Telangana board
-
టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల(99.30 శాతం) మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్(89.09 శాతం) చివరి స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్లలో చూసుకోవచ్చు... www. sakshieducation. com అలాగే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను www. bse. telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్ చేసి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. డౌన్లోడ్ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్ ఐడీని నమోదు చేసి సేవ్ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్ చేసి, టెక్ట్స్ బాక్స్‌లో ఫిర్యాదు రాసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత కన్ఫర్మేషన్ మేసేజ్ విద్యార్థుల మొబైల్ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది. -
‘కల్వకుర్తి’పై మీ వివరణేంటి?
ఏపీ ఫిర్యాదుపై స్పందించాలి తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్ధ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ చేసిన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఏపీ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని మంగళవారం కృష్ణా బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. ఏపీ చేసిన ఫిర్యాదుతోపాటు, సెప్టెంబర్ 8న సామర్ధ్యం పెంచుతూ తెలంగాణ ఇచ్చిన జీవో 141 ప్రతిని లేఖతో జత చేసింది. ఇదిలాఉండగా, కృష్ణా బోర్డుకు ఏపీ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించిన విషయం తెలిసిందే. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల మేరకే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని వాడుకుంటున్నామని, గతంలో నిర్ణయించిన 25 టీఎంసీల నీటితో నిర్ణీత 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కానందునే సామర్ధ్యాన్ని 40 టీఎంసీలకు పెంచామని వివరణ ఇచ్చారు. కల్వకుర్తి ద్వారా 2 టీఎంసీల నీటిని మంచినీటికి, మరో 1.5 టీఎంసీ ప్రవాహంలో ఆవిరైపోయే దృష్ట్యా, మిగిలే 21.5 టీఎంసీలతో కేవలం 2.15 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వొచ్చని, ఈ నేపథ్యంలో నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలంటే 40 టీఎంసీలు అవసరమని వివరించారు. ఇదే వివరాలతో తెలంగాణ బోర్డుకు లేఖ రాసే అవకాశాలున్నాయి. డిసెంబర్ 16న సమావేశం.. కాగా, వచ్చేనెల 16న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిం ది. ఇందులో ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ పరమైన అంశాలు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలపై చర్చిద్దామని అందు లో స్పష్టం చేసింది. ఇదే సమావేశంలో కల్వకుర్తి అంశాన్ని చర్చించే అవకాశం ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.