బయోమెట్రిక్ విధానం తప్పనిసరి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సాంకేతిక విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు క్రమంతప్పకుండా కళాశాలకు వచ్చే అవకాశముంటుందన్నారు.
ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు రోల్‌మోడల్‌గా నిలవాలని, ఇది చూసి ఇతర అధ్యాపకులు మారాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సిబ్బంది కషి చేయాలన్నారు. ఇందులో ఇంటర్నెట్, ఇతర సమస్యలేమైనా ఉంటే సాంకేతిక అధికారుల దష్టికి తెచ్చి తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు. దీనికి మహబూబ్‌నగర్, పెబ్బేరు, గద్వాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు రవీంద్రబాబు, రంగస్వామి, వెంకన్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు.