చంద్రబాబు తెలంగాణ ద్రోహి: జగదీష్‌రెడ్డి
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారమిక్కడి ఇంటర్ విద్యాభవన్ ఆవరణలో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రెండుగా విభజించినా చంద్రబాబు ఇంకా తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
ఆంధ్రా అసెంబ్లీ హైదరాబాద్‌లో ఉండాలని ఏ చట్టం చెప్పిందో.. ఆంధ్రాలో తయారయ్యే కరెంటులో తెలంగాణకు 53 శాతం ఇవ్వాలని కూడా అదే చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రోళ్లు పదేళ్లు హైదరాబాద్‌లో పరిపాలన చేసుకోవచ్చు కానీ, ఆంధ్రాలో తయారయ్యే విద్యుత్ ఇవ్వడంలో కుట్ర ఎందుకు జరుగుతోందని నిలదీశారు.