temperature rising
-
మండే కాలం
సీతంపేట: ఎండలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో రోజువారీ నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో భారీగా తేడా కనిపిస్తోంది. సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాణపాయం లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఎండల్లో తిరిగితే సన్(హీట్) స్ట్రోక్ (వడదెబ్బ), హీట్ సింకోప్(తల తిరగడం), హీట్ ఎక్సాషన్( అలసట), హీట్ క్రాంప్స్(కండరాలు, పిక్కలు లాగడం)తో పాటు పలు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ ప్రమాదకరం.. ప్రజలు వేసవిలో ఎక్కువగా వడదెబ్బ బారిన పడతా రు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగి, తగినంత లవణాలున్న నీరు తీసుకోకపోతే అపస్మారక స్థితికి చేరుతారు. తీవ్ర జ్వరం, మూత్రం రాకపోవ డం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లు తొలుత గుర్తించాలి. కొందరిలో ఫిట్స్ లక్షణాలు కూడా కనిపిస్తుండడం గమనార్హం. పార్కిన్సన్(తల ఊపడం) వ్యాధికి సంబంధించి మందులు వాడే వా రు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. బయట ఆహారం తీసుకోవడం ద్వారా డయేరియా సోకే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. శరీరమంతా యాసిడ్ ఏర్పడి అవయవాలపై ప్రభా వం చూపుతాయి. అధిక వేడిమితో చమట కాయలు రావడం, గడ్డలు కట్టడం, సన్‌బర్న్ (చర్మం కమిలిపోవడం) వంటి సమస్యలు వస్తాయి. శరీరంపై దద్దుర్లు సైతం ఏర్పడతాయి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి.. ఎండ కారణంగా స్పృహ కోల్పోయి పడిపోయిన వ్యక్తులకు చల్లటి గాలి తగిలేలా ఫ్యాన్ లేక కూలర్ ముందు సేదతీరేలా చేయాలి. తడిగుడ్డతో శరీరం తుడవాలి. తర్వాత దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఐవీ ప్లూయిడ్స్ ఇవ్వడంతో పాటు ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. దీని ద్వారా మనిషి ప్రాణాపా య స్థితి నుంచి గట్టెక్కుతాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ♦సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ♦ఎటువంటి కార్యక్రమాలనైనా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో చేసుకోవాలి. ♦కాటన్, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ♦జీన్స్, బ్లాక్ షర్టులు వేసుకోకపోవడం మంచిది. ♦బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగును వెంట తీసుకెళ్లాలి. ♦శరీరానికి ఎండ తగలకుండా దుస్తులు ధరించాలి. ♦సన్‌స్క్రీన్ లోషన్లు వాడడం మంచిది. ♦తరచుగా నీరు, లవణాలు తీసుకోవాలి. ♦నీటితో పాటు కొబ్బరి బొండాలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. ♦కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ♦రోడ్లపై విక్రయించే, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. ♦ఆయిల్ ఫుడ్, టీ, కాఫీ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. అప్రమత్తంగా ఉండాలి.. వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో తిరగకూడ దు. ఎండలోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి. వాటర్ బాటిల్ వెంట తీసుకువెళ్లాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించడం చాలా మంచిది. –బి. శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, సీతంపేట, ఐటీడీఏ -
ఎండ వేళ జర భద్రం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సిటీజనులు అల్లాడుతున్నారు. ఎండలో బయటకు వెళ్లిన వారికి వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంది. కొందరికి జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థత కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో మనిషి శరీరం భరించలేని స్థాయిలో ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఈ ఉష్ణోగ్రతలకు రేడియేషన్ తోడవుతుండంతో శరీరంలో పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోయి త్వరగా వడదెబ్బకు గురవుతుండటమే కాకుండా చర్మం నల్లగా వాడిపోతోంది. చర్మంపై చెమట పొక్కులు ఏర్పడుతున్నాయి. రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద కూర్చునప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఇదిలా ఉంటే వడదెబ్బ బారినపడి సిటీలో రోజుకు సగటున ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు. కానీ ఇది అటు జీహెచ్ఎంసీలో గానీ, కలెక్టరేట్లో గానీ రికార్డు కావడం లేదు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయం 9 గంటల తర్వాత అవసరమైతే తప్పా..ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే విధిగా గొడుగు, మంచినీళ్లు తీసుకెళ్లాలని చెబుతున్నారు. మండే ఎండల నేపథ్యంలో వైద్యుల సూచనలు కొన్ని.... పిల్లలకు మరింత ప్రమాదం చిన్నారుల శరీరంలో 50 శాతం నీరే ఉంటుంది. ఎండ దెబ్బకు నీటి శాతం తగ్గడం వల్ల చిన్నారులకు వడదెబ్బకు గురవుతారు. తద్వారా తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. వేసవి సెలవుల కారణంగా ఆటపాటలు ఎక్కువవడం సహజం. దీనికి ఎండ తోడవడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు. నీటి పరిమాణం ఎక్కువుండే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటివి అందించాలి. