Telangana State Tourism Corporation development
-
దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారిక నియామకంపై రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. దీనిపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హారిక ఎవరో తెలియదు అని చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది. యూట్యూబ్ స్టార్‌గా ఉన్న హారిక బిగ్‌బాస్ సీజన్ 4లో టాప్ -5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్‌గా మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం ఏర్పడింది. అయితే తాజాగా హారిక ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్’’ అంటూ హారిక చెప్పుకొచ్చింది. హారిక బ్రాండ్అంబాసిడర్ అంశం తెలంగాణతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మూడు రోజులుగా ఆమె చుట్టూనే వార్తలు నడిచిన విషయం తెలిసిందే. అయితే హారిక నియామకం వెనకాల ఏం జరిగిందో అనే విషయం సస్పెన్స్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. Here is the update .As you all know, Was appointed for Promoting and Marketing the Tourism dept hotels and properties earlier,but then will not be continuing it further due to several other reasons .And thanks to all my well-wishers,and sorry for all the disappointment,love u all pic.twitter.com/SzLAaIPxwR — Alekhya Harika (@harika_alekhya) March 10, 2021 -
దేత్తడి హారిక వివాదం: క్లారిటీ ఇచ్చిన శ్రీనివాస్ గుప్తా
-
దేత్తడి హారిక వివాదం: క్లారిటీ ఇచ్చిన గుప్తా!
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేం, యూట్యూబర్ దేత్తడి హారికను నియమించడంపై పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఏం అర్హత ఉందని బ్రాండ్ అంబాసిడర్‌ను చేశారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్, కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహించి తెలంగాణ ఘనతని విశ్వవ్యాప్తం చేసిన మలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికైన వారణాసి మానస పేర్లు కనిపించడం లేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు. అయితే దేత్తడి హారికను టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం టూరిజం మంత్రికి కూడా తెలీయదని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారికే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. హిమాయత్ నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను తొలగించారని వస్తున్న వార్తలను ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక కొనసాగుతారని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కోట్లు వెచ్చించి హారికను తీసుకోలేదు ‘తెలంగాణ ఆడబిడ్డ, కరీంనగర్ వాస్తవ్యురాలైన దేత్తడి హారికకు ప్రమోషన్ ఇచ్చేవిధంగా టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాం. మార్కెటింగ్‌లో ప్రమోషన్స్ కోసం హోటల్స్, బోటింగ్, బస్సులు నడవడానికి హారికను నియమించాం. కానీ ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ వల్ల ఆమెను తొలగించారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి నమ్మొద్దు. దీని గురించే ఎండీ గారు, మేమంతా కూర్చొని చర్చించాం. టూరిజాన్ని ప్రమోట్ చేసుకునేందుకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేస్తున్నాం. అందుకే హారికను తీసుకున్నాం. అంతేగాని ఆమెను కోట్లు పెట్టి మేము తీసుకోలేదు. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కాబట్టి హారికను పెడితే కొద్దీగా ప్రమోషన్ వస్తుందని మా ఆలోచన. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ టూరిజాన్ని నెంబర్ వన్‌గా డెవలప్ చేసేందుకు కృషిచేస్తున్నాం.’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Uppala Srinivas (@usrinivasgupta) .చదవండి: స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక బిగ్‌బాస్ హారికకు భారీ షాక్..! -
బిగ్‌బాస్ హారికకు భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్సైట్లో హారికకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది. ఇక హారిక నియామకంపై ఓ రేంజ్లో విమర్శలు వచ్చాయి. అసలు ఏ అర్హత ఆధారంగా ఆమెని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారంటూ నెటిజనులు విమర్శించారు. యూట్యూబ్ స్టార్‌గా సత్తా చాటడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస తదితరులను ఎంపిక చేయవచ్చు కదా అంటూ సూచించారు. చదవండి: స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక -
హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు
-
స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ ఫేం..‘దేత్తడి’ హారిక బంపర్ ఆఫర్ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక నియమితులయ్యారు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హారిక ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణ యాసతో యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సాధించిన దేత్తడి హారిక ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్‌తోనే తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్‌కు సెలక్ట్ అయ్యారు. హౌజ్‌లో మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చి ఫైనల్ వరకు పోరాడారు. టాప్ 5కు చేరి ప్రేక్షకుల మన్ననలు పొందారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హారిక వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పలు ప్రాజెక్టులతోపాటు సినిమా చాన్స్‌లు కొట్టేశారు హారిక. మరోవైపు.. ప్రస్తుత తన ప్రయాణం ప్రారంభమే అని, ఎప్పటికైనా హీరోయిన్ సినిమాలు చేయడమే తన లక్ష్యమని మనసులో మాటని బయటపెట్టింది బిగ్‌బాస్–4 ఫేమ్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక). నగరంలోని మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో సీఈఓ హరికాంత్, డాక్టర్ పూర్ణిమతో పాటు ముఖ్య అతిథిగా దేత్తడి హారిక పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒక అమ్మాయిగా తనకెప్పుడూ అమ్మే ఆదర్శమని, అంతకుమించి ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోనని పేర్కొంది. ముఖ్యంగా తాను తీసుకునే మంచి నిర్ణయాలే తనకు స్ఫూర్తి అని తెలిపింది. ప్రస్తుతం వరుడు కావలెను అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో చేస్తున్నాని, అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్లో మరో వెబ్ సిరీస్ రానుందన్నారు. ఎప్పటికైనా సినిమాల్లోనే.. మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో హీరోయిన్గా నటించాలనుందని దేత్తడి హారిక తెలిపింది. మహానటి లాంటి సినిమాలో చేయాలనుందని, అంతేకాకుండా రామ్ జామ్ తరహా సినిమాలన్నా తనకు ఎంతో ఆసక్తి అని పేర్కొంది. Sri Uppal Srinivas Gupta Garu, Chairman of Telangana state tourism Development corporation, appointed Miss Alekhya Harika as the new brand ambassador for TSTDC@USrinivasGupta @VSrinivasGoud @KTRTRS @harika_alekhya #Telanganatourism #TSTDC pic.twitter.com/cMIyK4yRlp — Telangana State Tourism (@tstdcofficial) March 8, 2021 చదవండి: ‘బిగ్‌బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్! -
తెలంగాణ టూరిజానికి ప్రపంచ ఖ్యాతి
సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ టూరిజానికి ప్రపంచ ఖ్యాతి రావాలని ఆశిస్తున్నామని, అందుకు తగ్గట్లుగానే తెలంగాణ స్టేట్ టూరిజం డెలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్‌టీడీసీ) అభివృద్ధి పనులు చేసి చూపిస్తూ ముందుకు సాగుతుందని టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు తెలిపారు. తెలంగాణ ఆవిర్భాదినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పర్యాటకుల శ్రేయస్సే ముఖ్యం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదాయం కన్నా పర్యాటకుల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పచ్చని ప్రాంతాల వైపు ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. టూరిజం అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. సహజ సిద్ధమైన వనరులు, కొండలు, కోటలు, రమణీయ ప్రదేశాలు, దేవాలయాలు, వనమూలికలు దొరికే గుట్టలు..ఒక్క తెలంగాణకే సొంతమని చెప్పారు. ప్రకృతి వరప్రసాదాల అభివృద్ధి.. చారిత్రక ప్రదేశాలైన నేలకొండపల్లి, నిజాం, మెదక్ కోటలు, రాణి రుద్రమదేవి మరణించిన చందుపట్ల, రాచకొండ తదితర ప్రాంతాలను వెలుగులోకి తెస్తున్నామన్నారు. ప్రకృతి వరప్రసాదాలైనా కుంతాల జలపాతం, జోడేఘాట్ అరణ్యప్రాంతం, వరంగల్ దగ్గర కి.మీ ఉన్న పాండవుల గుట్ట, రామగిరి ఖిల్లాను, శ్రీశైలం నుంచి అలంపూర్ తీర ప్రాంతం లాంటి ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని హైవేలపై హరిత హోటళ్లు- కాంప్లెక్స్‌లు నిర్మిస్తామన్నారు. విదేశీ పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో పది గోల్ఫ్ కోర్టులు అభివృద్ధి చేస్తామన్నారు. యువత కోసం భువనగిరి కోట వద్ద పర్వతారోహణ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బుద్వేల్‌లో.. బుద్వేల్ టూరిజం ప్రాజెక్ట్‌లో సెవెన్‌స్టార్ హోటల్. గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నామని చెప్పారు.