ అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. డీఈఓ మంగళవారం ఉదయం 10.50 గంటలకు నల్లమాడ మండలం డి.రామాపురం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. వాస్తవానికి ఇక్కడ చాంప్లానాయక్, రమాదేవి అనే ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. చాంప్లానాయక్ హెచ్ఎంగా ఉంటున్నారు. తోటి టీచరుకు ఆదర్శంగా ఉండాల్సిన ఈయన ఏడాదిగా అక్కడ తన స్థానంలో బినామీ టీచర్ (మహిళ)ను పెట్టాడు. డీఈఓ తనిఖీలో ఈయనతో పాటు బినామీ టీచరు దొరికిపోయారు. డీఈఓ గ్రామస్తులతో విచారించారు. ఏడాదిగా చాంప్లానాయక్ టీచర్‌ను చూడలేదని ఆయన స్థానంలో మరో మహిళ టీచరు వస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో చాంప్లానాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. -
విధులకు డుమ్మాకొట్టిన టీచర్ సస్పెండ్
కడప ఎడ్యుకేషన్ (వైఎస్సార్ జిల్లా): నెల రోజులుగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడిని డీఈవో గురువారం సస్పెండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం ఒడ్డిపాళెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జనార్దన్‌రెడ్డి నెల రోజులుగా విధులకు డుమ్మాకొడుతున్నారు. డీఈవోకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్ అయిన టీచర్‌ను డీఈవో సప్సెండ్చేశారు. -
విద్యార్థి వెంట్రుకల్ని కత్తిరించినందుకు.. మహిళా టీచర్ సస్పెన్షన్
విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు ఓ ఉపాధ్యాయురాలు తగిన మూల్యం చెల్లించింది. ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆమెపై పోలీసు కేసు నమోదు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని నెడుమంగడు పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎనిమిదో తరగతి చదువుతున్న13 ఏళ్ల విద్యార్థికి కఠిన శిక్ష వేసింది. వెంట్రుకలు పొడవుగా ఉన్నాయనే కారణంతో బలవంతంగా వాటిని కత్తిరించింది. ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. బాలుడి తండ్రి టీచర్‌పై పోలీసు కేసు నమోదు చేశాడు. చాలామంది విద్యార్థులకు ఇలాంటి అనుభవం ఎదురైందని, అయితే ఒక ఫిర్యాదు మాత్రమే వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్ చేస్తోంది.