కేశవరెడ్డికి ఘన నివాళి
డిచ్‌పల్లి: ప్రముఖ తెలుగు నవలా రచయిత, వైద్యుడు కేశవరెడ్డికి సాహితీ ప్రియులు శనివారం ఘనంగా నివాళి అర్పించారు.ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. అంత్యక్రియలకు ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, కాలేశ్వరం శంకర్, ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్‌తో పాటు జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, సాహితీ ప్రియులు హాజరై కేశవరెడ్డికి ఘనంగా నివాళి అర్పించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నర్సింగ్‌హోమ్‌లో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.‘‘అతడు అడవిని జయిం చాడు, మూగవాని పిల్లనగ్రోవి, సిటీ బ్యూటిపుల్, మునెమ్మ, శ్మశానాన్ని దున్నేరు, చివరి గుడిసె, రాముడుం డాడు-రాజ్జిముండాది..’’ వంటి నవలలు రాసి జాతీయస్థాయిలో పేరొందారు.