పాకాల వాగులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతు
ఖానాపూర్: వరంగల్ జిల్లా పాకాల వాగులో పడి ఆదివారం ఓ టెకీ గల్లంతయ్యాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధర్మారానికి చెందిన అనిల్ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పాకాల వాగు వద్దకు వచ్చిన అనిల్ మద్యం సేవించినట్లు తెలిసింది. మత్తులో కాలు జారి వాగులో పడిపోయినట్లు తెలిపారు. అనిల్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ గురుస్వామి తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.