tempetature
-
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
ఉదయం ఎనిమిది గంటలకే వేడి గాలులు వణుకు పుటిస్తున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటేనే పెద్ద వాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితి. ఇక పిల్లల్ని బడికి పంపించాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కనౌజ్‌లోని ఒక స్కూలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో స్విమ్మింగ్ పూల్ పిల్లలు సంబరపడిపోతున్న వీడియో వైరల్ గా మారింది.Vaibhav Kumar, Principal says, " As the weather department informed about the heat wave, we were asking students to drink water and cool drinks...we also told them that people in cities bathe in swimming pools. Students asked us what swimming pools look like and when will they… pic.twitter.com/oyFqbpTI5V— ANI (@ANI) May 1, 2024 రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య పిల్లల్ని బడికి రప్పించేందుకు, వారి సౌకర్యార్థం ఒక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎండలు, వడగాల్పుల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రిన్సిపాల్ వైభవ్ కుమార్.క్లాస్ రూంలో, స్మిమ్మింగ ప్రస్తుతం గోధమ పంటపనులు నడుస్తున్నాయి కనుక చాలా కుటుంబాలు విద్యార్థులను పాఠశాలకు పంపడం లేదు. వారిని తిరిగి పిలవడానికి వెళ్ళాము, కానీ సరైన స్పందన లభించలేదు అందుకే ఈ వినూత్న ఆలోచనతో చేశాం. దీంతో హాజరు శాతం పెరిగింది. .. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.#WATCH | Uttar Pradesh: A govt school in Kannauj makes a swimming pool inside the classroom, amid rising temperature. pic.twitter.com/rsXkjDFa7a— ANI (@ANI) May 1, 2024 ఎండలనుంచి ఉపశమనం పొందేలా నీళ్లు, చల్లని పానీయాలకు తాగమని విద్యార్థులకు చెప్పాం. అయితే నగరాల్లో మాదిరిగా తమకు స్విమ్మింగ్ పూల్ కావాలని పిల్లలు అడిగారు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తసీఉకొని క్లాస్రూమ్ లోపల ఈత కొలను ఏర్పాటు చేశమన్నారు అసిస్టెంట్ టీచర్ ఓం తివారీ. -
కొత్తగూడెంలో 50 డిగ్రీలు!
వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 45 మంది మృతి సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగూడెంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంది. దీంతో పట్టణం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక ఇల్లెందులో 49, మణుగూరులో 48.5, సత్తుపల్లిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతుండడంతో గనుల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో 43.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. వడదెబ్బతో నల్లగొండలోనే 15 మంది మృత్యువాత సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో వివిధ జిల్లాల్లో సోమవారం 45 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో 15మంది, కరీంనగర్ జిల్లాలో 11మంది, ఖమ్మం జిల్లాలో 9 మంది, వరంగల్ జిల్లాలో 8 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, మెదక్ జిల్లాలో ఒకరు మరణించారు. ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలివీ.. ప్రాంతం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 43.3 హన్మకొండ 42.6 హైదరాబాద్ 39.2 నల్లగొండ 41.4 నిజామాబాద్ 43.3