teaching staff
-
ఫీజులు గుంజేసి.. బకాయిలు మింగేసి! హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాకాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా విపత్తులోనూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు యాజమాన్యం అధ్యాపకులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై ప్రధాని కార్యాలయంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గండిపేట సమీపంలో హైస్కూలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. కాలేజీల్లో 900 మందికి పైగా, హైసూ్కల్లో 500 మంది వరకు విద్యార్థులున్నారు. విద్యార్థుల నుంచి ఏటా రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జీతాల్లో 50 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నామని, ఫీజులు వసూలయ్యాక మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని 2020 మే 20వ తేదీన జూమ్ మీటింగ్‌లో ఎనీ్టఆర్ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్ సిబ్బందికి హామీ ఇచ్చారు. వంద మంది బోధనా సిబ్బంది, 20 మందికి పైగా బోధనేతర సిబ్బంది ఇక్కడ పని చేస్తుండగా రూ.పది వేలకు మించి జీతాలు చెల్లిస్తున్న వారికి 16 నెలలు కోత విధించారు. పలువురు అధ్యాపకులకు రూ.2 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు జీతాల బకాయిలను ట్రస్టు చెల్లించాల్సి ఉంది. కరోనా కష్టకాలంలోనూ కళాశాల నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించిన తమకు కనీసం హెల్త్‌కార్డులు ఇవ్వలేదని, గ్రాట్యుటీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు. వసూలు చేసుకుని.. సిబ్బందికి చెల్లించలేదు.. కరోనా సమయంలో ఫీజులు రాలేదని పేర్కొన్న యాజమాన్యం ఆ తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నా.. సిబ్బందికి మాత్రం బకాయిలు చెల్లించలేదు.. ట్రస్టు సీఈవో, డీన్, ప్రిన్సిపాల్, ట్రస్టీలకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం.. చివరకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌కు తెలియజేసినా కూడా పట్టించుకోలేదు.. అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిర్వాహకులను కోరినందుకు ఓ లెక్చరర్‌ను రెండు గంటల్లో ఇంటికి సాగనంపారు. మరో లెక్చరర్ నుంచి క్షమాపణ లేఖ తీసుకుని హెచ్చరించారు. 9 మందికి లీగల్ నోటీసులు బకాయిల గురించి యాజమాన్యం స్పందించకపోవడంతో తొమ్మిది మంది లెక్చరర్లు ట్రస్టు సీఈవోతో సహా నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపారు. ఏ నెల జీతంలో ఎంత కోత విధించారనే వివరాలను నోటీసుల్లో పొందుపరిచారు. చదవండి: ‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు -
కొత్త కొలువుకు ఇరకాటం!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్‌రెడ్డి (పేరు మార్చాం) ఇటీవల ఆ కాలేజీలో కొలువుకు రాజీనామా చేశారు. అదే ప్రాంతంలో మరో కాలేజీలో మంచి వేతనానికి ఉద్యోగంలో చేరారు. అయితే ఇదివరకు పనిచేసిన కాలేజీ ఆన్లైన్ రికార్డులో వెంకట్‌రెడ్డి పేరు తొలగించలేదు. ఈ ప్రొఫైల్ తొలగింపు అధికారం కాలేజీ యాజమాన్యానికి మాత్రమే ఉండటంతో పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఆ కాలేజీ రికార్డులో ఆయన పేరు తొలగించలేదు. పూర్వపు కాలేజీలో పేరు తొలగిస్తే తప్ప కొత్త కాలేజీలో కొలువులో చేరే అవకాశం లేదు. దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆయన ప్రొఫైల్ డిలీట్ కాకపోవటంతో కొత్త కాలేజీ యాజమాన్యం అతనికి ఇచ్చిన అవకాశాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వెంకట్‌రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అనేకమంది బోధన సిబ్బంది ఎదుర్కొంటున్న సంకటస్థితి. ఈ సమస్యతో మెరు గైన అవకాశాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య, ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బందికి సంబంధించిన నియామక నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం.. ప్రతి బోధకుడి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడంతోపాటు రోజువారీ హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ నంబర్సహా బోధకుడి పూర్తి సమాచారాన్ని ఆయా కాలేజీ యాజమాన్యాలు కంప్యూటరీకరించి.. వివరాలను వర్సిటీ లేదా సంబంధిత బోర్డు పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ విధానంతో ఒక వ్యక్తి ఒకేచోట మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి కాలేజీ మారితే అతని వివరాలను పాత యాజమాన్యం వెబ్సైట్నుంచి తొలగిస్తేనే మరో కాలేజీలో చేరేందుకు వీలుంటుంది. కొత్త కాలేజీలో కూడా ఆన్లైన్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశాక కొలువులో చేరాల్సి ఉంటుంది. కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చి న ఈ అధికారం తమకు కొత్త అవకాశాలు రాకుండా చేస్తోందని అధ్యాపకులు గగ్గోలు పెడుతున్నారు. నిర్లక్ష్యంతో ఇబ్బందులు.. రాష్ట్రంలో మూడు వందలకుపైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో దాదాపు 80 వేల మంది బోధన సిబ్బంది అవసరం. కానీ చాలాచోట్ల సిబ్బందిని రికార్డుల్లో మాత్రమే కాలేజీ యాజమాన్యాలు చూపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 30 వేల నుంచి 35 వేల మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెపు తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి యాజమాన్యాలు తగిన వేతనాలు ఇవ్వకపోవడం, కొందరికి మంచి అవకాశాలు రావడంతో ఇతర సంస్థల్లో చేరడం వంటి ఘటనలు సహజంగా జరిగిపోతుంటాయి. కాలేజీ మారాలనుకున్న వారి వేతనాన్ని పూర్తిగా చెల్లించి, వారి వివరాలను తమ వెబ్సైట్ నుంచి తొలగించాలి. కానీ, పలు కాలేజీలు ఉద్యోగుల వివరాలను తొలగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టించుకోని వర్సిటీ అధికారులు.. కొలువు మారాలనుకున్న కొందరు ఉద్యోగులు రాజీనామాలు సమర్పించినప్పటికీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించడం లేదంటూ ఇటీవల పెద్ద సంఖ్యలో జేఎన్టీయూహెచ్కు ఫిర్యాదులు వచ్చాయి. కొందరైతే నేరుగా వర్సిటీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కాలేజీ అనుబంధ గుర్తింపు ప్రక్రియ సమయంలో వర్సిటీ అధికారుల తనిఖీలో కాలేజీ వెబ్సైట్లో పేర్కొన్న ఉద్యోగులంతా ప్రత్యక్షంగా హాజరు కావాలి. జాబితా ప్రకారం ఉద్యోగులు పనిచేయకుంటే గుర్తింపును నిలిపివేయాలి. కానీ పలు కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారులకు తాయిలాలిస్తూ మొక్కుబడి తనిఖీ చేయించి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. తాము ఆ కాలేజీలో పనిచేయడం లేదని ఉద్యోగులు వర్సిటీకి ఫిర్యాదు చేస్తే.. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తనిఖీలతోనే నిజాలు వెల్లడి ఉద్యోగుల సంఖ్య, హాజరు, పనితీరుపైన ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో జేఎన్టీయూ, సంబంధిత అధికారులు తనిఖీ లు నిర్వహించాలి. వీటిల్లో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఫిర్యాదులు వచ్చిన కాలేజీల్లోనైనా తనిఖీలు చేపడితే బాగుంటుంది. ఉద్యోగుల ప్రొఫైల్ యాడింగ్ ఆప్షన్ యాజమాన్యానికి ఇచ్చి, డిలీషన్ ఆప్షన్ ఉద్యోగికే ఇవ్వాలి. దీంతో యాజమాన్యాలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తాయి. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ప్రొఫైల్ డిలీట్ చేయడం లేదనే అంశంపై వర్సిటీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం శోచనీయం. – డాక్టర్ శ్రీనివాస్ వర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
‘కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్’లో నియామకాలు సరికాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు బోధన సిబ్బంది పోస్టులను శాశ్వత పద్ధతిలో కాకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలా ఏళ్ల తరబడి చేస్తున్న నియామకాల వల్ల ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ అమలు కావడం లేదని ఆక్షేపించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైనవారిని తొలగించి ఏటా మళ్లీ కొత్త వారి కోసం వర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయని.. ఇది ఏమాత్రం సహేతుకం కాదని తెలిపింది. మంజూరు చేసిన పోస్టుల్లో అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన నియమించకపోవడం వల్ల ఆయా వర్సిటీల నుంచి ప్రతిభావంతులైన గ్రామీణ యువతను తయారు చేయాలన్న ఉద్దేశం నెరవేరకుండా పోతుందని విచారం వ్యక్తం చేసింది. అంతిమంగా విద్యార్థుల జీవితాలు కూడా ప్రభావితం అవుతున్నాయంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్, తాత్కాలిక బోధన సిబ్బంది నియామకం కోసం ఆర్జేయూకేటీ రిజిస్ట్రార్ ఈ ఏడాది జనవరి 8న జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపేసింది. పిటిషనర్లను తొలగించవద్దని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, వర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా, కాంట్రాక్ట్ పద్ధతిలో బోధన సిబ్బంది నియామకం కోసం ఆర్జేయూకేటీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కుంచెం గణేశ్‌రెడ్డి, మరో 10 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
