ఇప్పటివరకూ టచ్ చేయలేదు!
‘గీతాంజలి’తో ప్రేక్షకులను భయపెట్టిన కథానాయిక అంజలి తాజాగా మరో హారర్ చిత్రంతో తెర మీదకు రావడానికి రెడీ అవుతున్నారు. సినిమా పేరు - ‘చిత్రాంగద’. గతంలో ‘పిల్ల జమీందార్’ తీసిన జి. అశోక్ దర్శకత్వంలో అంజలి కథానాయికగా గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘అమెరికాలో తొమ్మిది రాష్ట్రాల్లో చిత్రీ కరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రమిది. ఇలాంటి కథాంశాన్ని ఎవరూ టచ్ చేయ లేదు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం.
ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు. అంజలి మాట్లాడుతూ, ‘‘ ‘గీతాంజలి’ తర్వాత హారర్ సినిమా చేయకూడ దనుకున్నా. కానీ అశోక్‌గారు చెప్పిన కథ డిఫరెంట్‌గా అనిపించింది. ఈ సినిమాలో కొత్త అంజలిని చూస్తారు’’ అన్నారు. నవంబర్ ఆఖరులో పాటల్నీ, డిసెంబరులో చిత్రాన్నీ విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.