బీజేపీ అగ్రనేతలతో సుజనా చౌదరి భేటీ
న్యూఢిల్లీ: బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందా? ఆ దిశగా ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయా? తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి మంగళవారం బీజేపీ అగ్రనాయకులను కలవడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
సుజనా చౌదరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలిశారు. బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు. దీంతో ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. కాగా తాను వ్యక్తిగతంగానే బీజేపీ నాయకులతో కలిశానని, రాజకీయాల గురించి మాట్లాడలేదని భేటీ అనంతరం సుజనా చౌదరి చెప్పారు.