అక్కడా.. ఇక్కడా కుదరదు
సాక్షి, సిటీబ్యూరో: అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది వివరాలను జేఎన్టీయూహెచ్కు ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. ప్రతి సంవత్సరం అనుబంధ కళాశాలలు ఆయా పోర్టల్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల వివరాలను జేఎన్టీయూహెచ్కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. తరగతులు ప్రారంభమై 20 రోజులకు పైగా గడుస్తుండటంతో ఇప్పటికీ వివరాలను ఇవ్వని కళాశాలలకు ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరి.. ప్రతి కాలేజీలో పనిచేసే బోధనా సిబ్బంది తమ అర్హతలు, అనుభవం, పనిచేసే కాలేజీ, అందులో చేరిన రోజు, లేటెస్ట్ ఫొటో తదితర అన్ని విషయాలను వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్యాకల్టీకి ఒక ఐడీ నెంబర్‌ను ఇస్తారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థలు దరఖాస్తుచేసుకునే సమయంలోనే జేఎన్టీయూహెచ్కు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ ఐడీని అందజేయాల్సి ఉంటుంది. శుక్రవారం వరకు జేఎన్టీయూహెచ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 83, 543 మంది ఉన్నారు. గతంలో ఈ విధానం లేకపోవడంతో.. 2015 సంవత్సరానికి ముందు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ విధానం లేకపోవడంతో చాలా వరకు ఇంజినీరింగ్ కళాశాలలు వేల రూపాయల ఫీజులు చెల్లించడం ఇష్టం లేక మొక్కుబడిగా అధ్యాపకులను నియమించుకునే వారు. ఒక్కరే అధ్యాపకులు ఐదు, ఆరు కళాశాలల్లో కూడా పనిచేసే వారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు జేఎన్టీయూహెచ్ ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రతి అధ్యాపకుడి నుంచి పాన్‌కార్డు, ఆధార్ కార్డును ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కరే అధ్యాపకులు పలు కళాశాలల్లో పనిచేసే విధానం పోయింది. దీనికి తోడు బీటెక్ స్థాయి విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు ఎంటెక్ విద్యార్హత తప్పనిసరి అయినా బీటెక్లతోనే నెట్టుకు వస్తుండటంతో ఈ పోర్టల్‌లో ఎంటెక్ డిగ్రీ సర్టిఫికెట్‌ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ఎంటెక్ పూర్తి చేసిన వారినే కళాశాలలు అధ్యాపకులుగా నియమించుకుంటున్నారు. అంతేగాకుండా బోధనా సిబ్బంది తాము పనిచేస్తున్న కళాశాలను మారాల్సి వచ్చినా ముందుగానే సంబంధిత కళాశాలకు తెలిపి రిలీవింగ్ లెటర్ తీసుకుని ఇతర కళాశాలకు మారాల్సి ఉంది. అవకతవకలకుఅవకాశమే లేదు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించాక అవకతవకలకు అవకాశమే లేదు. ప్రతి సంవత్సరం జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు అప్లియేషన్ పోర్టల్‌లో ప్రస్తుత ఫ్యాకల్టీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా ఎంత మంది ఫ్యాకల్టీని చేర్చుకున్నారు, ఎంత మందిని తొలగించారు అనే వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంది. – ఎన్.యాదయ్య,జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ -
పీజీ ప్రవేశాలు..చాలా లేజీ
సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అఫిలియేషన్ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు అరకొరగానే జరిగాయి. కొన్ని కోర్సుల్లో ప్రవేశాలు జరగలేదు. వర్సిటీలో పీజీ సెట్ కౌన్సెలింగ్‌కు 727 మంది హాజరయ్యారు. పీజీ సెట్లో 871 మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయిం చారు. ప్రస్తుతం సీటు లభించిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాలి. నిబంధనల మేరకు ఫీజులు చెల్లిస్తేనే సీటు ఖరారు అవుతుంది. ఈ నెల 19లోపు ఈ ప్రక్రియ ముగుస్తుంది. 20, 21 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సీట్లు సగానికి పైగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కనీస ప్రవేశాలు జరగని కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత సెట్ నిర్వహిస్తారా? స్పాట్ ప్రవేశాలు కల్పిస్తారా? ప్రవేశాలతోనే తరగతులు నెట్టుకువస్తారా అన్న అంశం అధికారులు తీసుకునే నిర్ణయంపై ఆధార పడుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 569 సీట్లు ఉండగా, 252 ప్రవేశాలు జరిగాయి. 