బీజేపీ అగ్రనేతలతో సుజనా చౌదరి భేటీ | Telugedesham MP Sujana choudary meets Rajnath singh, Arun jaitley | Sakshi
Sakshi News home page

బీజేపీ అగ్రనేతలతో సుజనా చౌదరి భేటీ

Published Tue, Mar 11 2014 6:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి మంగళవారం బీజేపీ అగ్రనాయకులను కలవడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

న్యూఢిల్లీ: బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందా? ఆ దిశగా ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయా? తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి మంగళవారం బీజేపీ అగ్రనాయకులను కలవడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

సుజనా చౌదరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలిశారు. బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు. దీంతో ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. కాగా తాను వ్యక్తిగతంగానే బీజేపీ నాయకులతో కలిశానని, రాజకీయాల గురించి మాట్లాడలేదని భేటీ అనంతరం సుజనా చౌదరి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement