breaking news
telugu girls
-
మరో ప్రతిష్టాత్మక పోటీకి తెలుగమ్మాయిలు
హైదరాబాద్ నగర వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయో లేదో మరో ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్ ‘మిస్ యూనివర్స్’ ప్రారంభమవుతోంది. ఈ సారి థాయ్‌లాండ్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి ఆడిషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్‌లను ఎంపిక చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఫైనలిస్ట్‌లను ఎంపిక చేశారు. హైదరాబాద్ నగరంలో జరగనున్న ఫినాలేలో ఎంపిక చేసిన ఆ ఇద్దరినీ తెలుగు రాష్ట్రాల తరపున మిస్ యూనివర్స్ ఇండియా గ్రాండ్ ఫినాలేకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన కొందరు ఫైనలిస్టులు తమ ప్రయాణాన్ని, ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరోమాది మల్టీ టాస్కింగ్.. నాది విశాఖపట్నం, ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మెడిసిన్, మోడలింగ్ రెండూ చిన్నప్పటి కలలే. ఆడవారికున్న శక్తి మల్టీ టాస్కింగ్. నేను బ్రాహ్మన వర్గం నుంచి వచ్చాను.. మొదట్లో కుటుంబం నుంచి అడ్డంకులు వచ్చినప్పటికీ ఇంట్లో ఒప్పించాను. ఏ రంగంలో చూసినా తెలుగు వారు టాప్‌లో ఉన్నారు. మిస్ యూనివర్స్‌లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్ నగరంతో పాటు ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో ర్యాంప్ వాక్, గ్రూమింగ్, స్టైల్స్ వంటి అంశాలపై శిక్షణ తీసుకున్నా. ఇప్పటికీ ఇంట్లో మగవారికి పీరియడ్స్ గురించి చెప్పుకోలేని పరిస్థితి. దీనిని పోగొట్టడానికి ఈ వేదికను వినియోగించుకుంటా. డాక్టర్‌గా కన్నా ఫ్యాషన్ ఐకాన్‌గా ఈ అంశాన్ని మరింత ప్రభావ వంతంగా ముందుకు తీసుకెళ్లగలను. – డా.వైష్ణవీ వెన్నెల, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుప్రియాంక చోప్రా స్ఫూర్తి.. పుట్టి పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాద్‌లోనే.. డేటా సైన్స్– ఏఐలో బీటెక్ చేశా. నాకున్న టాలెంట్ స్కిల్‌తో టాప్ 15లో స్థానం పొందాను. ఈ ఎంపికలో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్నదే ముఖ్యం. ఫ్యాషన్ వాక్, ప్రజెంటేషన్, డ్రెస్సింగ్ వంటి అంశాల్లో ఆడిషన్స్ జరిగాయి. ప్రియాంక చోప్రా, లారా దత్త ఇష్టం. మోడలింగ్ కోసం పలు అంశాల్లో ముంబయిలో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ జరిగితే ఎంత గర్వపడ్డామో.. ఒక ఆడపిల్ల బ్యూటీ పేజెంట్‌లో పాల్గొంటే అంతే గర్వపడాలి. నా బ్యూటీ విత్ పర్సస్.. చిన్నారుల కోసం పనిచేయడం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. విపత్కర పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలో నేర్పించాలన్నదే లక్ష్యం. పలు ఎన్జీఓలతో పనిచేశాను. – అను శ్రీ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుమిస్ టీన్ తెలంగాణ..ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేస్తున్నా. రెండేళ్ల నుంచి మోడలింగ్‌లో ఉన్నా. 