TS SSC Result
-
TS: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఎంతమంది ఉత్తీర్ణత సాధించారంటే
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో జరిగిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదలయ్యాయి. చేమధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలితాలు వెల్లడయ్యాయి. అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం 80.59గా ఉంది. పరీక్షకు 66.732 మంది హాజరుకాగా, 53, 777 మంది ఉత్తీర్ణత సాధించినట్లు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ పరీక్షల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 78.50 కాగా, బాలికల ఉత్తీర్ణత శాత 83.50గా ఉంది. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను వేగంగా అందించేందుకు సాక్షి ఏర్పాట్లు చేసింది. ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. education.sakshi.com -
మూడు రోజుల్లో టెన్త్ మెమోలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను 3 రోజుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. వాటిని ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు తమ సంతకం చేసి విద్యార్థులకు అందజేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెమోలతో విద్యార్థులు కాలేజీల్లో చేరొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. ఇక పూర్తి స్థాయి మెమోలను మరో నెల రోజుల్లో పంపించనున్నట్లు వెల్లడించింది. పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్స్, గ్రేడ్ పాయింట్ యావరేజ్‌తో (జీపీఏ) కూడిన ఫలితాలను సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు అందజేసే పాస్ మెమోల్లోని వివరాల్లో పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా తెలపాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పొరపాట్ల వివరాలను ఎస్ఎస్సీ బోర్డుకు పంపించి సవరించేలా చర్యలు చేపడతారని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అందరిని పాస్ చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్న 5,34,909 మంది విద్యార్థులను పాస్ చేసి, వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, జీపీఏను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల జీపీఏ వివరాలతో కూడిన ఫలితాలను వెబ్సైట్లో www.bse. telangana.gov.in ఉంచినట్లు వివరించారు. 1.4 లక్షల మందికి 10/10 జీపీఏ.. పదో తరగతి పరీక్షల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా 1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా పరీక్షలు నిర్వహించినప్పుడు 10/10 జీపీఏ రాష్ట్రవ్యాప్తంగా 2,500 మందికి మించి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఇంటర్నల్ 20 మార్కుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల (ఐదింతలు చేసి) ఆధారంగా జీపీఏ నిర్ణయించడంతో ఎక్కువ మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చింది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన 5,34,909 మంది విద్యార్థుల్లో దాదాపు 3.74 లక్షల మంది కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మందికి పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కులు 20కి 20 మార్కులు వేసినట్లు సమాచారం. ఇప్పుడు 10/10 జీపీఏ వచ్చిన 1.4 లక్షల మందిలో 98 శాతం మంది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే వేయడంతో ఈ పాఠశాలల విద్యార్థుల్లో తక్కువ మందికి 10/10 జీపీఏ వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో అధికంగా.. జిల్లాల్లో డీఈవోలు వేసిన లెక్కల ప్రకారం కరీంనగర్ జిల్లాలో 6,446 మందికి 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. అలాగే నల్లగొండలో 6,642 మందికి, సిద్దిపేటలో 4,664 మందికి, వరంగల్‌లో 6,614 మందికి, హైదరాబాద్‌లో దాదాపు 10 వేల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు సమాచారం. -
ఆన్లైన్లో టెన్త్ ‘గ్రేడ్’ వివరాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఉత్తీర్ణత చేశారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ప్రతిపదికన గ్రేడ్లను నిర్ణయించారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ వివరాలను సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రేడ్ వివరాలను www. bse.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు గ్రేడ్ కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. పాస్‌మెమో వివరాల్లో ఎవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు పంపిస్తే సరిచేస్తారని మంత్రి తెలిపారు. పని చేయని తెలంగాణ టెన్త్ మార్కుల గ్రేడ్ల సైట్ సోమవారం సాయంత్రం 3 గంటలకు మార్కుల మెమోలు ఆన్లైన్లో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులంతా సంబంధిత వెబ్సైట్ ఓపెన్ చేశారు. కానీ సాయంత్రం 5 గంటలైనా www.bsc.telangana.gov.in వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల(99.30 శాతం) మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్(89.09 శాతం) చివరి స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్లలో చూసుకోవచ్చు... www. sakshieducation. com అలాగే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను www. bse. telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్ చేసి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. డౌన్లోడ్ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్ ఐడీని నమోదు చేసి సేవ్ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్ చేసి, టెక్ట్స్ బాక్స్‌లో ఫిర్యాదు రాసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత కన్ఫర్మేషన్ మేసేజ్ విద్యార్థుల మొబైల్ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది.