Telangana electric distribution company
-
ఆన్లైన్ అంతంతే!
డిస్కంలో 11 శాతం మించని ఆన్లైన్ చెల్లింపులు ఈ సేవా, ఈఆర్ఓ కేంద్రాలపైనే ఆధారపడుతున్న ప్రజలు అవగాహన లేనందునే: నిపుణులు సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్పీడీసీఎల్)లో ఆన్లైన్ బిల్లింగ్ అంతంత మాత్రంగానే నమోదవుతోంది. వినియోగదారులు ఇంటి నుంచే నేరుగా విద్యుత్ బిల్లు చెల్లించే అవకాశాన్ని డిస్కం కల్పించినప్పటికీ..ఆన్లైన్ బిల్లింగ్ ప్రక్రియపై ఇప్పటికీ చాలా మందికి అవగాహక లేదు. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్న వారు సైతం ఇప్పటికీ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసు(ఈఆర్ఓ), ఈ సేవా కేంద్రాలపైనే ఆధారపడుతుండటం విశేషం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 40 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో గృహ, వాణిజ్య కనెక్షన్లు 36 లక్షలు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల రూపంలో ప్రతి నెలా వీటి నుంచి రూ.440–445 కోట్లు సమకూరుతోంది. డిస్కం ఖాతాలోకి ఆన్లైన్ ద్వారా 11 శాతం మాత్రమే రెవెన్యూ వచ్చి చేరుతోంది. రంగారెడ్డి నార్త్ సర్కిల్లో ఆన్లైన్ బిల్లింగ్ రికార్డుస్థాయిలో 20.5 శాతం నమోదవుతుండగా, హైదరాబాద్ నార్త్ సర్కిల్లో 17 శాతం, హైదరాబాద్ సెంట్రల్, సౌత్‌లో 12 శాతం, రంగారెడ్డి ఈస్ట్ సర్కిల్లో 6 శాతం, రంగారెడ్డి సౌత్‌లో అత్యల్ప ంగా రికార్డవుతోంది. వాట్సాప్ సర్వీసుపై కొరవడిన నిఘా: క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే 1912 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. ఇందులో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇచ్చిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కూడా వీలు పడటం లేదు. అత్యవసర సమయంలో ఫోన్ చేస్తే క్షేత్రస్థాయి అధికారులు ఎత్తడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల సత్వర పరిష్కారం కోసం పోలీసుశాఖ సహా జీహెచ్ఎంసీ, జలమండలి ఇప్పటికే వాట్సాప్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కీలకమైన విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు దీనిపై దృష్టి సారించక పోవడం గమనార్హం. రూ.50 వేలకుపైగా బకాయి పడిన వినియోగదారుల పేర్లు, సర్వీసు నెంబర్ వగైరా వివరాలను ఆన్లైన్లో ఉంచుతున్న అధికారులు, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయక పోవడంతో బిల్లు చెల్లించిన వినియోగదారుల వివరాలు కూడా బకాయిదారుల జాబితాలో కన్పిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో చెల్లింపులు ఇలా.. ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత గుగూల్లోకి వెళ్లాలి. టీఎస్ఎస్పీడీసీఎల్ క్లిక్ చేస్తే మెనూ డిసిప్లే అవుతోంది. ఆన్లైన్ సర్వీసులో బిల్ పేమెంట్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత బిల్‌డెస్క్, పే యువర్ మనీ, సిట్రూస్ ఆప్షన్స్ వస్తాయి. జిల్లా, ఈఆర్ఓ, సర్వీసు నెంబర్, యూనిక్ సర్వీసు నెంబర్ యాడ్ చేయాలి. క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డు ఆప్షన్స్‌లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. చెల్లించాల్సి మొత్తాన్ని ఎంటర్ చేసి, ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. కార్డ్ నెంబర్, తేదీ, నెల, సంవత్సరం, పేరు వగై రా వివరాలన్నీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇలా చెల్లించిన విద్యుత్ బిల్లు నేరుగా డిస్కం ఖాతాలోకి వెళ్తుంది. ఇందుకు చెల్లించే సర్వీస్ టాక్స్ ఈసేవ కేంద్రాల్లో చెల్లించే దాంతో పోలిస్తే చాలా తక్కువ. దీంతో సమయం ఆదా అవడంతో పాటు గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం ఉండదు. -
భద్రత కరువే..!
