అవతరణ అంటే కేసీఆర్‌కు అగౌరవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవమంటే ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు గౌరవం లేదని.. ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశ విభజన తర్వాత కావాలని ఓ రోజు ముందే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే పాకిస్తాన్ తరహాలో.. కేసీఆర్ సైతం ఒక రోజు ముందు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకొన్నారని వ్యాఖ్యానించారు.కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంట్ ఏమీ లేదని, ఉన్నదంతా వ్యాపారమేనని విమర్శించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అమర వీరుల స్తూపం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటుతో మాకు సంబంధం లేదు. ఎన్నికల కోడ్ కాబట్టి అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లడానికి ఈసీ అనుమతి అవసరం. మేం ఈసీ నుంచి అనుమతి తీసుకున్నాకే ఆవిర్భావ వేడుకలకు సోనియా గాం«దీని ఆహా్వనించాం. ఆరోగ్య సమస్యల రీత్యా ఆమెకు సుదీర్ఘ ప్రయాణాలు ఇబ్బందికరం. ఆమె రావాలని ఆశిస్తున్నాం. అమరులంటే కేసీఆర్‌కు ద్వేషమెందుకు? రాష్ట్ర అధికార చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్, కేటీఆర్‌లకు.. అమరవీరులు, వారి కుటుంబాలు, అమరవీరుల స్తూపం అంటే ఎందుకు ద్వేషం? రూ.వెయ్యి కోట్లతో హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కనే అమర వీరుల స్థూపం కట్టాలని 2014లో జరిగిన మహానాడులో నేను డిమాండ్ చేశాను కూడా. రాష్ట్ర గీతం, చిహ్నంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించలేదన్న బీఆర్ఎస్ ఆరోపణలు సరికాదు. ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ కోరాం. కానీ వాళ్లు రోడ్డెక్కి తాము చెప్పేది చెప్పేశారు. ఆవిర్భావ వేడుకలకు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డిలను కూడా ఆహ్వానించాం. తెలంగాణ అమరవీరులను గుర్తించడానికి కమిటీ వేశాం. గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఎఫ్ఐఆర్ల సేకరణ కోసం ప్ర త్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాం. గేయంలో మార్పులపై అందెశ్రీనే అడగండి రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతను పూర్తిగా రచ యిత అందెశ్రీకి అప్పగించాం. అందులో పదాల మార్పు, సంగీత దర్శకుడిగా కీరవాణిని ఎంపిక చేసే నిర్ణయం కూడా అందెశ్రీదే. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్‌లాగా మేం కాంట్రాక్టులు ఇవ్వలేదు. ఔట్ సోర్సింగ్ చేసి కమీషన్లు పొందలేదు. అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగింపుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయులను చూస్తాను. రెడ్డి, కమ్మ, వెలమ రాజులుగా చూడను. బీఆర్ఎస్లా రాజకీయం చేయలేదు రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవు. సాంకేతిక అంతరాయాలు కూడా బాగా తగ్గాయి. రాష్ట్రంలోని ఏ సబ్‌స్టేషన్‌కైనా వెళ్లి లాగ్‌బుక్స్‌ను తనిఖీ చేయడానికి సిద్ధం. బీఆర్ఎస్ పాలనలో సైతం అంతరాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా అప్పుడు మేం రాజకీయం చేయలేదు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధాని చేస్తే మూడేళ్లకే ఏపీవారు వెళ్లిపోయారు. ఇప్పుడు గడువు పొడిగించాలని కోరడంలో అర్థం లేదు. పేద రైతులకే రైతు భరోసా! వానాకాలం పంటలకు రైతు భరోసా అమలుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. లక్ష ఎకరాల వ్యవసాయేతర భూములకూ గతంలో రైతుబంధు ఇచ్చారు. ‘నేను అడ్డగోలుగా చేశా.. మీరూ చేయాలి’ అని కేసీఆర్ అంటున్నారు. సంపన్నులు, లేఅవుట్లకు కాకుండా అర్హులైన రైతులకే ఇస్తాం. పేదలకు సాయం చేయడమే ప్రభుత్వ పథకాల లక్ష్యం. ప్రభుత్వ పథకాలకు అర్హత తెల్ల రేషన్‌కార్డు, పేదరికమే. ఆర్టీసీ బస్సు చార్జీలు చెల్లించే స్తోమత గల మహిళలు స్వచ్ఛందంగా ఉచిత ప్ర యాణాలను విరమించుకోవాలని అప్పీల్ చేస్తాం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. కొత్త విగ్రహం రూపకల్పన బాధ్యతను ఫైనార్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించాం. ఉద్యమ సమయంలో తెలంగాణ యువత గుండెలపై ‘టీజీ’ అనే అక్షరాలను పచ్చ»ొట్టు పొడిపించుకున్నారు. అందుకే ‘టీఎస్’కి బదులు ‘టీజీ’గా మార్చాం. నేటితో తెలంగాణకు సంపూర్ణ విముక్తిసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏర్పాటై పదకొండో సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, ఏళ్ల తరబడి సాగిన ఉద్యమంలో పా లు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగు లు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహి ళలు, రాజకీయ పారీ్టల నేతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలరి్పంచిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇకపై తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన ప్రజలకే దక్కుతాయి. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునరి్నర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. గత పదేళ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు, ఇంతకాలం కోల్పో యిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తాం.తెలంగాణ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. ప్రజా పాలనను అందిస్తాం. అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైంది.’అని శనివారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్ వెల్లడించారు. నేటితో తెలంగాణకు సంపూర్ణ విముక్తి⇒ ఇకపై తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని ⇒ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం ⇒ప్రజలకు సీఎం రేవంత్ దశాబ్ది శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏర్పాటై పదకొండో సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, ఏళ్ల తరబడి సాగిన ఉద్యమంలో పా లు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగు లు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహి ళలు, రాజకీయ పారీ్టల నేతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇకపై తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన ప్రజలకే దక్కుతాయి. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. గత పదేళ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు, ఇంతకాలం కోల్పో యిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తాం. తెలంగాణ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. ప్రజా పాలనను అందిస్తాం. అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైంది.’అని శనివారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్ వెల్లడించారు. ఓ బ్రాండ్ విత్తనాలే అడుగుతుండటంతో సమస్య ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే పత్తి విత్తనాల కొరత ఉంది. మహారాష్ట్ర రైతులు ఆ జిల్లాకు విత్తనాల కోసం రావడంతోనే సమస్య వస్తోంది. గతేడాది కంటే ఈసారి 10 శాతం అధికంగా విత్తనాలను సమీకరించి పెట్టాం. ఓ బ్రాండ్ విత్తనాలనే రైతులు కోరుతుండటంతో సమస్య వచి్చంది.టీచర్లందరినీ ఒకే గాటన కట్టొద్దు.. ప్రభుత్వ టీచర్లు విధులు ఎగ్గొట్టి రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు సరికాదు. అందరినీ ఒకే గాటనకట్టొద్దు. వైద్యశాఖలో నియమితులైన ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఒక నెల జాప్యం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఇలా జాప్యం జరిగిన సందర్భాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై ఆరోపణలు రుజువు కాకముందే వారికి చట్టబద్ధంగా అందాల్సిన హక్కులను ఆపలేం. ఇంజనీర్ల సంఘాలను ఆందోళన కాదు.. ఆమరణ దీక్ష చేసుకొమ్మనండి.. చూద్దాం..త్వరలోనే కొత్తవారికి పీసీసీ పగ్గాలు జూన్ 27తో పీసీసీ అధ్యక్షుడిగా నా పదవీకాలం ముగుస్తుంది. నేను సీఎం అవడంతో.. ఇతరులకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వస్తుంది. దీనిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. 9 నుంచి 12 లోక్‌సభ సీట్లు, రెండు ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంటుంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం నుంచి నలుగురు కేంద్ర మంత్రులు అవుతారు.ఎక్కువగా తాగడంతోనే బీర్ల కొరత తాగడం ఎక్కువ కావడంతోనే రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. అందులోనూ ఓ బ్రాండ్‌కు గిరాకీ పెరిగింది. సదరు కంపెనీ ఆ మేరకు ఉత్పత్తి చేయడం లేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై సమీక్ష జరపలేదు. బాధితుల వివరాలు నాకు తెలియదు. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు భారీగా ఆస్తులున్నట్టు నాకు తెలియదు. ఆ కేసుపై నాకు ఎలాంటి నివేదిక అందలేదు.గవర్నర్ దశాబ్ది శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రాన్ని సాధించుకోవడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన యువత బలిదానాలను గుర్తు చేసుకుని, వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆయన ప్రారి్థంచారు. విద్యార్థులు, యువత బలిదానాలతో తెలంగాణ కల సాకారమైందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, నేతలు, విధానరూపకర్తల కఠోర శ్రమ.. అన్ని రంగాల్లో తెలంగాణ పురోభివృద్ధి కొనసాగింపునకు దోహదపడుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు సీఎం ఆహ్వనం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆహ్వనించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి శనివారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆహ్వనపత్రిక అందజేశారు. ఆదివారం పరేడ్ మైదానంలో నిర్వహించనున్న వేడుకల విశేషాలను గవర్నర్‌కు వివరించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ హాజరవుతారని తెలిపారు.