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండేలా చూడాలి. బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఆహారంగా ఆమ్లెట్కు బదులు ఉడకబెట్టిన గుడ్డు, కోల్డ్ మిల్క్ వంటివి అందించాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్య నిపుణుడు చెమట పొక్కులకు ఇలా చెక్ చెమటపొక్కుల్ని గోళ్లతో గిల్లడం వంటివి చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎండలకు సెగగడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ. యాంటీ బ్యాక్టీరియల్ సోప్‌తో వీటిని శుభ్రం చేసుకోవాలి. గాఢమైన రంగులున్న దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. పట్టినట్టుండే దుస్తులు కాకుండా వదులైన పలుచని దుస్తువులు వేసుకోవాలి. బయటికి వెళ్లేప్పుడు తలకు క్యాప్ అలవాటు చేసుకోవాలి. సాయంత్రం వేళలో చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇంటి తలుపులు, కిటికీలకు గోనె సంచులను అమర్చి, వాటిని నీటితో తడపాలి. టూ వీలర్‌పై ప్రయాణిస్తే ముఖానికి రుమాలు చుట్టుకోవడం ఉత్తమం. – డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ ఐదు నుంచిఏడు లీటర్ల నీరు తాగాలి వేసవిలో రోజుకు కనీసం ఐదు నుంచి ఏడు లీటర్ల నీరు తాగాలి. పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోవడంతో వడదెబ్బకు గురవుతారు. మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంటతో పాటు తీవ్ర జ్వరం వస్తుంది. వేడికి తట్టుకోలేక తాగే కూల్‌డ్రింక్స్ ఆరోగ్యాన్ని హరిస్తాయి. వీటిలోని ఫాస్పేట్ పదార్థంతో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలున్నంత వరకూ వీటికి దూరంగా ఉండడమే మేలు. దాహం వేయకపోయినా నీళ్లు కొంచెం కొంచెం తాగడం వల్ల డీహైడ్రేషన్ భారీ నుంచి కాపాడుకోవచ్చు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పుదీనారసం, మజ్జిగ, పుచ్చకాయ రసం వంటివి మంచినీళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తాయి. ఇక మామిడి, సపోటా, బత్తాయి వంటి పండ్లు పోషకాలపరంగా ఉత్తమమైనవి. – డాక్టర్ స్వప్నప్రియ మసాల ఫుడ్డు వద్దే వద్దు స్థూలకాయులు బరువు తగ్గించుకోవడం కోసం భోజనం మానేస్తుంటారు. తద్వారా జీవక్రియలు మందగిస్తాయి. తక్కువ పరిమాణంలో తేలికగా జీర్ణమయ్యే...ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారం తీసుకోవాలి. రోడ్ల వెంట దొరికే ఐస్‌లు, ఫ్రిజ్ వాటర్ తాగొద్దు. రోడ్ల వెంట దొరికే నిల్వ ఫ్రూట్ సలాడ్స్ వంటివి కూడా హానికరం. పాలు, పాల పదార్థాలతో తయారు చేసిన లస్సీలు కాకుండా ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ద్రవపదార్థాలు అధికంగా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష, మామిడి పండ్లు, ముంజలు వంటివి తీసుకోవాలి. రోడ్లు వెంట ఐస్‌తో తయారు చేసిన రంగు నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లు తాగాలి. మసాలాలు ఉన్న ఆహారం వద్దు. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన వ్యక్తులను కూర్చో బెట్టకూడదు. నీడకు తరలించి ఏదైనా నునుపైన బల్లపై కానీ మంచంపై కానీ పడుకోబెట్టాలి. నూలుతో తయారు చేసిన తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. స్పహలోకి వచ్చిన తర్వాత చల్లటి మంచి నీరు, సోడా, కోబ్బరి నీళ్లు, మజ్జిగ తాగించాలి. – డాక్టర్ సందీప్గంటా, జనరల్ ఫిజీషియన్ -
నిప్పుల వాన..!
కడప రూరల్: ఈ ఎండాకాలం చాలా ‘హాట్’గా మారింది. వేసవి సెగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పుడే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటేలా కనిపిస్తోంది. ‘నిప్పుల వాన’ పడుతోందా...? అనేఅ భావన జనంలో కలుగుతోంది. వేడికి మించి ఉక్కపోత ఉండటంతో ఇంట్లో నుంచి బయటపకు అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మ«ధ్యాహ్నం సమయంలో విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రోజూ సగటున 43 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రంలో కడప ఉష్ణోగ్రతలో టాప్‌గా నిలుస్తూ కలవరపరుస్తోంది. రాత్రి వేళ గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో ఉక్కపోత ప్రభావం కనిపిస్తోంది. బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం తదితర నియోజక వర్గ ప్రాంతాల్లో ఈ ప్రభావం మొదటిపేజీ తరువాయిఎక్కువగా కనిపిస్తోంది. నదీ తీరం, కొండలున్న ఏరియాల్లో ‘సెగ’ మరింతగా జనాలకు మంట పెట్టిస్తోంది. వర్షాలు సరిగా పడకపోవడం..çకనుచూపు మేర కరువు ఛాయలు ఏర్పడడం. పచ్చదనం లేకపోవడం తదితర కారణాలతో వేసవి అందరినీ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడే గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. ఈ వేసవిలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు. -
ఈ వేసవిలో భగభగలే!
