Telugu novelist
-
Ravuri Bharadwaja: సమాజాన్ని చదివిన రచయిత
రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలన చిత్ర పరిశ్రమను వస్తువుగా చేసు కొని వెలువడిన పాకుడురాళ్లు నవల. 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవ లలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మ కథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథా నికలు రచించారు. జీవన సమరం మరో ప్రముఖ రచన. ఒక బీద కుటుంబంలో జన్మిం చిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయి వరకే చదువుకు న్నారు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన ప్పుడు వ్యవ సాయ కూలీల కఠిన మైన జీవన పరిస్థితులను గమనించే వాడు. అప్పటి పల్లె ప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచ నలు, కోపాలు, తాపాలను తర్వాతి కాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించ డానికి ఉపయోగించు కున్నాడు. నేల విడిచి సాము చేయ కుండా, వాస్తవిక జీవితాల ఆధా రంగా రచనలు చేయటం ద్వారా పాఠకులకు స్ఫూర్తిని కలిగించే రచ నలు ఉత్తమమైనవని ఆయన భావించారు నిజాన్ని నిజంగా నిజాయితీగా చెబుతున్నప్పుడు ఏ రచనకైనా పేరు వస్తుందని నమ్మి ఇతరులకు చెప్పారు. నేటి ధన స్వామ్య వ్యవస్థ యొక్క క్షీణ సాంస్కృతిక విలువల ప్రతిబింబౖ మెన సినీ వ్యవస్థలోని బీభత్సాన్ని పాకుడు రాళ్ళు నవలలో బట్ట బయలు చేశారు. తద్వారా మొత్తంగా నేటి సామాజిక వ్యవ స్థపై ఆయనకు గల ఏవగింపును వ్యక్తీకరించారు. వీరి సాహిత్య జీవితం నుండి నేటి తరం రచ యితలు నేర్చు కోవల సినవి చాలా ఉన్నాయి. పట్టుదలతో, స్వయం కృషితో, విస్తృత అధ్యయ నంతో బడి చదువుల జ్ఞానం కంటే చాలా ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించ వచ్చు అని రావూరి రుజువు పరి చారు. 1927 జూలై 5న జన్మించిన వీరు 2013 అక్టోబర్ 18న గతిం చారు. భారతీయ జ్ఞాన పీఠం తన 48వ పురస్కారాన్ని రావూరి భర ద్వాజకు ఇవ్వటం ఆనంద దాయకం. – డా. జొన్నకూటి ప్రమోద్ కుమార్ పైడిమెట్ట, 94908 33108 (నేడు రావూరి భరద్వాజ జయంతి) -
ఇంటర్వ్యూలో తొందరపడితే కష్టమే..
వ్యక్తిత్వవికాస నిపుణుడు యండమూరి విజయవాడ : ఇంటర్వ్యూల్లో తొందరపడితే నష్టమేనని, ఆలోచించి సరైన సమాధానాన్ని స్పష్టంగా చెప్పాలని నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ యువజనోత్సవాల్లో భాగంగా ఇంఫాక్ట్ పేరుతో మొగల్రాజపురం పి.బి.సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడం ఎలా అనే అంశంపై వారికి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపైన కనీస జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషిలోని భయం అనే శత్రువును పారదోలాలని, అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలమనే ధైర్యం వస్తోందన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు, టీవీ సీరియల్ నటుడు ప్రదీప్ మాట్లాడుతూ మనం కన్న కలలను నిజం చేసుకోవాలంటే పొలంలో విత్తనాలు చల్లి సాగు చేసిన విధంగా కష్టపడాలని సూచించారు. మానసిక వైద్య నిపుణడు గంపా నాగేశ్వరరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు జయసింహ, వేణుగోపాల్, విశ్వనాథం, రత్నాకర్ మాట్లాడారు. డెరైక్టర్ పార్థసారథి, శివశంకర్ పాల్గొన్నారు. -
నవలా శకం ముగిసినట్టే: యండమూరి
రాజమహేంద్రవరం: ‘నవలలు చదివే పాఠకులు తగ్గిపోతున్నారు. ఇక నవలా శకం ముగిసినట్టే’నని ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సోమవారం సంహిత కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ప్రస్తుత సాహిత్యం తీరుతెన్నులపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... కల్చరల్ నా ‘తులసిదళం, కాష్మోరా’, వడ్డెర చండీదాస్ ‘హిమజ్వాల,అనుక్షణికం’, అంతకు ముందు యద్దనపూడి సులోచనారాణి ‘సెక్రటరీ’, ముప్పాళ రంగనాయకమ్మ ‘బలిపీఠం’ మొదలైన నవలలు పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నది