telangana working president
-
త్వరలోనే టీపీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటన
-
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా దాసోజు శ్రవణ్
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధికార ప్రతినిధిగా తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ సోమవారం ఒక ప్రకటన వెలువరించింది. శ్రవణ్ సహా 10 మందిని ఏఐసీసీ అధికార ప్రతినిధులుగా నియమించింది. రాజ్యసభ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా శ్రవణ్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రధాన కార్యదర్శిగాతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రవణ్, అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చకున్నారు. ప్రజారాజ్యం పార్టీ, టీఆర్ఎస్ల్లో క్రియాశీలకంగా పనిచేసిన శ్రవణ్ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
షర్మిలకు పొంగులేటి అభినందనలు
-
ప్రజల ఆదరణను మరువలేను
వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. 48వ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో 48 కిలోల కేక్‌ను పొంగులేటి కట్ చేశారు. సాక్షి, ఖమ్మం: ‘‘నాపై ప్రజలు చూపుతున్న ఆదరణను జీవితాంతం మరిచిపోలేను. బతికున్నంత కాలం ప్రజాసేవ చేస్తా..’’ అని, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన 48వ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా ఏర్పాటు చేసిన 48 కిలోల కేకును పొంగులేటి కట్ చేశారు. ఆయనకు పార్టీ శ్రేణులు పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు తెలిపి, పూల వర్షం కురిపించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎన్నో ప్రతికూల పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నా జన్మదిన వేడుకల నిర్వహణకు విముఖత వ్యక్తం చేశాను. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే ఈ వేడుకలకు హాజరయ్యాను’’ అని చెప్పారు. తనపై ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను ఎప్పటికీ మరువలేనని, వారికి అండగా ఉంటూ వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ యువజన విభాగం మూడు జిల్లాల సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కూరాకుల నాగభూషణం (ఖమ్మం), డాక్టర్ గుగులోతు రవిబా బు నాయక్ (ఇల్లెందు), బొర్రా రాజశేఖర్ (వైరా), జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, నగర అధ్యక్షుడు తోట రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి కోటేశ్వరరావు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సంపెట వెంకటేశ్వర్రావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, నాయకులు షర్మిలాసంపత్, కొంగర జ్యోతిర్మయి, నగర అధికార ప్రతినిధులు హెచ్.వెంకటేశ్వర్లు, సకీనా, రఘునాధపాలెం మండల అధ్యక్షుడు దుంపటి నగేష్, టేకులపల్లి మండల అధ్యక్షుడు నర్సింగ్ లక్ష్మయ్య, ఇల్లెందు పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియల్, నాయకులు తుమ్మా అప్పిరెడ్డి, మందడపు రామకృష్ణారెడ్డి, కీసర వెంకటేశ్వరరెడ్డి, సూతగాని జైపాల్, మందడపు వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి సైదులు, మార్కం లింగయ్య గౌడ్, పత్తి శ్రీనివాస్, పగడాల భాస్కర్ నా యుడు, దామోదర్‌రెడ్డి, జంగాల శ్రీను, శ్రీదే వి, ప్రియదర్శిని, వాలూరి సత్యనారాయణ, దుంపల రవికుమార్, మైపా కృష్ణ, సుగ్గల కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు అన్నదానం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి ఆధ్వర్యంలో రాపర్తినగర్ బైపాస్ రోడ్డులోని అర్బన్ డిప్రైర్ రెసిడెన్షియల్ స్కూల్ (ప్రణతి సోషల్ సర్వీస్ సొసైటీ)లో విద్యార్థులకు అన్నదానం జ రిగింది. కార్యక్రమంలో ఎంపీ సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు తుం బూరు దయాకర్‌రెడ్డి, బండి సత్యం, టేకులపల్లి మండల అధ్యక్షుడు నర్సింగ్ లక్ష్మణ్, చౌటపల్లి సర్పంచ్ రవి, నాయకులు అబ్దుల్లా, ఫిరోజ్, సందీప్, కిషోర్, సుజాన్, నాయక్, అన్వర్, గన్ను, సజ్జీల్, అఖిల్, కేరాల విద్యాధర్, రాజేష్, రాకేష్, అలీల్, సాయి, మాలిక్, లకన్ పాల్గొన్నారు. మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ ఎన్నెస్పీ క్యాంపులోని మదర్ థెరిస్సా మానసిక వికలాంగుల కేంద్రంలో మానసిక వికలాంగుల మధ్య ఎంపీ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ జిల్లా నాయకుడు పత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేకును ఎంపీ కట్ చేశారు. మానసిక వికలాంగులకు పండ్లు, స్వీట్లు పంపిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీ సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి, బివి.రమణ, ఫసియుద్దీన్, తంగెళ్ల ఉపేందర్, వికలాంగుల కేంద్రం కార్యదర్శి పి.వనజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కార్యాలయాల ఏర్పాటు..
జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పా టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. సాక్షి, హైదరాబాద్ : జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని, అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటిశ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో జిల్లా నాయకులు రవిప్రసాద్, అనిల్‌కుమార్, ప్రమీల, అలీముద్దీన్, షబ్బీర్, రాజ్‌కిరణ్, మిశ్రం శంకర్, నాగోరావు, పురుషోత్తం, రాష్ట్ర పార్టీ నాయకులు జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్ కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీని వచ్చే అయిదారు నెలల్లో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్దంగా ఉన్న నాయకుల జాబితాను నియోజకవర్గాల వారీగా తయారు చేసి తనకు అందజేయాలని జిల్లా నాయకులను ఆయన కోరారు. ముందుగా ఈ నాయకులతో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు. గతంలో పార్టీలో ఉన్న నాయకులు మళ్లీ చురుకైన పాత్రను నిర్వహించేలా చూస్తామన్నారు. పార్టీలోని ఇతర నాయకులతో పార్టీ జిల్లా కన్వీనర్ మాట్లాడి నెలరోజుల్లో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని వారికి పొంగులేటి హామీనిచ్చారు. జిల్లాకు చెందిన వారికి, స్థానికులకు పార్టీలో ప్రాధాన్యతనివ్వాలని కొందరు జిల్లా నాయకులు కోరారు. చురుకుగా పనిచేసే వారికి పార్టీలో తగిన ప్రోత్సాహం ఇవ్వాలని వారు విజ్ఞప్తిచేశారు. జిల్లా నాయకులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్రపార్టీ నాయకులు చెప్పారు. -
పొంగులేటికి స్వాగతం పలికేందుకు కేడర్ సన్నద్ధం
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాకు ఎంపీ వస్తుండడంతో పార్టీ కేడర్ అంతా భారీ ర్యాలీతో స్వాగతం పలికేందుకు సన్నద్ధమైంది. హైదరాబాద్ నుంచి మంగళవారం చేరుకుంటున్న ఆయనకు కూసుమంచి వద్ద స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీకి చెందిన జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు ఇందులో పాల్గొనున్నారు. పొంగులేటి పర్యటన షెడ్యూల్ ఇదీ... హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు కూసుమంచికి పొంగులేటి చేరుకుంటారు. ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంపీకి ఘన స్వాగతం పలుకుతారు. కూసుమంచి నుంచి భారీ వాహనశ్రేణితో ర్యాలీ బయల్దేరుతుంది. జీళ్లచెరువు, తల్లంపాడు, ఖమ్మంరూరల్ పోలీస్‌స్టేషన్ మీదుగా ఈ ర్యాలీ ఖమ్మం నగరంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత కాల్వొడ్డు, బస్టాండ్ సెంటర్, వైరారోడ్డు మీదుగా పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుంటుంది. ఇక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ప్రసంగిస్తారు.