వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 45 మంది మృతి
సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగూడెంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంది. దీంతో పట్టణం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక ఇల్లెందులో 49, మణుగూరులో 48.5, సత్తుపల్లిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతుండడంతో గనుల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో 43.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
వడదెబ్బతో నల్లగొండలోనే 15 మంది మృత్యువాత
సాక్షి నెట్‌వర్క్: వడదెబ్బతో వివిధ జిల్లాల్లో సోమవారం 45 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో 15మంది, కరీంనగర్ జిల్లాలో 11మంది, ఖమ్మం జిల్లాలో 9 మంది, వరంగల్ జిల్లాలో 8 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, మెదక్ జిల్లాలో ఒకరు మరణించారు.
ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలివీ..
ప్రాంతం ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ 43.3
హన్మకొండ 42.6
హైదరాబాద్ 39.2
నల్లగొండ 41.4
నిజామాబాద్ 43.3
కొత్తగూడెంలో 50 డిగ్రీలు!
Published Tue, Apr 19 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement