
పొంగులేటికి స్వాగతం పలికేందుకు కేడర్ సన్నద్ధం
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాకు ఎంపీ వస్తుండడంతో పార్టీ కేడర్ అంతా భారీ ర్యాలీతో స్వాగతం పలికేందుకు సన్నద్ధమైంది. హైదరాబాద్ నుంచి మంగళవారం చేరుకుంటున్న ఆయనకు కూసుమంచి వద్ద స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీకి చెందిన జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు ఇందులో పాల్గొనున్నారు.
పొంగులేటి పర్యటన షెడ్యూల్ ఇదీ...
హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు కూసుమంచికి పొంగులేటి చేరుకుంటారు.
ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంపీకి ఘన స్వాగతం పలుకుతారు.
కూసుమంచి నుంచి భారీ వాహనశ్రేణితో ర్యాలీ బయల్దేరుతుంది.
జీళ్లచెరువు, తల్లంపాడు, ఖమ్మంరూరల్ పోలీస్‌స్టేషన్ మీదుగా ఈ ర్యాలీ ఖమ్మం నగరంలోకి ప్రవేశించనుంది.
ఆ తర్వాత కాల్వొడ్డు, బస్టాండ్ సెంటర్, వైరారోడ్డు మీదుగా పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుంటుంది. ఇక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.
సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ప్రసంగిస్తారు.