విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు ఓ ఉపాధ్యాయురాలు తగిన మూల్యం చెల్లించింది. ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆమెపై పోలీసు కేసు నమోదు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని నెడుమంగడు పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎనిమిదో తరగతి చదువుతున్న13 ఏళ్ల విద్యార్థికి కఠిన శిక్ష వేసింది. వెంట్రుకలు పొడవుగా ఉన్నాయనే కారణంతో బలవంతంగా వాటిని కత్తిరించింది.
ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. బాలుడి తండ్రి టీచర్పై పోలీసు కేసు నమోదు చేశాడు. చాలామంది విద్యార్థులకు ఇలాంటి అనుభవం ఎదురైందని, అయితే ఒక ఫిర్యాదు మాత్రమే వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని యువత డిమాండ్ చేస్తోంది.
విద్యార్థి వెంట్రుకల్ని కత్తిరించినందుకు.. మహిళా టీచర్ సస్పెన్షన్
Published Fri, Dec 6 2013 2:09 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement