teachers asosiation
-
టీఆర్టీ నియామకాలు చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: టీచర్స్ రిక్రూట్‌మెంట్‌మెం ట్టెస్ట్ (టీఆర్టీ) నియామకాలు వెంటనే చేపట్టా లని టీపీటీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని టీపీటీఎఫ్ తలపెట్టిన నిరసన ర్యాలీ సంఘం కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మనో హర్రాజు మాట్లాడుతూ నిరుద్యోగ విద్యావంతులైన యువకులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయ ని ఆశించారని, అవి అమలుకు నోచుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో పోరాటం చేసిన యువత ప్రస్తుతం నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. ఉద్యమాలు చేయకముం దే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులకు సంవత్సర నుంచి ఇవ్వాల్సిన కరవుభత్యం (డీఏ) ఈ నెలలో ప్రకటించారని, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన డీఏ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పీఆర్సీ వెంటనే కొత్త స్కేల్‌ను ప్రకటించాలన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, నర్సింహారావు, ప్రసాదరావు, నాగేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి పాల్గొన్నారు. -
రోహిత్ కులాన్ని ఎన్ని సార్లు పరీక్షిస్తారు?
సాక్షి, హైదరాబాద్: దళితులు మరణించిన తరువాత కూడా పదేపదే తమ కులాన్ని రుజువు చేసుకోవాల్సి రావడం దారుణమని హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ కన్వీనర్ ప్రొఫెసర్ సుధాకర్ బాబు అన్నారు. సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రోహిత్ వేముల కులాన్ని ఎన్నిసార్లు ధృవీకరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు సార్లు రోహిత్ దళితుడని ప్రభుత్వమే ధృవీకరించిందని, జాతీయ ఎస్సీ కమిషన్ అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఇప్పటికైనా కులంపై చర్చకు స్వస్తిపలికి, రోహిత్ మరణానికి కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రొఫెసర్ లక్ష్మినారాయణ అన్నారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రిని కలిసినట్లు తెలిపారు. రోహిత్‌ను భరత మాత ముద్దుబిడ్డగా పేర్కొన్న ప్రధాని మోదీ అతను దళితుడన్న విషయాన్ని చెప్పలేదని ప్రొఫెసర్ రత్నం అన్నారు. రోహిత్ కేసులో జాప్యాన్ని ప్రశ్నించినందుకు తమను జైల్లో పెట్టారన్నారు. ప్రొఫెసర్ క్రిష్ణ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని కోరారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు అన్నారు.