దమ్ముంటే సీబీఐ విచారణ కోరు
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్యేకు నీ సన్నిహితుడు రేవంత్రెడ్డి డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇందులో నీ ప్రమేయం ఉన్నట్టు ఆడియో టేపులో బహిర్గతమైంది. రూ.50 లక్షలు ఎక్కడ నుంచి వచ్చాయి? తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్ర ప్రజలను మబ్బుల్లో పెట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య సమరానికి పన్నాగం చేస్తున్నావు. దీనికి రాష్ర్ట ప్రజలకు సంబంధమేమిటి? దమ్ముంటే ఈ అభియోగాలపై సీబీఐ విచారణ కోరు. రేవంత్ వ్యవహారంలో పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. తెలంగాణ, ఆంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా ముడుపులు సేకరించారు.
ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అన్యాయం చేస్తూ రూ.400 కోట్ల లబ్ధి పొందారు. ఏడాది కాలంలో వివిధ శాఖల ద్వారా నీ కొడుకును అడ్డు పెట్టుకుని రూ.1,200 కోట్ల వసూళ్లకు పాల్పడ్డావు. రేవంత్రెడ్డి ఏసీబీ కేసు వ్యవహారంపై మాట్లాడేందుకు కోర్టులో ఉందంటున్నారు. అలాగైతే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేవలం ఆరోపణ వస్తే అతిగా ఎందుకు మాట్లాడారు? నీచసంస్కృతి మీవద్దే ఉంది. మా పార్టీలోకి వచ్చేందుకు 23 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నప్పటికీ, ప్రజలనుంచే అసలు సిసలైన తీర్పు రావాలని మా నాయకుడు కోరుకుంటున్నారు.
- ముఖ్యమంత్రి చంద్రబాబునుద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష
ఉపనేత జ్యోతుల నెహ్రూ