సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగిన నాలుగున్నరేండ్ల తర్వాత ఎట్టకేలకు జలగం వెంకట్రావ్ గెలిచారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు, జలగం వెంకట్రావ్నే ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావ్ బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఈ సందర్బంగా కోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ సెక్రటరీకి జలగం అందించారు. ఈ క్రమంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరారు. ఈ సందర్బంగా జలగం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు నన్ను ఎమ్మెల్యేగా గుర్తించింది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పు ప్రకారం.. నన్ను ఎమ్మెల్యేగా గుర్తించాలని స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని కలిసి కోరాను. 2014లో నేను ఏ ఉద్దేశ్యంతో బీఆర్‌ఎస్ పార్టీలో చేరానో అదే విధంగా ఇప్పుడు కూడా పార్టీ కోసం శ్రమిస్తాను అని స్పష్టం చేశారు.
నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నేను పార్టీలోనే ఉన్నాను. కేసీఆర్.. నన్ను పిలిచిన ప్రతీసారి నేను కలవడం జరిగిందన్నారు. నేను బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీదనే గెలిచాను అని వెల్లడించారు. ఇదే సమయంలో ఈరోజు సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌ను కలవనున్నట్టు వెంకట్రావ్ కలవనున్నారు. ఇదిలా ఉండగా.. 2018లో వనమా వెంకటేశ్వర్రావు ఈసీకి సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్లో తప్పులను దొరకబట్టిన జలగం, నాలుగేండ్లుగా న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వార్తలు.. స్పందించిన ఎంపీ ఉత్తమ్
Comments
Please login to add a commentAdd a comment