317 సీట్లు ఖాళీగా మిగిలి పోయాయి. అఫిలియేషన్ కళాశాలల్లో 544 సీట్లు ఉండగా, 134 ప్రవేశాలు జరిగాయి. 410 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. వర్సిటీ, అఫిలియేషన్ కళాశాలల్లో 1113 సీట్లు ఉండగా, 386 ప్రవేశాలు జరిగాయి. 727 సీట్లు మిగిలిపోయాయి. మరో పక్క అనుబంధ కళాశాలల్లో సైతం కనీస ప్రవేశాలు లేవు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో తెలుగులో రెండు, ఎంకాంలో నాలుగు ప్రవేశాలు జరిగాయి. ప్రభుత్వ మహిళలు కళాశాలల్లో తెలుగులో ఒక్కరూ చేరలేదు. గతంలో తెలుగు పీజీకి డిమాండ్ ఉండేది. ఈ ఏడాది వర్సిటీలో సైతం ప్రవేశాలు మెరుగ్గా జరగలేదు. లైఫ్ సైన్స్‌లో డిమాండ్ ఉన్న జువాలజీ కోర్సు ఒక్క మహిళా డిగ్రీ కళాశాలలో మాత్రమే ఉండగా ఎనిమిది ప్రవేశాలు మాత్రమే జరిగాయి. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఎంఈడీలో ఈ ఏడాది కనీస ప్రవేశాలు జరగ లేదు. డీఎడ్, డిగ్రీ పూర్తిచేసిన వారికి అనుమతి ఇచ్చినా కనీస ప్రవేశాలు జరగ లేదు. వర్సిటీలో ఎంఈడీలో ఆరు ప్రవేశాలు జరగ్గా, రంగముద్రి, బీఎస్‌జేఆర్‌లో కనీసం ఒక్క ప్రవేశం జరగ లేదు. గతంలో ఎంకాంకు డిమాండ్ ఉండేది. వర్సిటీలో 40 సీట్లు ఉన్న కోర్సు 50 సీట్లుగా ఈ ఏడాది పెంచారు. వర్సిటీలో 35 ప్రవేశాలు జరగ్గా, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నాలుగు ప్రవేశాలు జరిగాయి. ప్రజ్ఞ కళాశాలలో ఒక్క ప్రవేశం జరగ లేదు. వర్సిటీ క్యాంపస్‌లో... పీజీ కోర్సు సీట్లు ప్రవేశాలు బయోటెక్నాలజీ 30 24 మైక్రోబయోలజీ 20 15 జియోఫిజిక్స్ 15 06 ఫిజిక్స్ 40 27 గణితం 40 31 ఎననాటికల్ కెమిస్ట్రీ 20 15 ఆర్గానిక్ కెమిస్ట్రీ 29 27 జియోలజీ 15 01 ఎకనమిక్స్ 40 06 రూరల్ డెవలప్మెంట్ 40 13 సోషల్ వర్క్ 40 04 ఎంఈడీ 40 06 ఎంజేఎంసీ 30 07 ఎంఎల్ఐఎస్సీ 30 07 ఇంగ్లీష్ 40 11 తెలుగు 40 17 ఎంకాం 50 35 బోధన సిబ్బందే ఎక్కువ! పీజీ ప్రవేశాలను పరిశీలిస్తే కొన్ని కోర్సుల్లో చేరిన విద్యార్థులు కంటే బోధన సిబ్బంది ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు ప్రతి పీజీ కోర్సులో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. ఈ మేరకు బోధన ఇబ్బంది ఉంటేనే 12(బి), నాక్, ఎన్బీఏ వంటి గుర్తింపులు వస్తాయి. అందుకే యూజీసీ నిబంధనల మేరకు వర్సిటీల్లో పోస్టులు కొనసాగిస్తారు. మరో వక్క వర్సిటీలో ఐదు ప్రొఫెసర్, 14 అసోసియేట్ ప్రొఫెసర్, రెండు బ్యాక్ లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తిచేయగా, 33 అసిస్టెంట్ ప్రొఫసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవి వాయిదా పడ్డాయి. జియాలజీలో నలుగురు బోధన సిబ్బంది ఉండగా ఒక్కరే చేరారు. ఎకనామిక్స్‌లో ఐదుగురు బోధన సిబ్బంది ఉండగా ఆరుగురు చేరారు. సోషల్ వర్క్‌లో ముగ్గురు రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ఇద్దరు కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. మరో పక్క ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పరిధిలో ఉన్నాయి. ఈ కోర్సుల్లో నలుగురు విద్యార్థులు చేరారు. ఎంఈడీలో ఆరుగురు డాక్టరేట్ చేసిన సిబ్బంది ఉండగా, ఆరుగురు విద్యార్థులు చేరారు. ఎంఎల్ఐఎస్సీ, ఇంగ్లీష్, ఎంజేఎంసీలో కనీస ప్రవేశాలు లేవు. -
విరమణ పెంపు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లోని బోధనావైద్యుల ఉద్యోగ విరమణ వయసు పొడిగింపుపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన వైద్యుల విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మూడు నెలల కిందట రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలుగాని, ఉత్తర్వులుగాని విడుదల కాలేదు. దీంతో విరమణ పొందుతున్న, పొందడానికి సిద్ధంగా ఉన్న బోధన వైద్యుల్లో ఆందోళన నెలకొంది. విరమణ వయసు పొడిగింపు యోచనను కొన్ని ప్రభుత్వ వైద్యుల సంఘాలు వ్యతిరేకిస్తుండగా, మరికొన్ని సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరమణ వయసు పొడిగింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న వాదనలు వినిపించాయి. అయితే ‘మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా వెనక్కు తీసుకుంటుంది. బదిలీలు, ఇతరత్రా అంశాలున్నందున కొంత విరామం తీసుకున్నాం. అంతే తప్ప విరమణ పొడిగింపుపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయి’అని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఇటీవల చెప్పాయి. ఇతర ఉద్యోగుల నుంచీ పెంపు డిమాండ్ వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, నిమ్స్ సహా ఆదిలాబాద్ రిమ్స్, మహబూబ్‌నగర్, సిద్దిపేట తదితర స్వయం ప్రతిపత్తి, పాక్షిక స్వయం ప్రతిపత్తి గల వైద్య కళాశాలన్నింటిలోనూ విరమణ పెంపు విధానం అమలులోకి తీసుకురావాలనేది సర్కారు ఆలోచన. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రభు త్వం విరమణ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. గతేడాది 220 పీజీ సీట్లు అదనంగా రాష్ట్రానికి వచ్చా యి. ఈ ఏడాది మరో 40 పీజీ సీట్లను ఇదే ప్రాతిపదికన ఎంసీఐ పెంచింది. ఈ సమయంలో వైద్యుల విరమణ పొందితే పీజీ సీట్లకు కోత పడుతుందనేది సర్కారు భావన. అందుకే విరమణ వయ సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు అంటే ఏడేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఎన్డీఏలో ఐదుగురు సిబ్బందిపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు బోధనా సిబ్బందిపై సీబీఐ బుధవారం కేసు నమోదుచేసింది. బోధనారంగంలో అనుభవం, పనీతీరుపై నకిలీ సర్టిఫికెట్లతో ఈ ఐదుగురు నిందితులు ఎన్డీఏలో ఉద్యోగాలు పొందారని అరోపించింది. కేసు నమోదుచేసిన అనంతరం సీబీఐ అధికారులు ఖడక్వాస్లాలోని ఎన్డీఏ ప్రాంగణంతో పాటు నిందితుల ఇళ్లపై దాడిచేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్ స్పందిస్తూ.. పుణేలో ఉన్న ఎన్డీఏ–ఖడక్వాస్లా ప్రిన్సిపాల్ ఓంప్రకాశ్ శుక్లా, ప్రొఫెసర్ జగ్మోహన్ మెహెర్(పొలిటికల్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్లు వనీతా పూరి (కెమిస్ట్రీ), రాజీవ్ బన్సల్(గణితం), కెమిస్ట్రీ విభాగం హెచ్‌వోడీ మహేశ్వర్ రాయ్‌పై కేసు నమోదుచేశామని తెలిపారు. అలాగే యూపీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి(హెచ్‌క్యూ–ఐడీఎస్) చెందిన గుర్తుతెలియని అధికా రిపైన కూడా కేసు నమోదుచేశామన్నారు. ఖడక్వాస్లాలోని ఎన్డీఏలో 13 మంది అర్హతలేని బోధనా సిబ్బంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై గతేడాది ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు గౌర్ తెలిపారు. సాధారణంగా ఎన్డీఏలో బోధనా సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందనీ, యూపీఎస్సీ సిఫార్సు ఆధారంగా రక్షణశాఖ నియామకాలు చేపడుతుందని పేర్కొన్నారు. యూపీఎస్సీతో పాటు హెచ్‌క్యూ–ఐడీఎస్‌లోని కొందరు అధికారుల సాయంతో ఈ ఐదుగురు నిందితులు 2007–08, 2012–13 మధ్యకాలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో కేసు నమోదుచేశామని వెల్లడించారు. -
వెట్టి కన్నా ఘోరం
సాక్షి, అమరావతి : అక్కడ పని వెట్టి కన్నా ఘోరం. చట్టాలు, నియమ నిబంధనలూ అస్సలు పట్టవు. ఉద్యోగం ఎన్నాళ్లుంటుందో... ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇచ్చే వేతనాలూ అరకొర... అవీ ఎప్పుడిస్తారో దేవుడికే ఎరుక. ఇక మహిళల పరిస్థితి మరింత దారుణం. లైంగిక వేధింపులు షరా మామూలే. గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన సెలవులు వీరికి వర్తించవు. ఇలా ఎన్ని చెప్పుకొన్నా తరగని ఈ వెతలు ప్రైవేటు విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందివి. నియమాలు చట్టుబండలు... రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కేవలం హైస్కూలు స్థాయి వరకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కువ ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఈడీ, డీఈడీ ఇలా ఇతర కాలేజీలన్నీ అత్యధికం ప్రైవేటులోనే ఉన్నాయి. విద్యార్ధులూ ప్రభుత్వ సంస్థల్లో కన్నా ప్రైవేటులోనే అత్యధికంగా ఉన్నారు. వీరి నుంచి కోట్ల కొద్దీ సొమ్మును ఫీజుల రూపేణా వసూలు చేస్తున్న ఈ సంస్థలు.. సిబ్బందికి చెల్లించేది మాత్రం నామమాత్రమే. స్కూళ్లు, కాలేజీల్లో కలిపి దాదాపు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పనిచేస్తున్నట్లు అంచనా. సిబ్బంది గురించి స్పష్టమైన గణాంకాలను ఆయా సంస్థలు ఇవ్వకుండా రికార్డులను వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు వేలల్లో∙ఉన్నాయి. వీటిలో దాదాపు 5.5 నుంచి 6 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 61 వేల బడుల్లో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య తక్కువే అయినా మొత్తం 72 లక్షల మందిలో సగం వీటిల్లోనే చదువుతున్నారు. ఇంటర్మీడియెట్‌లో 9 లక్షల మంది విద్యార్థులుండగా వీరిలో కేవలం 2 లక్షల