Telangana POLYCET
-
పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలిసెట్–2020 దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అలాగే పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ఐటీఐ పూర్తయిన విద్యార్థులు చేరేందుకు నిర్వహించే ల్యాటరల్ ఎంట్రీ ఇన్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. -
పాలిసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్ - 2017 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పరీక్షకు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం మీడియా సమావేశంలో ఫలితాలను విడుదల చేశారు. పాలీసెట్‌లో 82.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎనిమిదిమంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి, జూన్ 9 నుంచి పాలిటెక్నిక్ తరగతులను నిర్వహిస్తారు. -
పాలీసెట్ ఫలితాల విడుదల
తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. పాలీసెట్ ఫలితాలు www.sakshi.comలో అందుబాటులో ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.