telangnaa
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టించిన వర్షం
-
సికింద్రాబాద్‌లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం!
ఆర్మీలో స్వల్పకాలిక సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు చేరుకున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ స్టేషన్ ఆవరణలో నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒకటో నంబరు ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకున్ని బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న రైలు ఇంజను ఎదుట బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం అంతా సవ్యంగా సాగిపోతుందనునే దశలో ఒక్కసారిగా అదుపు తప్పింది. అదుపు తప్పింది అప్పటి వరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న యువకుల్లో కొందరు అదుపు తప్పారు. రైల్వే ఆస్తులపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదంతు ఉదయం 9 గంటల సమయంలో మొదలైంది. యువకుల ఆందోళను అదుపు చేసేంత రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆందోళన బీభత్సంగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఒకటో నంబరు నుంచి మూడో నంబరు ఫ్లాట్‌ఫారమ్ వరకు రణరంగంగా మారింది. అయోమయం ఓవైపు ఆవేశంలో ఉన్న యువకులు మరోవైపు వారిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో సికింద్రాబాద్ స్టేషన్ యుద్దక్షేత్రంగా మారిపోయింది. పార్సిల్ కార్యాలయంలోకి చొరబడిన యువకులు అక్కడ చేతికి అందిన వస్తువునుల బయటకు తీసుకువచ్చారు. రైల్వ పట్టాలపై వేసి తగుల బెట్టారు. ఇందులో ద్విచక్ర వాహనాలతో త్వరగా మండిపోయే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లో స్టేషన్ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియిన అయోమయం నెలకొంది. దీంతో రైళ్లలో ఉన్న ప్రయాణిణులు గందరగోళానికి గురయ్యారు. ప్రయాణం స్టేషన్‌కు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈస్టుకోస్టుకు నిప్పు స్టేషన్లో దట్టమైన పొగలు అలుముకోవడం, మంటలు వ్యాపించడంతో ఇక ఆందోళనకు అడ్డే లేకుండా పోయింది. అరగంట పాటు స్టేషన్లో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు పెట్టారు. ముఖ్యంగా ఆ రైలులో పార్సిల్ కౌంటర్ తెరిచే ఉంటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. క్షణాల్లోనే ఇతర బోగీలకు చేరుకున్నాయి. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఈస్ట్‌కోస్టుతో పాటు అజంతా, ఒక ఎంఎంటీఎస్ రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. అప్రమత్తం ఒక్కసారిగా చెలరేగిన ఆందోళనతో ఇటు రైల్వే అధికారులు, అటు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే రైళ్లను ఎక్కడిక్కడే నిలిపేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఇతరులను బయటకు పంపించారు. రాష్ట్ర పోలీసులు బలగాలను అక్కడికి రప్పించారు. అయితే అప్పటికే స్టేషన్లో భీతావహా వాతావరణ పరిస్థితి నెలకొంది. లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ఆందోళన కారులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఫర్నీచర్ ధ్వంసం ఒకటి నుంచి మూడో నంబరు వరకు ఫ్లాట్‌ఫారమ్స్‌పై భారీగా ఆస్తి నష్టం జరిగింది. స్టేషన్‌పై ఉన్న కేఫ్టేరియాలో కూడా ధ్వంసం అయ్యాయి. లైట్లు, సీసీ కెమెరాలు, చెత్త కుండీలు ఇలా ప్లాట్‌ఫారమ్‌పై కనిపించిన వస్తువులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు స్టేషన్ బయట కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళనలకు బయపడిన ప్రయాణికులు కొందరు తమ వస్తువులను స్టేషన్ ఆవరణలోనే వదిలేసి బయటకు పరుగులు తీశారు. మరికొందరు తమ వాళ్లు తప్పిపోయారంటూ ఆందోళన చెందారు. చివరకు ఉదయం 10:30 గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఎన్ఎస్యూఐ ప్రటకించింది. టియర్‌గ్యాస్ పదిన్నర తర్వాత పోలీసుల బలగాలు భారీగా చేరుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. మరోవైపు స్టేషన్‌కు చేరుకున్న ఫైర్ ఫైటర్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఆందోళనలో ఇద్దరు మరణించినట్టు వార్తలు వస్తున్నాయ్. చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత -
తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై..
