'రాజముద్రలో అమరవీరుల స్థూపాన్ని విస్మరించారు'
తెలంగాణ లోగో (రాజముద్ర)లో అమరవీరులస్థూపం లేకపోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో ఎంతో మంది అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. అమరుల త్యాగాలకు స్మారక చిహ్నంగా అమరవీరులస్థూపం నిర్మించారని... అలాంటి చిహ్నానికి రాజముద్రలో చోటు కల్పించకపోవడం దారుణమని ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
జూన్ 1వ తేదీ అర్థరాత్రి నుంచే తెలంగాణ ఆవిర్బావ సంబరాలు జరుగుతాయని తెలిపారు. ఆ మరునాడు అంటే 2వ తేదీన అన్ని గ్రామ మండల, జిల్లా కేంద్రాలలో జెండా వందన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందులోభాగంగా బీజేపీ ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.