telangana state bjp
-
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్
పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి డాక్టర్ కె. లక్ష్మణ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం ఆయన ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈ అధ్యక్ష పదవి లభించింది. ఇక కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అవకాశం కల్పించారు. కొన్నాళ్ల పాటు బీజేపీకి దూరమై సొంత కుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప.. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరి, ఏకంగా అధ్యక్ష పదవిని కూడా చేపడుతుండటం విశేషం. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కేశవ ప్రసాద్ మౌర్య, పంజాబ్ బీజేపీ చీఫ్‌గా విజయ్ సంప్లా, అరుణాచల్ పార్టీ అధ్యక్షుడిగా తపిర్ గావోలను అధిష్ఠానం నియమించింది. -
'పవన్ కల్యాణ్ పార్టీపై స్పందించం'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ నిరాకరించారు. పవన్ కల్యాణ్ పార్టీపై స్పందించనని కరాకండిగా చెప్పారు.తెలంగాణ,సీమాంధ్ర రాష్ట్రాలలో బీజేపీ వివిధ పార్టీలతో పొత్తులపై ఇరు ప్రాంతాల నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఆయన హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. పవన్ స్థాపించిన కొత్త పార్టీపై స్పందించాలని విలేకర్లు ఆయన కోరారు. అందుకు ప్రతిగా ప్రకాశ్ జవదేకర్ పై విధంగా స్పందించారు. అయితే ఇరు రాష్ట్రాలలో పొత్తులపై వారం రోజులలో స్పష్టత వస్తుందని తెలిపారు. అందుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుందన్నారు.