మందే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. మిగిలిన వారు ప్రైవేటులోనే ఉన్నారు. డిగ్రీ కళాశాలల విషయంలోనూ ఇదే పరిస్థితి. దయనీయ పరిస్థితులు బీఈడీ, ఎంఈడీ సహా పలు విద్యార్హతలున్న వారికి సైతం ఇచ్చేది రూ.10 నుంచి రూ.15 వేలే. అదికూడా 10 నెలలే. ఏడాదిపాటు చెప్పాల్సిన సిలబస్‌ను 5 నెలల్లో ముగించి టీచర్లను బయటకు పంపేస్తున్నారు. సీనియారిటీ పెరిగిన ఉద్యోగులకు వేతనాలుపెంచాల్సి వస్తుందన్న కారణంతో అకారణంగా ఉద్యోగం మానిపిస్తున్నారు. స్కూల్/కాలేజీల్లో పిల్లల్ని చేర్పించే టీచర్ల మీదే మోపుతున్నారు. ఇందులో టార్గెట్లు చేరుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీçసుకొని, ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఆదివారాలు, పండగలు, జాతీయ పర్వదినాల్లోనూ సిబ్బందికి సెలవు ఇవ్వరు. సరైన వసతులు ఉండవు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నిల్చునే పనిచేయాలి. మహిళల పరిస్థితి మరీ దారుణం.. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. మెటర్నీటీ లీవులు లేవు. నిండు గర్భంతో ఉన్నా విధులకు రావాల్సిందే. లేదంటే ఉద్యోగం మానుకోవాలి. కొన్ని సంస్థల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులూ జరుగుతున్నాయి. అవేవీ బయటకు రాకుండా యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయి. ఈ సంస్థల్లో విద్యార్ధులే కాదు టీచర్లూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చట్టం ఏం చెబుతోందంటే... ప్రభుత్వ పాఠ్యప్రణాళికను, పాఠ్యాంశాలను, సమయవేళలను తప్పనిసరిగా అనుసరించాలి. విద్యాసంస్థలను వ్యాపార దృక్పథంతో నడపరాదు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. పీఎఫ్ వంటి ప్రభుత్వ నిబంధనలను టీచర్లకు, సిబ్బందికి వర్తింపచేయాలి. ఫీజుల్లో 5 శాతం మేనేజ్మెంటు ఉంచుకోవచ్చు, 15 శాతం స్కూలు నిర్వహణకు, 50 శాతం వేతనాలకు వినియోగించాలి. 15 శాతం మొత్తాన్ని సిబ్బంది గ్రాట్యుటీ, ప్రావిడెంటు ఫండ్, ఇన్సూరెన్సుల కింద మేనేజ్మెంటు వాటాగా చెల్లించడానికి వినియోగించాలి. ఉద్యోగుల్ని ఏకపక్షంగా తొలగించే అధికారం యాజమాన్యానికి లేదు. విధి నిర్వహణలో సరిగా లేకుంటే ఇంక్రిమెంట్ల కోత, సీనియార్టీ తగ్గింపు, అలవెన్సుల్లో కోత, వంటివి విధించవచ్చు. -
వృత్తి విద్యాబోధకులను క్రమబద్ధీకరించాలి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్‌సెంటర్) : ఏపీ సర్వశిక్ష అభియాన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద విధానంలో పనిచేయుచున్న ఆర్ట్, వర్క్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశం ఆదివారం తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరాముల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు హాజరై మాట్లాడుతూ వృత్తి విద్యాబోధకులకు అండగా ఉంటామన్నారు. చేస్తున్న ఉద్యమాలకు తప్పక సహకరిస్తామన్నారు. ప్రభుత్వానికి వృత్తి విద్యా బోధకుల సమస్యలను తీసుకువెళతామన్నారు. వీర్ల శ్రీరాములు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలీచాలనీ వేతనాలతో తాము పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వం బేషరతుగా 60 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి.చినబాబు, భాస్కరరావు, సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతకుమారి, సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అదనపు బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామా
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న మెంటార్లు, ఫ్యాకల్టీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర సిబ్బంది అందరూ తమకు అదనంగా అప్పగించిన బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. తాము బోధన బాధ్యతతో పాటు విద్యా సంస్థ శ్రేయస్సు దృష్ట్యా మిగిలిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు యాజమాన్యం తమకు అండగా ఉండటం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో అదనపు బాధ్యతలకు రాజీనామా చేస్తున్నామని డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసుకు రాజీనామా పత్రం అందజేశారు. రాజీనామాకు అసలు కారణం ఇదే.. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఈ నెల 14న దబ్బాడ రమాదేవి ఆత్మహత్య విషయాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు సకాలంలో పోలీసులకు తెలపలేదు. ఉదయం 5.30 గంటలకు ఘటన జరిగితే 11.