Telenangana
-
పోలీసులు రాగానే మేము అడ్డంగా ఇరుక్కుపోయాం:కుషిత
-
పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖిలా వరంగల్ : తెలంగాణ కళా, వృత్తివిద్యలను గౌరవించాలని, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలని పీటీఐ జేఏసీ రాష్ట్ర ఆధ్యక్షుడు టి.కేశవకుమార్, ముఖ్యసలహాదారు తిరువరంగం ప్రభాకర్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కోరారు. బుధవారం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కడియంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లను ఏడాది కూడా రీ ఎంగేజ్ చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో పీటీఐ జేఏసీ నాయకులు కృష్ణహరి, శరత్, లక్ష్మణ్, రాధిక, యాకయ్య ఉన్నారు. -
క్షేత్రస్థాయిలో పర్యటనలు
పార్టీ పరిస్థితిని అంచనా వేద్దాం.. టీపీసీసీ నిర్ణయం ఆగస్టు రెండో వారం నుంచి మండలాల్లో పొన్నాల పర్యటనలు హైదరాబాద్: తమ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షలు కొనసాగిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)... త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారం నుంచి జిల్లాల్లో పర్యటించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సిద్ధమయ్యారు. ఈ సమీక్షల ద్వారా గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను తెలుసుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయాన్ని కూడా అంచనా వేయవచ్చని ఆయన భావిస్తున్నారు. మండలాల వారీగా పార్టీ బలోపేతానికి తగిన చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న విషయం తెలిసిందే. వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలంటే గాంధీభవన్‌కే పరిమితమైతే ఉపయోగం లేదని, పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించడమే మేలని టీపీసీసీ చీఫ్ పొన్నాల నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాలో నాలుగైదు రోజుల చొప్పున మకాం వేసి మండలాల వారీగా సమీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఏయే చర్యలు చేపట్టాలనే విషయంలో కార్యకర్తల అభిప్రాయానికే పెద్దపీట వేయాలన్నదే పొన్నాల అభిమతంగా కన్పిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్నా... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏవిధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సమీక్షల ద్వారా అంచనా వేయనున్నారు. దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటివరకూ మండలాల వారీగా పీసీసీ సమీక్షలు నిర్వహించిన దాఖలాల్లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో.. పార్టీ వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకే ఈ సమావేశాలకు టీపీసీసీ సిద్ధమవుతోంది.