సాక్షి, హైదరాబాద్ : మండుటెండలు.. వేడిగాలులు ఈ వేసవిలో రాష్ట్ర ప్రజలను ఠారెత్తించనున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలోనే ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో రాబోయే మండు వేసవిని తలచుకుంటే సొమ్మసిల్లే పరిస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావం తటస్థంగా ఉన్నప్పటికీ ఈసారి ఏప్రిల్ మూడో వారం నుంచి మే నెల చివరి వారం వరకు వాయవ్య దిశ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీచే ప్రమాదం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటి వాతావరణ పరిస్థితులు వేసవిలో సర్వసాధారణమేనని.. 2016, 2017 సంవత్సరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఈసారి రాష్ట్రంలో ఏప్రిల్ మూడో వారం నుంచి మే చివరి వరకు పగటి ఉష్ణోగ్రతలు 45–46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రామగుండం, భద్రాచలంతోపాటు మైనింగ్ ఏరియాల్లో పగటి ఉష్ణోగ్రతలు 47–48 డిగ్రీల మేర నమోదవుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోనూ గరిష్టంగా 44–45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈసారి ఎండలు ఎక్కువే.. గతేడాది ఏప్రిల్–మే నెలల్లో దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపుగా తేమగాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ఉధృతి అంతగా లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కేరళ, లక్షద్వీప్ నుంచి వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. కాగా 2016 ఏప్రిల్–మే నెలల్లో సుమారు 27 రోజులపాటు వడగాలులు వీయగా.. 2017లో ఇవే మాసాల్లో 23 రోజులపాటు వడగాలులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. -
మండుతున్న ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. గురువారం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్‌లలో ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. గురువారం వరకు వడదెబ్బతో 25 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. -
‘మాడు’తోంది
వేసవిని తలపిస్తున్న ఎండలు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కానరాని వర్షాలు.. ఎండుతున్న పంటలు ఆందోళనలో అన్నదాతలు.. పంటల రక్షణకు పడరాని పాట్లు మెదక్: ఎండలు మండుతున్నాయి. ఇరవై రోజులుగా వేసవిని తలపిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు జోరుగా కురిసి చెరువులు, కుంటలు నిండాలి. కాని వేసవిని తలపిస్తూ ఎండలు మండుతుండటంతో ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట కంకిదశలో ఉంది. వర్షాలు లేకపోవడంతో పంట పెరుగుదల ఆగిపోయింది. దీంతో ఆ పంట రక్షణకు ఇంటిల్లిపాది నీళ్లుపోసి రక్షించే పనిలో పడ్డారు. రెండేళ్లుగా కరువు, కాటకాలతో విలవిల్లాడిన రైతులు పట్టణాలకు వలసవెళ్లిపోయారు. ఈసారైనా సాగు చేసుకుని జీవనం సాగిద్దామని పల్లెలకు వస్తే.. వారికి ఈసారీ నిరాశే మిగులుతోంది. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, కంది, పెసర్లను అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేశారు. 1.22లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 27 వేల హెక్టార్లలో పెసర, 16 వేల హెక్టార్లలో మినుములు, 40 వేల హెక్టార్లలో కంది పంటలను సాగుచేశారు. అలాగే 82 వేల హెక్టార్లలో వరి సాగుచేయాల్సి ఉండగా, సరైన వర్షాలు లేక 35 వేల హెక్టార్లలోనే సాగుచేశారు. ఈ నెలలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో ఎండలు మాత్రం వేసవిని తలపించేలా దంచి కొడుతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్లో 28 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావొద్దని, అయితే మూడు రోజులుగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో ఎండతీవ్రతకు ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఫ్యాన్లు, కూలర్స్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఎట్లా బతకాలో.. కరువు రక్కసితో రెండేళ్లుగా బతకడం చాలా కష్టమైంది. కనీసం గ్రామాల్లో పనిచెప్పేవారే లేకపోవడంతో ఉప్పిడి ఉపవాసం ఉన్నాం. ఈసారైనా వర్షాలు కురుస్తాయనుకుంటే మళ్లీ కరువే ముంచుకొస్తుంది. ఎట్లా బతకాలో తెలియడం లేదు. ఎకరం పొలంలో రూ.15వేల అప్పుచేసి మొక్కజొన్న వేశాను. వర్షాలు లేక ఎండిపోతోంది. - మార్గం వెంకయ్య, రైతు, రాజ్‌పల్లి అప్పు చేసి మొక్కజొన్న వేసిన ఈయేడు వర్షాలు సరిగా కురవక పోవడంతో 3 ఎకరాలలో రూ.30వేలు అప్పులుచేసి మొక్కజొన్న వేశాను. ప్రస్తుతం పంట కంకిదశలో ఉంది. వర్షాలు కురవక పోవడంతో గింజలు గట్టి పడటం లేదు. పెట్టుబడి కూడా చేతికొచ్చేటట్లు లేదు. బతుకును తలుచుకుంటేనే భయంగా ఉంది. - గురజాల నర్సింలు, రైతు, రాజ్‌పల్లి