2023లో ఢిల్లీలో నా మొదటి కాంపిటీషన్లో మిస్ టీన్ తెలంగాణ క్రౌన్, తరువాతి ఏడాది ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్ గెలుచుకున్నా. మిస్ యూనివర్స్ కిరీటం కన్నా, దాని వల్ల వచ్చే గుర్తింపు శక్తివంతమైనది. నేను బ్రాహ్మణ వర్గం నుంచే వచ్చాను. ఈ విషయంలో నాన్న నన్ను అర్థం చేసుకుని ప్రోత్సహించారు. సినిమాలు, మోడలింగ్, చదువును బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. తెలుగమ్మాయిల అందమంతా వారి కళ్లలోనే కనిపిస్తుంది. ఉమెన్ సేఫ్టీ, వాటర్ స్కేర్ సిటీ, నిరుద్యోగం అంశాల్లో కృషి చేయాలనుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. దీని పైన దృష్టి సారిస్తున్నా. – లక్షణ అత్తిలి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టువిలేజ్ టూ మిస్ యూనివర్స్.. నేనొక డాక్టర్.. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్నా. 2019 నుంచి బ్యూటీ పేజెంట్‌లో పలు సార్లు రిజెక్ట్ అయ్యినా పట్టుదలతో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుగా నిలిచాను. నాన్న రైతు.. మారుమూల గ్రామం. ఇక్కడి అమ్మాయిలకు ఎన్నో బంధనాలు. వాటన్నింటీనీ చేధించాలనేదే లక్ష్యం. గతంలో రన్నరప్‌గా నిలిచిన ఆటో డ్రైవర్ కూతురు మాన్యా సింగ్ నాకు స్ఫూర్తి. మహిళలు పెద్ద లక్ష్యాలను ఎంచుకోడానికి భయపడుతున్నారు. దానిని సాధించి ఈ తరానికి ఒక మార్గదర్శకంగా నిలవాలనుంది. విశ్వ వేదిక పై మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించాలనుంది. సాఫల్య అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మహిళలకు, బాలికలకు మెన్స్ట్రువరల్ హైజీన్‌పై అవగాహన కల్పిస్తున్నా. – డా.సురేఖ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైనలిస్టుమాతృభూమిపై ప్రేమతో.. న్యూయార్క్‌లో పుట్టాను, న్యూ జెర్సీలో పెరిగాను. నా మాతృభూమిపై ప్రేమతో కుటుంబంతో పాటు హైదరాబాద్ వచ్చాను. అమ్మ ఒకే మాట చెబుతుంది.. ఏది చేసినా చదువును నిర్లక్ష్యం చేయొద్దని. అందుకే మెడిసిన్, మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో రాణిస్తున్నా. మిస్ యూనివర్స్‌తో పాటు, నటనలో ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ యువతిగా నిలవాలనేదే లక్ష్యం. బాడీ టైప్, కలర్‌పై వారికి తోచింది మాట్లాడతారు. ఎవరేమన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం. సొంతంగా గ్రూమింగ్, మేకప్ ప్రతిదీ నేర్చుకున్నా. బేసిక్ మెంటల్ హెల్త్‌పై, డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వయెలెన్స్పై అవగాహన కలి్పంచడం విధిగా పెట్టుకున్నాను. జెండర్ స్టీరియోటైప్ పోగొట్టిన రాణి రుద్రమా దేవి నాకు స్ఫూర్తి. – కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్టు -
టీ 20 అండర్ 19 వరల్డ్ కప్‌లో మన చిచ్చర పిడుగులు
త్రిష, షబ్నమ్... ‘తెలుగుతేజాలు’ అంటూ వార్తల్లో పతాక శీర్షికలో వెలుగుతున్న క్రీడాకారిణులిద్దరూ. మహిళల అండర్ 19 కేటగిరీలో టీ 20 వరల్డ్ కప్ క్రికెట్‌కు ఎంపికైన ఇండియా జట్టులో స్థానం సంపాదించుకున్న తెలుగమ్మాయిలు వీళ్లు. త్రిష భద్రాచలం అమ్మాయి, షబ్నమ్ వైజాగ్ అమ్మాయి. నేను భద్రాచలంలో ఫిట్నెస్ కోచ్‌గా ఉండేవాడిని. త్రిష మాకు ఏకైక సంతానం. త్రిష అమ్మ తనకు కావల్సిన పోషకాహారంపై దృష్టి పెడితే, నేను తను క్రీడల్లో శిక్షణ ఎలా ఉందో చూసేవాడిని. తనని మంచి క్రీడాకారిణిగా చూడాలనుకున్నాను. ఇంకెన్నో విజయాలు సాధించాలన్నదే మా కల. – గొంగడి రామిరెడ్డి ఇటీవల ముగిసిన దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో తన బ్యాట్‌తో అందరినీ ఆకట్టుకున్న హైదరాబాద్ క్రికెటర్ త్రిష దక్షిణాఫ్రికాలో జనవరి 14 నుంచి 29 వరకు జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత అండర్ –19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. డిసెంబరు 17 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టీ 20 సీరీస్‌లో పాల్గొనే జట్టులో కూడా చోటు దక్కించుకుని తెలంగాణ నుంచి మరో మిథాలీ రాజ్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది త్రిష. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. తండ్రే గురువు వృత్తిరీత్యా ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి నుంచి త్రిష క్రికెట్లో ఓనమాలు దిద్దింది. భద్రాచలంలో తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులో క్రికెట్‌కు పరిచయమైన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు హైదరాబాద్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో ఆమెను చేర్చారు, అక్కడ ఆమె కోచ్‌లందరినీ ఆకట్టుకుంది. సెయింట్ జాన్స్‌లో కోచ్ ఆధ్వర్యంలో తనను తాను మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఆమె తన 12 సంవత్సరాల వయస్సులో సీనియర్స్ రాష్ట్ర జట్టులో చేరింది. మిథాలీకి అభిమానిని.. ‘భారత జట్టులో చోటు దక్కించుకోవడంతో సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా..’ అని ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈ ఓపెనింగ్ బ్యాట్ ఉమెన్, లెగ్ స్పిన్నర్. కిందటి నెలలో విశాఖపట్నంలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో స్థానం దక్కించుకుంది. వెస్టిండీస్, శ్రీలంక, ఇండియా ‘ఎ’ , ఇండియా ‘బి’ జట్లతో కూడిన సిరీస్‌లో ఇండియన్ జెర్సీ ధరించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది అంటోంది త్రిష. ‘‘తొలి మహిళా క్రికెట్ సంచలనం మిథాలీ రాజ్, ఎం.ఎస్ ధోనీకి పెద్ద అభిమానిని. వారి నుంచే ఎంతో నేర్చుకున్నాను. వారి వల్లే నా ఆటను అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటాను. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను... ఒకరోజు మిథాలీని ఓ అబ్బాయి ప్రశ్నిస్తూ గ్రౌండ్లో ఎవరు బౌలింగ్ చేస్తుంటారని అడిగాడట. ఎవరు బౌలింగ్ చేస్తున్నారో తాను ఎప్పుడూ చూడనని, తన వద్దకు వచ్చే బంతిని మాత్రమే చూస్తానని మిథాలీ అతనితో చెప్పారట.. ఈ విషయం ఆమే చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆమెను చూసి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అంటున్న త్రిష... తన దృష్టి మొత్తం ప్రపంచకప్‌లో రాణించడంపైనే ఉందని తెలిపింది. తన విజయంపై ఆమె దృష్టి మాత్రమే కాదు తెలుగు మహిళల అందరి దృష్టీ ఉందని చెబుతూ బెస్టాఫ్ లక్. – నిర్మలారెడ్డి ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలవాలి... టీ 20 వరల్డ్ కప్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులు ఎప్పుడూ ప్రాక్టీస్‌లోనూ, మ్యాచ్ పెర్ఫార్మెన్స్లోనూ కాంప్రమైజ్ కాకూడదు. మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనేది నా నమ్మకం. ఆడేటప్పుడు మ్యాచ్‌ని ఎంజాయ్ చేయాలి. ప్రెషర్ తీసుకోకూడదు. ప్రతి రోజూ మన బెస్ట్ కాకపోవచ్చు. కానీ మనం అంకితభావంతో ఆడడమే మనవంతు. ఫాస్ట్ బౌలర్‌గా... ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలవడం నా లక్ష్యం. – షబ్నమ్, క్రికెట్ క్రీడాకారిణి 2016లో ఎనిమిదేళ్ల వయసులో క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన షబ్నమ్ 2019లో స్టేట్‌ని రిప్రజెంట్ చేసింది. చాలెంజర్స్ ట్రోఫీ, జడ్సీఏ, ఎన్సీఏ హై పెర్ఫార్మెన్స్ క్యాంప్, రంజీట్రోఫీలో ఒక మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్న షబ్నమ్‌కి బౌలింగ్ ఇష్టం. న్యూజిలాండ్ సీరీస్‌లో మూడు వికెట్లు తీసుకుంది. ఆమె110– 115 స్పీడ్‌తో బౌలింగ్ చేస్తుంది, బౌలింగ్‌కి 20 మీటర్స్ నుంచి రన్ అప్ తీసుకుంటుంది. క్వాడ్రాంగులర్ సీరీస్‌లో శ్రీలంక, వెస్ట్ ఇండీస్ దేశాలతో ఆడిన షబ్నమ్ నిన్నటి వరకు (డిసెంబర్ 6) టీ20 సీరీస్‌లో న్యూజిలాండ్‌తో ఆడింది. వరల్డ్ కప్‌కి ఎంపిక అయిన సందర్భంగా ఆమె ముంబయి నుంచి సాక్షితో తన సంతోషాన్ని పంచుకుంది. ప్రాక్టీస్ మానదు షబ్నమ్ క్రికెట్ జర్నీ గురించి ఆమె తల్లి ఈశ్వరమ్మ మాట్లాడుతూ ‘‘మా పెద్దమ్మాయి. తను రోజూ ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రాక్టీస్ చేస్తుంది. క్రికెట్ ప్రాక్టీస్ కాక ఫిట్నెస్ కోసం మరో గంట వర్కవుట్ చేస్తుంది. ఏడాదిలో 365 రోజులూ ఇదే తన డైలీ రొటీన్. ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ ఆపదు. వైజాగ్, ఎన్ఏడీ అకాడమీలో మొదలైన ప్రాక్టీస్ వీడీసీఏ, ఏసీఏలో కొనసాగుతోంది. తనిప్పుడు టెన్త్ క్లాస్. షబ్నమ్ కోసం స్కూల్ వాళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ సహకరిస్తున్నారు. అండర్ 19, టీ 20 వరల్డ్ కప్‌కు ఆడే అవకాశం రావడం కీలకమైన సోపానం. సీనియర్ కేటగిరీలో మనదేశం తరఫున ఆడడం తన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరడానికి మధ్య ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఇక నుంచి ఇంకా దీక్షగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తనకు ఫాస్ట్ బౌలింగ్ ఇష్టం. నేను ఎంపైర్ని పిల్లలు ఏదైనా సాధించాలంటే పేరెంట్స్ సహకారం చాలా అవసరం. మేమిద్దరం డిఫెన్స్ ఉద్యోగులమే. ఆయన లీడింగ్ ఫైర్‌మ్యాన్, నేను ఆఫీస్ క్లర్క్‌ని. మా వారికి క్రికెట్ చాలా ఇష్టం. అప్పట్లో తనకు అంత సహకారం, ప్రోత్సాహం లేకపోవడంతో విశాఖపట్నానికే పరిమితమయ్యారు. పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలనే కోరిక మా వారిదే. చిన్నమ్మాయి షాజహానాబేగం కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ముగ్గురూ ప్రాక్టీస్ చేస్తుంటే ఎంపైర్‌గా వ్యవహరిస్తూ ఆటను ఎంజాయ్ చేయడం నా వంతు. మాకు వేడుకైనా, పిక్నిక్ అయినా క్రికెటే. బంధువుల ఇళ్లలో వేడుకలకు వెళ్లే అవకాశం ఉండదు. షబ్నమ్ ఎక్కడ ఆడుతుంటే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లిపోతాం. మాకదే పిక్నిక్’’ అన్నారు షబ్నమ్ తల్లి ఈశ్వరమ్మ. – వాకా మంజులారెడ్డి -
తెలుగమ్మాయిలే హీరోయిన్లు కావాలి: బ్రహ్మానందం
విజయవాడ (మొగల్రాజపురం): తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లే ఉండాలని హాస్యనటుడు బ్రహ్మానందం ఆశాభావం వ్యక్తంచేశారు. ఫ్యాషన్ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. మరో హాస్యనటుడు ఆలీ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానిలోని యువత ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు. సాయి క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ ఎండీ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత జాతీయస్థాయిలో రాణించేలా తయారుచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. హాస్యనటులు చలాకీ చంటి, గాలిపటాల సుధాకర్, భాస్కర్ చేసిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. గాయకులు దీపు, పరిణిక, దినకర్ తమ గానామృతంతో ఆకట్టుకున్నారు. -
16 అణాల...
-
టాలీవుడ్ లో మళ్లీ తెలుగమ్మాయిల జోష్