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అదేరోజు రాత్రి డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చీఫ్‌వార్డెన్ ఫణికుమార్‌ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ విషయం తెలుసుకుని బోధనా సిబ్బంది అంతా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లడంతో ఫణికుమార్‌ను పంపించేశారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడితే చీఫ్ వార్డెన్ ఎలా బాధ్యుడవుతారని సిబ్బంది ప్రశ్నించడంతో పాటు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన విషయంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గాని, వైస్ చాన్సలర్ గాని చీఫ్ వార్డెన్‌కు అండగా నిలబడలేదని సిబ్బంది పేర్కొంటున్నారు. తామందరం అదనంగా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంతో గడిపే సమయాన్ని సైతం కోల్పోతుంటే, చీఫ్ వార్డెన్‌ను పోలీసులు తీసుకెళ్తుంటే డైరెక్టర్ గాని, వీసీ గాని ఎందుకు ఒక్కమాట కూడా పోలీసులకు చెప్పలేదని వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతోనే వారంతా కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అదనపు పదవులన్నింటికి రాజీనామా.. ట్రిపుల్‌ఐటీలో దాదాపు 60 మంది బోధనా సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఫైనాన్స్ అధికారి నుంచి హెచ్వోడీలు, హాస్టల్ వార్డెన్లు, చీఫ్ వార్డెన్లు, మెస్ ఇన్చార్జిలు, మెస్ కమిటీ సభ్యులు, ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారులు, కోఆర్డినేటర్లు, హౌస్ కీపింగ్ కమిటీ ఇన్చార్జిలు, సెక్యూరిటీ గార్డు కమిటీ ఇన్చార్జిలు, ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జిలు, డీన్ అకడమిక్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్, విద్యార్థుల క్రమశిక్షణ కమిటీ, ఇలా అనేక కమిటీల బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. దీనిపై డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు 15 రోజుల గడువు కోరగా, అలాంటిదేమీ లేదని తిరస్కరించారు. -
ప్రైవేట్ విద్యాసంస్థల ‘తనిఖీ’ తప్పదా?
చాలా ప్రైవేట్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు అనే విషయం బహిరంగ రహస్యం. ఇక్కడ మౌలిక సదుపాయాలు అంటే మొదటిది. టీచింగ్ స్టాఫ్. రెండవది నాన్ టీచింగ్ స్టాఫ్. మూడవది ప్రయోగశాలలు, నాలుగవది తరగతి గదులు మొదలైనవి. వీటిలో ఒక్కొక్క దానిని గురించి పరిశీ లించినట్లయితే మొదటిది టీచింగ్ స్టాఫ్. చాలా కళాశాలలు సరిపడా అధ్యాపకులను నియమించు కోవడం లేదు. ఉదాహరణకు ఒక కళాశాల బీఎస్సీ, బీజెడ్‌సీకి రెండు సెక్షన్లకు అనుమతి తీసుకుని ఒకే సెక్షన్‌కి అధ్యాపకుడిని నియమించుకుని కళాశాలను నడ పడం. పోనీ.. ఆ అధ్యాపకుడు అయినా ఆ కళాశా లలో ఫుల్‌టైమ్ చేస్తాడా అంటే అదీ ఉండదు. ఒకే అధ్యాపకుడు అదే పట్టణంలో రెండు మూడు కళాశా లల్లో బోధిస్తాడు. దీనివలన కళాశాలలు వేతనాలు తగ్గించుకుని లాభపడటం, విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. రెండోది నాన్ టీచింగ్ స్టాఫ్. అటెం డర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అందరూ దీనికిందికే వస్తారు. ఇక్కడ ప్రధానమైన లోపం ఎక్కడ కనపడు తుంది అంటే ప్రయోగశాలలో ల్యాబ్ అసిస్టెంట్లు. లైబ్రరీలో లైబ్రేరియన్లు అసలుకే ఉండరు. ఎందు కంటే కళాశాలలో ప్రయోగశాలలు లైబ్రరీలు అంతంత మాత్రమే కాబట్టి, ఇక మూడవది ప్రయోగ శాలలు. ఇవి పేరుకే ఉంటున్నాయి. రూము ముందు ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అని ఉంటుంది కానీ ల్యాబ్‌లో సరైన ప్రయోగ పరికరాలు ఉండవు. నాలుగవది లైబ్రరీ సౌకర్యం. చాలా కళాశాలల్లో లైబ్రరీ మొత్తం ఒక్క బీరువాకే పరిమితమై కని పిస్తుంది. వాస్తవానికి విద్యార్థులందరికి సరిపడా పుస్తకాలు ఉండాలి. కాని చాలా చోట్ల మనకు అలాంటి పరిస్థితి కనబడదు. ఇక ఐదవది. తరగతి గదులు, అనుమతి పొందిన గ్రూపులకు సరిపడ తరగతి గదులు చాలా కళాశాలల్లో మనకు కనబడవు. కొన్ని కళాశాలల్లో వివిధ గ్రూపుల విద్యార్థులను కలిపి పాఠాలు బోధిస్తారు. ఇక ముఖ్యమైన అంశం ఏమంటే ప్రైవేటు కళా శాలలు.. క్లాసులకే రాని పిల్లలకు కూడా హాజరు శాతం వేసి ఫీజు రీయింబర్స్మెంట్ పొంది లబ్దిపొం దుతున్న విషయం మనం గమనించాలి. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నప్పుడు వాటిని తీసుకుంటున్న కళాశాలలు మౌలిక సదుపా యాలను కల్పించి విద్యావ్యవస్థ అభివృద్ధికి దోహద పడాలి. లేకుంటే విద్యావ్యవస్థకు పెను ప్రమాదం పొంచివుండే కాలం ఎంతో దూరంలో లేదు. పై కారణాల వల్ల ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలు చేసి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రయోగశాలలు, లైబ్రరీ సౌకర్యం, సరిపడ తరగతి గదులు గల కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చి, ఎవరైతే విద్యార్థులు కళాశాలలకు సక్రమంగా హాజరవు తారో వారికే స్కాలర్షిప్లు అందేలాగా చర్యలు తీసుకోవాలి. దీనికోసం విద్యార్థు లందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకు వస్తున్న బయో మెట్రిక్ విధానం విద్యార్థులతోపాటు, అధ్యాపకులకి కూడా వర్తించేటట్టు చేయాలి. మోదాల్ మల్లేష్, జంతుశాస్త్ర అధ్యాపకులు, పాలెం, నకిరేకల్, నల్లగొండ మొబైల్: 9989535675 నీటి కొరతపై చర్యలేవీ? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సి పాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటు న్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం మూలాన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా బావుల్లో నీరు లేకపో వడం, బోర్లు నడవకపోవడం మూలాన ప్రజలు నానాయాతన పడుతున్నారు. మున్సిపా లిటీలు, నగర పంచాయితీలలో నల్లాల ద్వారా నీరు సరఫరా కావడం లేదు. గ్రామ, నగర పంచాయితీల పాలక వర్గాలు ప్రజలకు తాగు నీటిని అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ట్యాంకర్ల ద్వారా వారానికి ఓసారి నీటి సరఫరా జరుగుతున్నా అందరికీ నీరు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలి. కష్టకాలంలో స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. - కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్ జిల్లా -
‘ఎయిడెడ్’కు జవజీవాలు!
సాక్షి, హైదరాబాద్: ఎయిడెడ్ విద్యా సంస్థలకు జవజీవాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల సంఖ్య, వాటిల్లో పరిస్థితులు, విద్యార్థులు, బోధన సిబ్బంది సంఖ్య, ఎంత మందిని నియమించాల్సి ఉంటుందనే అంశాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలోని పాఠశాలలు, జూనియర్ , డిగ్రీ కాలేజీల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా కమిటీలను వేసింది. కమిటీల నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలోని కొన్ని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకు ఎకరాల కొద్దీ విలువైన భూములున్నాయి. వాటిపై కన్నేసిన వారసులు, ఇతరులు ఆ సంస్థలను నిర్వీర్యం చేసి అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములను అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాంటి భూముల కోసమే కొంతమంది న్యాయ వివాదాలను సృష్టించారు. వాటి పరిస్థితిని కూడా ప్రభుత్వం తేల్చేయనుంది. మరోవైపు ఎంతో పేరున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజీలు, వీవీ కాలేజ్, ఏవీ కాలేజ్, అంబేడ్కర్ కాలేజ్, వరంగల్‌లో ఎల్బీ కాలేజీ, సీకేఎం కాలేజీ, ఏవీవీ హైస్కూల్, జూనియర్ కాలేజ్, మహబూబియా పంజతన్ కాలేజీ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచి పేరున్న కాలేజీలతోపాటు విద్యార్థులు ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లక్షన్నర మంది పిల్లలకు 1,700 మందే టీచర్లు రాష్ట్రంలో 850 వరకు ఎయిడెడ్ పాఠశాలలున్నా ప్రస్తుతం 778 స్కూళ్లు మాత్రమే కొనసాగుతున్నాయి. వాటిల్లో 6 వేల మంది టీచర్లు అవసరం కాగా కేవలం 1,700 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. వాటిల్లో 1.48 మంది పిల్లలు చదువుకుంటున్నారు. యాజమాన్యాలే కొంతమందిని తాత్కాలికంగా నియమించుకొని బోధనను కొనసాగిస్తున్నాయి. ఇక 42 జూనియర్ కాలేజీల్లో (ఇందులో 22 కాలేజీలో హైదరాబాద్‌లో ఉన్నాయి.) 4,500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాటిల్లో 1,200 మంది టీచర్లు అవసరం కాగా కేవలం 272 మంది మాత్రమే ఉన్నారు. ఇక డిగ్రీ కాలేజీలు 63 ఉండగా (ఇందులో 50 హైదరాబాద్‌లోనే ఉన్నాయి) వాటిల్లో 18 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో 1,770 మంది లెక్చర ర్లు అవసరం కాగా కేవలం 325 మంది మాత్రమే ఉన్నారు. వీరు కాకుండా బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది. నియామకాల్లో యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు, న్యాయ వివాదాల నేపథ్యంలో 2006లో ప్రభుత్వం జీవో 35 ద్వారా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నియామకాలపై నిషేధం విధించింది.