► కార్మికులకు సేఫ్టీ టూల్స్ ఇవ్వని డిస్కం ► టెస్టర్ నుంచి కటింగ్బ్లేడ్ వరకు అన్ని ► కార్మికులే సమకూర్చుకుంటున్న వైనం ► నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కిందిస్థాయి లైన్మెన్లు, హెల్పర్లకు రక్షణ కరువైంది. ఆపరేషన్ విభాగంలో కీలకమైన విధులు నిర్వహించే కార్మికులకు కనీస భద్రత లేకుండా పోయింది. డిస్కం నిర్లక్ష్యానికి కార్మికులే కాదు సామాన్యులు సైతం సమిదలవుతున్నారు. గత మూడేళ్లలో సుమారు 250 మంది మృతి చెందగా, మరో 50 మంది క్షతగాత్రులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ సరఫరాను తెలుసుకునేందుకు అవసరమైన టెస్టర్ మొదలు..కటింగ్ బ్లేడ్ దాకా కార్మికులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కార్మికుల భద్రతకు అవసరమైన గౌ ్లజులు, బూట్లు, ఎర్త్రాడ్లు, సేప్టీబెల్ట్ ఇతర పరికరాలను ఆయా డిస్కమ్‌లే అందించాల్సి ఉన్నప్పటికీ సరఫరా చేయడం లేదని కాంట్రా క్ట్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. అస్తవ్యస్థంగా సరఫరా వ్యవస్థ పాతబస్తీతో పాటు నగరంలో పలుప్రాంతా ల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా తయారైంది. ట్రాన్స్ ఫార్మర్లకు కనీస రక్షణ లేదు. వీధుల్లోని విద్యుత్ పోల్స్‌కు సపోర్టింగ్‌గా ఏర్పాటు చేసిన వైర్లు ముట్టకుంటే షాక్ కొట్టుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏటా మే ఒకటి నుంచి ఏడు వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లు, సర్కిళ్ల పరిధిలో బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంది. స్థానికంగా ఉన్న లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై అవగాహన కల్పించనున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ► విధి నిర్వహణలో సేఫ్టీటూల్స్ను తప్పకుండా ఉపయోగించాలి. ► కాళ్లకు పాదర క్షలు, చేతికి గ్లౌజులు లేకుండా విద్యుత్ పరికరాన్ని ముట్టుకోరాదు. ► విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా ఎలాంటి మరమ్మతులు చేయకూడదు. ► టీవీ కేబుల్‌లో కూడా ఎర్త్ప్రసారం అవుతుంది. నోటి పళ్లతో వైర్లను కట్ చేయకూడదు. ► పోల్‌కు డబుల్ ఫీడర్ లైన్స్‌ను నిలిపివేసిన తర్వాతే స్తంభాన్ని ఎక్కాలి. ► విద్యుత్ స్తంభాలు ఎక్కేటప్పడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా..ప్రమాదం భారిన పడక తప్పదు. ► లైన్మెన్లు, హెల్పర్లు సేఫ్టీటూల్స్ ఉపయోగించాలి. ► ప్రమాదం జరిగితే వెంటనే 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలి. -
ఎన్టీపీసీ ‘విద్యుత్’పై కేంద్రానిదే నిర్ణయం !
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న 1,600(25800) మెగావాట్ల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు విద్యుత్ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధన మేరకు ‘ఎన్టీపీసీ’, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) మధ్య గత జనవరి 18న కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) బహిర్గతం చేసింది. ఈ ఒప్పందంపై అభ్యంతరాలు, సలహాలను వచ్చే నెల 18లోగా తెలియజేయాలని ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. 1,600 మెగావాట్ల తొలి దశ ప్రాజెక్టుపై పీపీఏలో రాష్ట్ర పునర్విభజన చట్టం హామీ ఊసే లేదు. కేంద్రం హామీ మేరకు 100 శాతం విద్యుత్ రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. దీనికి భిన్నంగా రాష్ట్రానికి కేటాయించే విద్యుత్‌ను కేంద్రమే నిర్ణయిస్తుందని ఒప్పందంలో రాసుకున్నారు. పీపీఏలో పెట్టుబడి వ్యయాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. విద్యుత్ కేంద్రం వాణిజ్య ఉత్పత్తి ప్రారంభ తేదీ(సీవోడీ) నుంచి 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం మనుగడలోకి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, సీవోడీ కానీ, ప్రాజెక్టు నిర్మాణ కాల వ్యవధి వివరాలు మాత్రం లేవు.