Television artists
-
తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో విడుదల
తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television) కార్యవర్గం ఎన్నికల సందర్భంగా జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తాము గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీలు ఇచ్చారు. కాగా.. ఈనెల 31న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజవిన్ ఆర్టిస్టు అసోషియేషన్ అసోసియేషన్‌ను ప్రారంభించాం. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమలు చేశామని ఘనంగా చెప్పగలుగుతున్నాం. మా అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది. వందలాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. తెలుగు ఆర్టిస్టులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రయత్నం. సీరియల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులందరికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సమర్థులైన జీఎస్ హరి ప్యానెల్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడతాం.' అని అన్నారు.జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి మాట్లాడుతూ.. 'నటుడుగా ఒక దశలో నా జీవితం అయిపోయిందనుకున్న సమయంలో నన్ను ఆదుకుని నా నట జీవితాన్ని నిలబెట్టింది టీవీ రంగం. కరోనా సమయంలో పెద్దలు చిరంజీవి , తలసాని శ్రీనివాస్ సహకారంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందించే బాధ్యత తీసుకున్నది మన అసోషియేషన్. నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గర్వంగా చెప్పగలను. విజయ్ యాదవ్, వినోద్ బాల ఆధ్వర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంతరం ప్రయత్రిస్తానని ఈ సందర్బంగా హామీ ఇస్తున్నా.' అని అన్నారు. కాగా.. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ తమ జీఎస్ హరి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుదల చేశారు. తమ ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి, జనరల్ సెక్రటరీ అభ్యర్థి భార్గవ గొట్టికొండ, ట్రీజరర్ అభ్యర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాంజగన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు జీఎస్ శశాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్‌పేయి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు మేక రామకృష్ణ, వికాస్, దీప దుర్గంపూడి, మహిళ ఈసీ మెంబర్స్ అభ్యర్థులు రాగ మాధురి, లిరిష, మహతి రిజ్వాన, లక్ష్మిశ్రీ, ఈసీ మెంబర్స్ అభ్యర్థులు బాలాజీ, శివకుమార్ కముని, విజయ్ రెడ్డి, ద్వారకేష్, మురళికృష్ణ రెడ్డి, గోపికర్, మురళికృష్ణ, టీవీ నటీనటులు తదితరులు పాల్గొన్నారు.జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో హామీలు ఇవే :1. ఒక్కో తెలుగు సీరియల్లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానెల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు4. మెడిక్లైమ్ పాలసీ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు5. నాగబాబు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ కృషి6. మహిళ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం.7. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు8. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం9. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి, కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తాం.10. ఈఎస్ఐ స్కీం వర్తింప చేస్తాం11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమలు చేస్తాం12. ప్రతి మెంబర్‌కి వర్క్ కల్పిస్తాం -
బిగ్‌బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు
తాండూరుకు చెందిన యువ కళాకారులు బుల్లితెరపై తళుక్కున మెరుస్తున్నారు. ప్రఖ్యాత టెలివిజన్ షోలల్లో సత్తాచాటుతూ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో ఒకరు ఢీ– 13లో టైటిల్ సాధించగా, మరొకరు గతేడాది నిర్వహించిన బిగ్‌బాస్– 4లో టాప్– 5 ఫైనలిస్ట్ల్లో నిలిచారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. తాండూరు టౌన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన దువచర్ల మహేశ్– పద్మావతి దంపతుల కూతురు కావ్యశ్రీ ఇటీవల ముగిసిన ఢీ– 13 విన్నర్‌గా నిలిచింది. కావ్యశ్రీ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అమ్మాయిలు ఇంటికే పరిమితం కావాలనే ధోరణి నుంచి వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా పిల్లలను ప్రోత్సహించారు. దీంతో కావ్యశ్రీ తనకిష్టమైన డ్యాన్స్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కావ్యశ్రీ ఓ శుభకార్యంలో చేసిన డ్యాన్స్‌ను చూసిన మాస్టర్ ఆమెకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఢీ షో కోసం సైడ్ డ్యాన్సర్‌గా చేరింది. మాస్టర్ పల్టీ రవి ఆధ్వర్యంలో అక్కడే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. 2015లో ఢీ– జూనియర్స్ సీజన్– 2లో గ్రూప్ డ్యాన్సర్‌గా చేసింది. తల్లిదండ్రులతో కావ్యశ్రీ అనంతరం ఢీ– 13లో కంటెస్టెంట్‌గా వైల్డ్‌కార్డు ఎంట్రీతో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా తన డ్యాన్స్‌లతో అదరగొట్టి, ఫినాలేలోకి అడుగు పెట్టింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఢీ–13 ఫైనల్లో విన్నర్‌గా నిలిచింది. సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్‌తో పాటు ప్రైజ్ మనీ అందుకుంది. } ఢీ–13లో స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న కావ్యశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కావడమే లక్ష్యం చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. అదృష్టవశాత్తు ఢీ– 13లో అవకాశం దక్కింది. నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ శ్రీకాంత్, మాస్టర్లు శ్రీను, రాముకు రుణపడి ఉంటా. ఫైనల్లోకి ప్రవేశించి.. టైటిల్ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం. – కావ్యశ్రీ, ఢీ– 13 టైటిల్ విన్నర్ బిగ్‌బాస్ షోలో అదరగొట్టిన అరియానా గతేడాది జరిగిన బిగ్‌బాస్– 4 రియాల్టీ షోలో తాండూరు అమ్మాయి అరియానా గ్లోరీ మెరిసింది. 105 రోజుల పాటు కొనసాగిన ఈ పోటీలో టాప్– 5 పోటీదారుల్లో నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వరకు గట్టి పోటీ ఇచి్చంది. తాండూరు మండలం అంతారానికి చెందిన సత్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సత్యనారాయణ ఫొటోగ్రాఫర్ కాగా శశికళ నర్స్‌గా పనిచేసి రిటైరయ్యారు. వీరి చిన్న కూతురు అరియానా ఇంటర్ వరకు తాండూరులో అభ్యసించింది. కూకట్‌పల్లిలోని ప్రగతి కళాశాలలో డిగ్రీ చదివింది. తాండూరులో అభిమానులకు అభివాదం చేస్తున్న అరియానా (ఫైల్) అల్లు అర్జున్ చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకుంటున్న కావ్యశ్రీ చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయిగా పేరున్న అరియానా తనలోని ప్రతిభను చాటిచెప్పాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంది. స్టూడియో వన్, జెమినీ కామెడీ, కెవ్వు కేక, జింగ్ జింగ్ అమేజింగ్ తదితర టీవీ షోలకు వ్యాఖ్యాతగా పనిచేసింది. తన కళాత్మక దృష్టిని యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేసింది. ఈ క్రమంలో బిగ్‌బాస్– 4 నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. తొలిరోజు నుంచి తన చురుకైన∙ప్రదర్శనలతో టాప్ ఫైవ్ అభ్యర్థుల్లో నిలిచింది. బిగ్‌బాస్‌లో వచ్చిన ప్రైజ్‌మనీతో ఇల్లు కట్టుకోవడంతో పాటు గ్రామంలోని రైతులకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా చేస్తున్న అరియానా మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం. -
టీవీక్షణం: సినిమా పిలిచింది!
టీవీ ఆర్టిస్టులందరికీ సినిమాల్లో నటించాలనే ఉంటుంది. అందుకే సీరియల్స్‌లో కాస్త పేరు వచ్చాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అంకితా లోఖండే, అవికా గోర్, ద్రష్టి ధామిలను మాత్రం సినిమా అవకాశాలే వెతుక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కి కాబోయే భార్య అయిన అంకిత... పవిత్రరిష్తా సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది. అదే ఆమెకు షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించింది. ఫరాఖాన్ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న ‘హ్యాపీ న్యూ ఇయర్’లో ఓ ముఖ్య పాత్ర చేస్తోంది అంకిత. అలాగే ‘చిన్నారి పెళ్లికూతురు’గా అందరి మనసులనూ దోచుకున్న అవికా గోర్... ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. ఇక ద్రష్టి ధామి. అదృష్టం అంటే ఆమెదే. సీరియల్స్‌లో తిరుగు లేదు. పైగా ఝలక్ దిఖ్లాజా డ్యాన్స షోలో గెలిచి మరింత పాపులర్ అయిపోయింది. దాంతో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర దర్శకుడు రోహిత్‌శెట్టి... ఆమెని ఏకంగా అజయ్ దేవగన్ సరసన హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. అది కనుక కన్ఫామ్ అయితే ఇక ద్రష్టికి తిరుగే ఉండదు. ఆమె బాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇలా ముగ్గురు ఫేమస్ టీవీ స్టార్సని ఒకేసారి సినిమా అవకాశాలు ముంచెత్తడం విశేషమే. చెప్పాలంటే... సీరియళ్లలో ప్రదర్శించినన్ని భావోద్వేగాలను సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఉండదు. అందుకే సీరియల్స్‌లో నటించడమే కష్టమంటారు. అలా చూసుకుంటే... ఈ టాప్ టీవీ నటీమణులు కచ్చితంగా సినిమాల్లో సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. చూద్దాం... వీరి సినీ ప్రయాణం ఎలా సాగుతుందో!