జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
తెలకపల్లి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రెడ్డెపాకుల రమేష్, శంకర్లు అన్నారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జర్నలిస్టులకు తెలంగాణవ్యాప్తంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని, 239 జీఓ ప్రకారం జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లతోపాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులందరికీ 300 గజాల స్థలంలో రూ.7లక్షల 50వేలతో ట్రిపుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలన్నారు. సంక్షేమ నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శంకర్, చిలుక శేఖర్‌రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.