TS SSC Results 2019 | Telangana 10th Class Results Released - Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫలితాలు విడుదల

Published Mon, May 13 2019 11:19 AM | Last Updated on Mon, May 13 2019 4:49 PM

TS SSC Results Declared - Sakshi

పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల(99.30 శాతం) మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్(89.09 శాతం) చివరి స్థానంలో నిలిచింది.

పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు...
www. sakshieducation. com


అలాగే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను  www. bse. telangana. gov. in వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. మొబైల్‌ ప్లే స్టోర్‌ నుంచి కూడా టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్‌ చేసి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది. డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్‌ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్‌ ఐడీని నమోదు చేసి సేవ్‌ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్‌ చేసి, టెక్ట్స్‌ బాక్స్‌లో ఫిర్యాదు రాసి సబ్మిట్‌ చేయాలి. ఆ తరువాత కన్‌ఫర్మేషన్‌ మేసేజ్‌ విద్యార్థుల మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement