చంద్రబాబు తెలంగాణ ద్రోహి: జగదీష్‌రెడ్డి | chandrababu telangana betrayer, says jagadeeshwar reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తెలంగాణ ద్రోహి: జగదీష్‌రెడ్డి

Published Fri, Jun 27 2014 12:13 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

చంద్రబాబు తెలంగాణ ద్రోహి: జగదీష్‌రెడ్డి - Sakshi

చంద్రబాబు తెలంగాణ ద్రోహి: జగదీష్‌రెడ్డి

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారమిక్కడి ఇంటర్ విద్యాభవన్ ఆవరణలో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రెండుగా విభజించినా చంద్రబాబు ఇంకా తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.

ఆంధ్రా అసెంబ్లీ హైదరాబాద్‌లో ఉండాలని ఏ చట్టం చెప్పిందో.. ఆంధ్రాలో తయారయ్యే కరెంటులో తెలంగాణకు 53 శాతం ఇవ్వాలని కూడా అదే చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రోళ్లు పదేళ్లు హైదరాబాద్‌లో పరిపాలన చేసుకోవచ్చు కానీ, ఆంధ్రాలో తయారయ్యే విద్యుత్ ఇవ్వడంలో కుట్ర ఎందుకు జరుగుతోందని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement