Telugu language preservation
-
'తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయండి'
తమిళనాడు : తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు భాషను అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన లోకేశ్‌కు ఓ వినతి పత్రం సమర్పించారు. ప్రపంచంలో తెలుగు భాష పరిరక్షణ, తెలుగు వారి పరిరక్షణ కాపాడేందుకు ఒక వేదిక ఏర్పాటుచేయాలన్నారు. నీటి సమస్యల లాగనే భాషా సమస్యలు కూడా వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మాతృభాషలలో ప్రాథమిక విద్యాబోధనకు పార్లమెంట్లో బిల్లు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భంధ భాష చట్టం విధంగా కాకుండా విద్యార్థులందరికీ వారి మాతృభాషల్లో విద్యాబోధన జరపాలన్నారు. తెలుగులోనే వ్యాపార సంస్థల బోర్డులు ఉండాలన్న నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టంగా అమలుచేయాలని చెప్పారు. తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలలో తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న తెలుగు విలేకరులకు రాయితీలు ఇప్పించాలన్నారు. తమిళనాడులో ఆంధ్ర సాంస్కృతిక భవనాన్ని నిర్మించేందుకు కృషి చేయలని లోకేశ్‌ను జగదీశ్వరరెడ్డి కోరారు. -
‘తెలుగు’ కోసం హోమం
తెలుగు భాషా పరిరక్షణ కోసం దర్శక-నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హోమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఆయన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ హోమం చేశారు. ప్రపంచంలోని తెలుగువారందరూ మాతృభాషపై ప్రేమ పెంపొందించు కోవాలని, తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2006 నిర్బంధ భాషా చట్టం రద్దు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ హోమంతో అయినా పాలకుల్లో మార్పు రావాలన్నారు. త్వరలో ఈ ఆలయ ప్రాంగణంలో తెలుగుతల్లి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలిపారు. -
హోదాపై విశ్రమించేది లేదు
సీఎం చంద్రబాబు సాక్షి, రాజమండ్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు విశ్రమించేది లేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రానికి అనుకున్నది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్, తనికెళ్ల భరణి, ఎంఎం శ్రీలేఖ, అనంతశ్రీరాం, పరుచూరి గోపాలకృష్ణ, నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు, సాహితీవేత్త కాళీపట్నం రామారావు, జానపద సాహిత్యం తరఫున వంగపండు ప్రసాదరావు తదితరులను సీఎం సత్కరించారు. గోదావరిపై రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి మొసలికన్నీళ్లు కారుస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు కృషి తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘తెలుగువారి చరిత్ర-సంస్కృతి’ అనే అంశంపై శుక్రవారమిక్కడి ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన చర్చాగోష్టిలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజమౌళికి ప్రశంసలు: బాహుబలి సినిమా బాగుందని, దీని దర్శకుడు రాజమౌళి తెలుగువాడు కావడం రాష్ట్రం అదృష్టమని సీఎం ప్రశంసలు కురిపించారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితోపాటు, తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్న పలువురిని సత్కరించారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షత వహించారు. -
సిలబస్ మార్పు పూర్తి
పింప్రి, న్యూస్‌లైన్: రాబోయే విద్యాసంవత్సరం కోసం 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చే ప్రక్రియ పుణేలో శనివారం పూర్తి అయ్యింది. ఈ పాఠ్య పుస్తకాలను ప్రచురించే బాలభారతి పాఠ్య పుస్తకాల సమీక్ష సమావేశం శివాజీ హాలులో మూడురోజుల పాటు జరిగింది. ‘జాతీయ విద్యా విధానము (2005)’, ‘బాలల ఉచిత నిర్బంధ విద్యా చట్టం (2009)’ ను అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం 2012 పాఠ్య ప్రణాళికను తయారుచేసింది. ఈ సమీక్ష సమావేశానికి మహారాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు ఉపాధ్యాయులు హాజరయ్యారు. 3వ తరగతి పాఠ్య పుస్తకాన్ని సమీక్షించారు. తర్వాత సలహాలు, సూచనలు అందజేశారు. వీరందరూ ఇచ్చిన సలహాలతో పాఠ్యపుస్తకా న్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ‘తెలుగు భాషా సమితి’ అధ్యక్షుడు భమిడిపాటి శారద హామీ ఇచ్చారు. తర్వాత 3వ తరగతి విద్యా ప్రణాళికను వివరించారు. విద్యా ప్రణాళిక ఆధారంగా తయారుచేసిన తెలుగు పాఠ్య పుస్తకాలను సభకు తెలుగు భాషాసమితి సభ్యురాలు అనూరాధ పరిచయం చేశారు. పాఠ్య పుస్తకంలోని పాఠాలను సుశీల, విద్యా బెనర్జీ వివరించారు. తెలుగు భాషా సమితి సభ్యులు భూమనపల్లి విజయభాస్కర్‌రెడ్డి ఇతర విషయాలను సూచించా రు. అంతేకాకుండా ప్రస్తుత పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, పాఠశాలల పిల్లల నుంచే దీనిని ప్రారంభించాలని సమావేశంలో పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ బూనారు. తర్వాత పర్యావరణ సందేశాలతో కూడిన గుడ్డ సంచులను కార్యక్రమానికి హాజరైన సుమారు 50 మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి తెలుగు విశేషాధికారిణి తులసీ భారత్ అందజేశారు. కాగా, ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర పాఠ్య పుస్తక సంస్థ డెరైక్టర్ చంద్ర మణిబోర్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమాని భాగవతుల ఉమామహేశ్వర శర్మ జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశం ప్రారంభించారు. మొదట గత నెలలో మృతి చెందిన ప్రముఖ తెలుగు కవి, బాలసాహిత్య వేత్త రచయిత గిడుగు రామ్మూర్తి పంతులు మనుమడు గిడుగు రాజేశ్వరరావుకు శ్రద్ధాంజలి ఘటించి సంతాపం తెలిపారు. -
సిలబస్ మార్పు పూర్తి
పింప్రి, న్యూస్‌లైన్: రాబోయే విద్యాసంవత్సరం కోసం 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చే ప్రక్రియ పుణేలో శనివారం పూర్తి అయ్యింది. ఈ పాఠ్య పుస్తకాలను ప్రచురించే బాలభారతి పాఠ్య పుస్తకాల సమీక్ష సమావేశం శివాజీ హాలులో మూడురోజుల పాటు జరిగింది. ‘జాతీయ విద్యా విధానము (2005)’, ‘బాలల ఉచిత నిర్బంధ విద్యా చట్టం (2009)’ ను అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం 2012 పాఠ్య ప్రణాళికను తయారుచేసింది. ఈ సమీక్ష సమావేశానికి మహారాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు ఉపాధ్యాయులు హాజరయ్యారు. 3వ తరగతి పాఠ్య పుస్తకాన్ని సమీక్షించారు. తర్వాత సలహాలు, సూచనలు అందజేశారు. వీరందరూ ఇచ్చిన సలహాలతో పాఠ్యపుస్తకా న్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ‘తెలుగు భాషా సమితి’ అధ్యక్షుడు భమిడిపాటి శారద హామీ ఇచ్చారు. తర్వాత 3వ తరగతి విద్యా ప్రణాళికను వివరించారు. విద్యా ప్రణాళిక ఆధారంగా తయారుచేసిన తెలుగు పాఠ్య పుస్తకాలను సభకు తెలుగు భాషాసమితి సభ్యురాలు అనూరాధ పరిచయం చేశారు. పాఠ్య పుస్తకంలోని పాఠాలను సుశీల, విద్యా బెనర్జీ వివరించారు. తెలుగు భాషా సమితి సభ్యులు భూమనపల్లి విజయభాస్కర్‌రెడ్డి ఇతర విషయాలను సూచించా రు. అంతేకాకుండా ప్రస్తుత పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, పాఠశాలల పిల్లల నుంచే దీనిని ప్రారంభించాలని సమావేశంలో పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ బూనారు. తర్వాత పర్యావరణ సందేశాలతో కూడిన గుడ్డ సంచులను కార్యక్రమానికి హాజరైన సుమారు 50 మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి తెలుగు విశేషాధికారిణి తులసీ భారత్ అందజేశారు. కాగా, ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర పాఠ్య పుస్తక సంస్థ డెరైక్టర్ చంద్ర మణిబోర్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమాని భాగవతుల ఉమామహేశ్వర శర్మ జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశం ప్రారంభించారు. మొదట గత నెలలో మృతి చెందిన ప్రముఖ తెలుగు కవి, బాలసాహిత్య వేత్త రచయిత గిడుగు రామ్మూర్తి పంతులు మనుమడు గిడుగు రాజేశ్వరరావుకు శ్రద్ధాంజలి ఘటించి సంతాపం తెలిపారు.