'వర్సిటీలు విద్యార్థులను తయారుచేసే కార్ఖానాలు కాదు'
డిచ్పల్లి (నిజామాబాద్ జిల్లా) : విశ్వవిద్యాలయాలు విద్యార్థులను తయారుచేసే కర్మాగారాలుగా మారకూడదని, మానవతా విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి పార్థసారథి సూచించారు.
తెలంగాణ వర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం వర్సిటీలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేలా చూడాలని, ర్యాగింగ్‌ను పూర్తిగా నిరోధించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఆడిటర్ జయప్రకాశరావు, పరీక్షల కంట్రోలర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.