Techie sucide
-
‘నాకిదే చివరిరోజు.. బాబుని నువ్వే చూసుకో’
బెంగళూరు : వరకట్నం వేధింపులకు మరో యువతి బలైపోయింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న రష్మీ (28) ఆదివారం రాత్రి తన ఫ్లాట్‌లో బలవన్మరణానికి పాల్పడింది. చనిపోవడానికి ముందు.. అమెరికాలో ఉంటున్న తన సోదరికి ‘నాకిదే చివరిరోజు, బాబును చూసుకో’ అని మెసేజ్ చేసింది. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలివి.. కెంపెగౌడా రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో నివసించే రష్మీ.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత అమెరికాలో ఉన్న తన సోదరికి మెసేజ్ చేసింది. ఇదే తన చివరి రోజని, బాబును జాగ్రత్తగా చూసుకోవాలన్నది మెసేజ్ సారాంశం. దీంతో కంగారుపడ్డ సోదరి.. బెంగళూరులోనే నివాసం ఉంటున్న తల్లి భాగ్యమ్మకు విషయాన్ని చెప్పి, తక్షణమే రష్మీ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. ఎంతసేపు తట్టినా తలుపు రష్మీ తీయకపోవడంతో ఆమె తల్లి.. సతీష్(రష్మీ భర్త)కు ఫోన్ చేసింది. అతను ఊళ్లో లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. తలుపులు పగులగొట్టి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న రష్మీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వేధింపుల పరంపర : కోలార్ జిల్లాకు చెందిన సతీష్, బెంగళూరుకు చెందిన రష్మీలకు మూడేళ్ల కిందట వివాహమైంది. ఈ ఇద్దరూ స్థానిక మాన్యతా టెక్ పార్కులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కాగా, అదనపు కట్నం తేవాలంటూ రష్మీని సతీష్ వేధించేవాడు. శారీరక, మానసిక హింసకు గురిచేసేవాడు. భర్త వేధింపులు తాళలేని స్థితిలో రష్మీ రెండు వారాల కిందటే ఉద్యోగానికి రాజీనామా చేసింది. 16 నెలల వయసున్న కొడుకును తల్లి భాగ్యమ్మకు అప్పగించింది. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకునేముందు సోదరికి మెసేజ్‌లు పంపింది. ఫిర్యాదుబమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీష్ ను, అతని తల్లి గాయత్రిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. రష్మీ, ఆమె భర్త సతీష్ (ఫైల్ ఫొటో) -
మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెత్
- మొన్న ఇన్ఫోటెక్లో హత్య.. నేడు టీసీఎస్ ఉద్యోగి అనుమానాస్పద మృతి - పుణెలోని ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులో కలకలం పూణె: ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా టెక్కీని కంప్యూటర్ కేబుళ్లతో దారుణంగా హతమార్చిన ఉదంతం చల్లారకముందే టీసీఎస్‌కు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతున్నది. ఇక్కడి ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులో పనిచేస్తోన్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారం రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఇటు ఐటీవర్గాలతోపాటు, అటు ఉద్యోగుల కుటుంబాల్లోనూ కలవరం రేపుతున్నది. ఇన్ఫోటెక్ పార్కులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో ఇంజనీర్‌గా పనిచేస్తోన్న అభిషేక్ కుమార్ గురువారం రాత్రి తన ఫ్లాట్‌లో అనుమానాస్పదరీతిలో మరణించాడు. పుణె పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన అభిషేక్ కుమార్.. పుణెలో టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయమంతా రూమ్మేట్స్తో గడిపిన అభిషేక్.. మధ్యాహ్నానికి నిద్ర వస్తోందంటూ తన బెడ్రూమ్లోకి వెళ్లాడు. కొద్ది సేపటికే అభిషేక్‌కు చెందిన మరో స్నేహితుడి నుంచి రూమ్‌మేట్స్‌కు ఫోన్ వచ్చింది. ‘అతను ఆత్మహత్య చేసుకోబోతున్నాడు.. ఆపండి’అనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. వెంటనే అప్రమత్తమైన రూమ్మేట్స్.. బెడ్రూమ్ లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో కిటికీలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కానీ అప్పటికే అభిషేక్ సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. అతణ్ని కిందికిదించి, సమీపంలోని ఆస్పత్రికి తరలించడా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అభిషేక్ స్నేహితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులోనే పనిచేస్తోన్న ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారమే అభిషేక్ బలవన్మరణానికి కారణమని సమాచారం. చనిపోవడానికి ముందు ఆ అమ్మాయికి మెసేజ్‌లు పంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అభిషేక్ మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, పరీక్షిస్తున్నామని, అతని రూమ్మేట్స్, స్నేహితులను విచారిస్తేగానీ ఈ కేసు ఓ కొలిక్కిరాదని దర్యాప్తు అధికారి మీడియాతో అన్నారు. ఇక, ఇన్ఫోటెక్ కార్యాలయంలో హత్యకు గురైన కేరళ యువతి ఆనంద్ కె రాసిలా రాజు (25) కుటుంబానికి రూ.1కోటి నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. (మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య)