నిజమే. అయితే ప్రస్తుతం పాఠకులకు కొరత వచ్చింది. చదివే వాళ్ళు తక్కువయిపోతున్నారు. ఇప్పటి వరకూ సుమారు70 రచనలు చేశాను. చేస్తూనే ఉన్నాను. సామాజిక స్పృహ కాదు.. అలరించే గుణమే ముఖ్యం.. నా నవలల్లో సామాజిక స్పృహ లేదన్న విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదు. చందమామ కథల్లో ఏమంత సామాజిక స్పృహ ఉంది? నవరసాల్లో భయానక రసం ఒకటి. నా రచనలలో ఆ రసం లేకపోలేదు. ప్రాథమికంగా రచనలకు పాఠకులను అలరించే గుణం ఉండాలి. అభిమాన రచయితలు చాలామంది ఉన్నారు. యద్దనపూడి సులోచనారాణి, మల్లాది కృష్ణమూర్తి, కొమ్మూరి వేణుగోపాలరావు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ వగైరా.. సినిమాకు వినోదమే ప్రధానం సినిమాలు కూడా వినోదప్రధానంగా ఉండాలని నేను భావిస్తాను. ఇతర సినిమాలతో పాటు చిరంజీవి నటించిన సినిమాలకు కొన్నింటికి రచనలు చేశాను. రాజకీయాలపై ఆసక్తి లేదు. కాకినాడలో సరస్వతీ విద్యాపీఠం స్ధాపించి,యువతలో మానసిక వికాసానికి కృషి చేస్తున్నాను. మానసిక వికాసంపై పుస్తకాలు రాశాను. విద్యాసంస్థల ఆహ్వానం మేరకు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొదించడానికి ప్రసంగాలు చేస్తున్నాను. -
కేశవరెడ్డికి కన్నీటి వీడ్కోలు
డిచ్పల్లి/నిజామాబాద్: ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి అంత్యక్రియలు శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో జరిగాయి. ఈ ఆస్పత్రిలో డాక్టర్ కేశవరెడ్డి సుమారు 30 ఏళ్లపాటు కుష్టు వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించారు. తన భౌతికదేహాన్ని ఇక్కడే ఖననం చేయాలన్న ఆయన కోరిక మేరకు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలోని సీఎంసీ చర్చి ప్రాంగణంలో కేశవరెడ్డి పార్థివదేహాన్ని సందర్శనార్ధం ఉంచారు. రెవరెండ్ ఎం.చరణ్ నేతృత్వంలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ భౌతికదేహాన్ని సమాధుల స్థలం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఖననం చేశారు. కేశవరెడ్డి అంత్యక్రియలకు ప్రజాకవి, గాయకుడు గోరేటి వెంకన్న, నాళేశ్వర శంకర్, బైస రామదాసు, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్, సైదాచారి, ఉష, అరవి, ఎనిశెట్టి శంకర్, సూర్యప్రకాశ్, చందన్రావు, మేక రామస్వామి, సిద్దార్థ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆశ నారాయణ, మానవ హక్కుల సంఘం సభ్యుడు గొర్రెపాటి మాధవరావు, న్యాయవాదులు, పలువురు జర్నలిస్టులు పాల్గొని కేవశరెడ్డి భౌతికదేహం వద్ద నివాళులు అర్పించారు. డాక్టర్ కేశవరెడ్డితో తన అను బంధాన్ని గుర్తు చేసుకుంటూ గోరెటి వెంకన్న ‘బతుకు మర్మమెరిగిన నవలా శిల్పి, మర్మయోగి గొంతు మూగబోయేనా’ అంటూ పాడిన పాట అంద రి హృదయాలను బరువెక్కించింది. -
కేశవరెడ్డికి ఘన నివాళి
డిచ్పల్లి: ప్రముఖ తెలుగు నవలా రచయిత, వైద్యుడు కేశవరెడ్డికి సాహితీ ప్రియులు శనివారం ఘనంగా నివాళి అర్పించారు.ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. అంత్యక్రియలకు ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, కాలేశ్వరం శంకర్, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్‌తో పాటు జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, సాహితీ ప్రియులు హాజరై కేశవరెడ్డికి ఘనంగా నివాళి అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నర్సింగ్‌హోమ్‌లో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.‘‘అతడు అడవిని జయిం చాడు, మూగవాని పిల్లనగ్రోవి, సిటీ బ్యూటిపుల్, మునెమ్మ, శ్మశానాన్ని దున్నేరు, చివరి గుడిసె, రాముడుం డాడు-రాజ్జిముండాది..’’ వంటి నవలలు రాసి జాతీయస్థాయిలో పేరొందారు. -
నవలా రచయిత కేశవరెడ్డి కన్నుమూత
- ‘లింగ్‌ఫోమా’ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో మృతి - నిజామాబాద్‌లో నేడు అంత్యక్రియలు - నిజామాబాద్ జిల్లాలో 30 ఏళ్లపాటు కుష్టురోగులకు సేవలు - రచయితగా జాతీయస్థాయి ఖ్యాతి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రముఖ నవలా రచయిత, వైద్యుడు డాక్టర్ పి.కేశవరెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిజామాబాద్‌లోని ప్రగతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘‘అతడు అడవిని జయిం చాడు, మూగవాని పిల్లనగ్రోవి, సిటీ బ్యూటిపుల్, మునెమ్మ, శ్మశానాన్ని దున్నేరు, చివరి గుడిసె, రాముడుం డాడు-రాజ్జిముండాది..’’ వంటి నవలలు రాసి జాతీయస్థాయిలో పేరొం దిన డాక్టర్ కేశవరెడ్డి (69) మరణం సాహితీలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు భార్య ధీరమతి, కుమారుడు డాక్టర్ నందన్‌రెడ్డి, కుమార్తె డాక్టర్ దివ్య ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తలపులపల్లికి చెందిన ఆయన 30 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా వైద్యుడైన కేశవరెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో సేవలందించారు. డిచ్పల్లి మండలం విక్టోరియా ఆస్పత్రిలో వైద్యాధికారిగా పదవీ విమరణ చేశారు. నిజామాబాద్, ఆర్మూరుల లో ప్రజావైద్యశాలలు నిర్వహిస్తూనే సాహితీవేత్తగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నవలలు రాశారు. ఆయన రచనలపై విద్యార్థులు పరిశోధనలు చేసి పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాలు సమర్పించారు. నేడు అంత్యక్రియలు శనివారం నిజామాబాద్‌లో డాక్టర్ కేశవరెడ్డికి అంత్యక్రియలు నిర్వహిం చనున్నారు. ఐదు మాసాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరకు లింగ్‌ఫోమా క్యాన్సర్ వ్యాధిగా వైద్యులు నిర్ధారిం చడంతో ఆయనకు కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌లోని కిమ్స్, నిజామాబాద్‌లోని విజన్, ఎస్ఎస్కే హార్ట్ ఆస్పత్రులలో చికిత్స చేయిం చారు. శుక్రవారం తెల్లవారు జామున పరి స్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నర్సింగ్‌హోమ్‌కు తరలించగా ఉదయం 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేశవరెడ్డి చర్మవ్యాధుల నిపుణుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. చిత్తూరు జిల్లాలో జననం ఏపీలోని చిత్తూరు జిల్లా తలుపులపల్లిలో 1946 మార్చి 10న జన్మించిన కేశవరెడ్డి తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్. చేశా రు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో గల విక్టోరియా మెమోరియల్ ఆస్పత్రిలో 3 దశాబ్దాలపాటు కుష్టు రోగులకు సేవలందించి ఉద్యో గ విరమణ పొందారు. విక్టోరియా ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తూనే వారంలో రెండు రోజులు ఆర్మూర్‌లో కూడా కుష్టురోగులకు ఉచితంగా వైద్య సేవలందించారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘అతడు అడవిని జయించాడు’ నవలను నేషనల్ బుక్‌ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇన్ క్రెడిబుల్ గాడెస్ నవలను మరాఠీ, కన్నడ భాషల్లోకి అనువదించారు. అంతర్జాతీయ తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ అజో-విభో ఫౌండేషన్ నుంచి ఆయన ఉత్తమ నవలా రచయిత పురస్కారం అందుకున్నారు. సమాజంలో పాతుకుపోయిన పేదరికం, మూఢనమ్మకాలు.. సామాజిక రుగ్మతులను నిర్మూలించేందుకు... పలు కథాంశాలు ఎంచుకుని... ప్రజలను చైతన్యపరిచేలా పలు నవలలు రచించారు. మూగవాని పిల్లన గ్రోవి (1996), చివరి గుడిసె (1996) అతడు అడివిని జయించాడు (1980), ఇన్ క్రెడిబుల్ గాడెస్ (క్షుద్ర దేవత) (1979), శ్మశానం దున్నేరు (1979), సిటీ బ్యూటిఫూల్ (1982), మునెమ్మ (2008) తదితర రచనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపీ కవిత సంతాపం ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేశవరెడ్డి మృతిపట్ల నిజామాబాద్ ఎంపీ కవిత సంతాపం తెలిపారు. డాక్టర్ కేశవరెడ్డి డిచ్‌పల్లిలో కుష్టురోగులకు అందించిన సేవలు మరువలేనివని కవిత పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.