సాక్షి, హైదరాబాద్(భద్రాద్రి కొత్తగూడెం): ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకొని గిరిజనులను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి తీవ్ర బెదిరింపులకు గురిచేసిన ములకలపల్లి ఎస్సైపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సివిల్ వివాదమని ఎస్పీకి ఎస్సై ఒక వైపు నివేదిక ఇస్తూ.. మరోవైపు చట్టవిరుద్ధంగా పిటిషనర్ భర్త, మామలను ఎలా నిర్బంధించారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, భద్రాద్రి ఎస్పీలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త, మామలను ములకలపల్లి ఎస్సై వేధింపులకు గురిచేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ముల్కలపల్లి మండలం వేముగుంటకు చెందిన కొండూరు ఈశ్వరమ్మ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ హైకోర్టుకు రాసిన లేఖను ధర్మాసనం గతంలో విచారణకు స్వీకరించింది. సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డిని కోర్టు సహాయకారిగా (అమికస్‌క్యూరే) నియమించింది. ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు పిటిషనర్ భర్త, మామలను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని, పోలీసులు చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని ప్రకాష్‌రెడ్డి నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా వారిని స్టేషన్‌కు పిలిపించారని, ఎస్సై ఎవరినీ బెదిరించలేదని హోంశాఖ తరఫున న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి నివేదించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఈశ్వరమ్మ ఏం రాసిందంటే... ‘వేముగంటలో మాకు 6 ఎకరాల భూమి ఉంది. పాల్వంచ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ముందు దాఖలు చేసిన కేసులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. అయినా మా ప్రత్యర్థులకు అనుకూలంగా ములకలపల్లి ఎస్సై నా భర్త, మామలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి రాత్రి వరకు నిర్బంధించారు. అన్ని రెవెన్యూ రికార్డులు, కోర్టు తీర్పులను చూపించినా ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారు. తలకు గన్ను గురిపెట్టి ఆ భూమిపై హక్కులను వదులుకుంటున్నట్లు కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ భూమిలోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. తమ ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. సివిల్ వివాదంలో జోక్యం చేసుకొని అక్రమంగా తన భర్త, మామను నిర్బంధించి వేధింపులకు గురిచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోండి’అని ఈశ్వరమ్మ గవర్నర్‌కు రాసిన లేఖలో కోరింది. చదవండి: నేషనల్ డాక్టర్స్ డే: థ్యాంక్యూ డాక్టర్ గారూ.. -
మూడేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. కేసు పెట్టిన మారలేదు.. చివరకు..
సాక్షి, పెంచికల్పేట్(ఆదిలాబాద్): ఇంటి పక్కన నివసించే వ్యక్తి లైంగిక వేధింపులకు వివాహిత బలైంది. పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినా అతడి వేధింపులు ఆగకపోవడంతో భరించలేక శనివారం ఆత్మహత్య చేసుకుంది.ఎస్సై సిహెచ్.రమేష్ తెలిపిన వివరాలు.. ఎల్కపల్లి గ్రామానికి చెందిన జునుగరి శ్రీనివాస్‌కు 20ఏళ్ల క్రితం ఈస్గాం గ్రామానికి చెందిన సుజాత(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. సుజాత ఇంటి పక్కనే ఉంటున్న రాచర్ల కృష్ణ గత మూడేళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా తీరు మారలేదు. వేధింపులు భరించలేక రెండేళ్ల క్రితం స్థానిక పెంచికల్పేట్ పోలీసుస్టేషన్లో సుజాత తన భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణను అరెస్టు చేశారు. అయినా మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన సుజాత శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కారకుడైన కృష్ణను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతురాలి తల్లి రాధాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. చదవండి: అప్పన్నకే శఠగోపం -
తలనొప్పి తొలగింది
-
టీఆర్ఎస్లో చేరనున్న డీఎస్?
-
టీఆర్ఎస్లో చేరనున్న డీఎస్?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంతో పలు అంశాల్లో తీవ్రంగా విభేదిస్తున్న డి శ్రీనివాస్.. గత కొంత కాలంగా తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా అగ్రనేత దిగ్విజయ్ సింగ్ విషయంలో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి పిలిచినా కూడా.. మాట్లాడటం కాదు కదా, కనీసం ముఖం చూసేందుకు కూడా తనకు ఇష్టం లేదని ఆయన కటువుగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుపడింది దిగ్విజయ్ సింగేనన్నదే డీఎస్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావుతో కూడా మంగళవారం నాడు డీఎస్ భేటీ అయినట్లు సమాచారం. పార్టీలో చేరే విషయంతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారని అంటున్నారు. డీఎస్ గనక పార్టీలో చేరితే.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా సోనియాగాంధీ పిలిచి.. పార్టీలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తానంటే తప్ప.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశమే లేదని అంటున్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో ఈ విషయమై విస్తృతంగా చర్చించారు. ఇక ప్రస్తుతం బాల్ డీఎస్ కోర్టులోనే ఉంది. ఆయన ఓ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని చెబుతున్నారు. -
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు'
-
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు'
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు శివకుమార్, రెహ్మాన్ బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా సదారాంను ఆ పదవి నుంచి తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పొరపాట్లు చోటుచేసుకున్నాయని, రాజా సదారాం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయనను వెంటనే తొలగించాలని కోరారు. ఎన్నికలకు ఇద్దరు పరిశీలకులను నియమిస్తామని భన్వర్‌లాల్ తమకు హామీ ఇచ్చారని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తామని ఆయన చెప్పినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు శివకుమార్, రెహ్మాన్ చెప్పారు.