డీఅండ్‌బీ టాప్500లో 21 తెలుగు కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ విడుదల చేసిన ‘ఇండియా టాప్ 500 కంపెనీస్- 2015’ నివేదికలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 21 కంపెనీలకు చోటు లభించింది. ఇందులో ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ 24వ స్థానం సంపాదించగా, డాక్టర్ రెడ్డీస్ (31), దివీస్ ల్యాబ్ (67), అపోలో హాస్పిటల్స్ (79), అమరరాజ బ్యాటరీస్ (129) టాప్-500 జాబితాలో ఉన్నాయి. ఇక మిగతా కంపెనీల విషయానికి వస్తే బిఎస్ లిమిటెడ్(209), సెయైంట్ (222), ఎన్సీసీ (259), ఆంధ్రాబ్యాంక్ (302), అరబిందో ఫార్మా (305), హెరిటేజ్ ఫుడ్స్ (316), హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ (391).
స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (394), నవభారత్ వెం చర్స్ (404), అవంతి ఫీడ్స్ (417), రాంకీ ఇన్ఫ్రా (445), సంఘి ఇండస్ట్రీస్ (448), కావేరీ సీడ్స్ (480), గ్రాన్యూల్స్ (483), శ్రీకాళహస్తి పైప్స్ (485), ఎక్సల్ క్రాప్ కేర్ (493) ఉన్నాయి. 2014లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 16 కంపెనీలకు మాత్రమే స్థానం లభించింది. ఈ టాప్ 500 కంపెనీల ఆదాయం జీడీపీలో 20 శాతానికి సమానమని, పన్నుల ఆదాయంలో మూడో వంతు ఈ కంపెనీల నుంచే వస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.