temple board
-
చిక్కుల్లో మరో ఐఏఎస్..: ఇంజనీర్లపై బూతులు, అరెస్టు
శ్రీనగర్: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఢిల్లీలో స్టేడియాన్నే ఖాళీ చేయించి, చివరికి శంకరగిరి మాన్యాలు పట్టిన ఓ ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకాన్ని మర్చిపోకముందే అలాంటిదే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుడి భుజంగా చెప్పే ఐఏఎస్ అధికారి నితేశ్వర్ కుమార్ తమను అకారణంగా బూతులు తిట్టడమే గాక అక్రమంగా అరెస్టు చేయించారంటూ సీపీడబ్ల్యూడీ ఇంజనీర్లు ఆరోపించారు. అమర్నాథ్ ఆలయ బోర్డు సీఈఓ అయిన నితేశ్వర్ మే 25న స్థానిక నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘‘పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆ సందర్భంగా ఇంజనీర్లపై ఆయన అకారణంగా ఆగ్రహించారు. సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా తన వెంట ఉన్న ఎస్పీని ఆదేశించి ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు కూడా చేయించారు’’ అని ఇంజనీర్లు చెప్పారు. నితేశ్వర్ తీరును సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ కేంద్ర హౌజింగ్ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి లేఖ రాసింది. -
అమ్మ సన్నిధిలో అవినీతి తాండవం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ : దుర్గగుడిలో అవినీతి తాండవం చేస్తోంది. ఇంటి దొంగలే అమ్మ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. గత గురువారం నుంచి ఇంద్రకీలాద్రి దేవస్థానంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. దీంతో దేవదాయ శాఖ మొత్తం 15 మంది దుర్గగుడి అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సస్పెండ్ అయిన వారిలో ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారే ఉన్నారు. ఈవోలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమతో పాటు తమకు అనుగుణంగా ఉన్న వారిని ఆదాయం వచ్చే చోట పోస్టింగ్‌లు ఇచ్చే వారే ఉన్నారు. ► సస్పెండ్ అయిన సూపరిండెంటెంట్లలో ఒకరు గత ఐదేళ్ల కాలంగా అంతరాలయంలోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్న వారు ప్రభుత్వం మారిన వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలతో ఉద్యోగం చేస్తున్న చోట ఏడాదిన్నర కాలం వెళ్లదీశారు. ► అలాగే దేవస్థాన పరిపాలనా విభాగంలో 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మరో ఉద్యోగి పైన వేటు పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి వచ్చిన సదరు ఉద్యోగి అదే విభాగంలో 9 ఏళ్లు విధులు నిర్వహిస్తున్నాడంటే అధికారులకు ఆ ఉద్యోగి మాట ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గుమస్తా దగ్గర నుంచి సూపరిండెంటెంట్ వరకు తన మాటల చాతుర్యంలో ఈవోలను ఆకట్టుకోవడమే కాకుండా డ్యూటీల మారేందుకు లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడని ప్రచారంలో ఉంది. ఈవోలకు అనుకూలంగా మారితేనే.. దేవస్థానానికి ఎవరు ఈవోగా వచ్చిన వారి సొంత కోటరిని ఏర్పాటు చేసుకోవడం దుర్గగుడిపై పరిపాటిగా మారింది. గతంలో ఇద్దరు మహిళా అధికారులు వచ్చినప్పుడు సైతం ఇదే సూత్రం నడిచింది. అర్హతలు లేకపోయినా అధికారుల మాటలు వింటారనే కారణంతో రికార్డు అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు ఏఈవో స్థాయి బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. దుర్గగుడిపై చీరల విభాగం, ప్రసాదాలు, అన్నదానం, ఈవో పేషీలు కీలకంగా మారుతున్నాయి. పని చేయగలిగిన సత్తా ఉన్న వారిని సైతం నామమాత్రం పనులు ఉన్న విభాగాలలో విధులు కేటాయింపులు చేస్తున్నారు. అంతర్గత బదిలీల్లోనూ అవకతవకలు.. దుర్గగుడిలో ప్రతి ఆరు నెలలకు ఒక సారి అంతర్గత బదిలీలు జరిగేవి. అయితే గత రెండు, మూడేళ్లగా అంతర్గత బదిలీలు సక్రమంగా జరగడం లేదు. ఆదాయం వచ్చే విభాగాలలో విధులు నిర్వహించే వారు తమ స్థానం మరొకరికి దక్కకుండా లక్షలాది రూపాయలు ఈవోలకు సమరి్పంచి అంతర్గత బదిలీలను నిలుపుకుంటున్నారు. తాజాగా ఏసీబీ అధికారుల దాడులకు రెండు రోజుల ముందు కూడా జరిగిన అంతర్గత బదిలీలలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు సమాచారం. ఈ బదిలీలలో కొంత మంది సూపరిండెంటెంట్‌లను కనీసం ఉన్న చోట నుంచి పక్కకు కూడా జరపకపోగా, అధికారుల మాట వినడం లేదనే కారణంగా మరి కొంత మందిని యథాస్థానంలోనే ఉంచేశారు. దీనిపైన కూడా దేవస్థానంలో పెద్ద ఎత్తున దూమారం లేస్తుంది. ఖాళీల భర్తీ ఎలా? ప్రస్తుతం ఏసీబీ అధికారుల దాడుల నేపథ్యంలో పలు విభాగాలు ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం ఆలయంలో పరిపాలన సక్రమంగా జరగాలంటే అధికారులకు బాధ్యతలను సక్రమంగా పంపిణీ చేస్తేనే సాధ్యపడుతుంది. దాడుల తర్వాత మరి దుర్గగుడి అధికారుల వ్యవహార శైలి ఏ విధంగా మారుతుందో వేచి చూడాలి. అక్రమాలపై ముందే హెచ్చరించిన ‘సాక్షి’ ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గగుడిలో అవినీతి జరుగుతోందని ‘సాక్షి’ పలు మార్లు కథనాలు ప్రచురించింది. గత ఏడాది దసరా, భవానీ దీక్షలతో పాటు సంక్రాంతి పర్వదినాలలో టికెట్ల రీసైక్లిలింగ్ జరుగుతుందని చెప్పింది. గత నెల 21వ తేదీన ‘దుర్గగుడిలో ఇంటి దొంగలు’, 29న ‘అమ్మ సొమ్మంటే అలుసా’ అనే శీర్షికన కథనాలను ప్రచురించింది. ఈ కథనాలతో పాటు వారికి అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు గత గురువారం దుర్గగుడిలోని వివిధ విభాగాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. టికెట్ల రీసైక్లిలింగ్, ప్రసాదాల కౌంటర్లలో గోల్మాల్ వ్యవహారాలతో పాటు అన్నదానం, చీరల కౌంటర్లు, స్టోర్స్, పరిపాలనా విభాగాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పెద్ద ఎత్తున లోపాలను గుర్తించిన ఏసీబీ అధికారులు దేవదాయ శాఖకు ప్రాథమిక నివేదికను అందజేయడంతో ఆలయంలో కీలకంగా ఉన్న పలువురు సూపరిండెంటెంట్‌లను సస్పెండ్ చేసింది. దేవదాయ శాఖలోనే ఇంత పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం, ఇంత మంది అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. గతంలో శ్రీశైలం దేవస్థానంలో టికెట్ల కుంభకోణంలో 11 మంది ఆలయ అధికారులు, సిబ్బందిపై సస్పెండ్ వేటు వేయగా, తాజాగా దుర్గగుడిలో 15 మందిపై వేటు వేయడం, మరి కొంత మంది అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. -
శబరిమలలో భక్తుల రద్దీ
శబరిమల: మండల మకర విళక్కు పూజల కోసం ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు శబరిమల ఆలయానికి తరలివచ్చారు. వార్షిక మకర విళక్కు పూజల కోసం అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరచిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గర్భగుడిని దేవాలయ ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి తెరచి, నెయ్యాభిషేకం, మహా గణపతి హోమం సహా పలు ప్రత్యేక పూజలు జరిపారు. కేరళ దేవాదాయ మంత్రి కే సురేంద్రన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు, బోర్డు సభ్యులు, దేవాదాయ కమిషనర్ ఎం హర్షన్ తదితరులు ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వార్షిక మండల పూజల నిమిత్తం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆదివారం భక్తులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో, గుడికి వెళ్లే మార్గాల్లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్సై/ఏఎస్సైలు, 1400 మంది కాన్‌స్టేబుళ్లను భక్తుల భద్రత కోసం సన్నిధానం వద్ద విధుల్లో ఉంచారు. 2018 తీర్పుపై స్టే ఉన్నట్లే! మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అమల్లో ఉన్నట్లే భావించాలని కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్ ఆదివారం వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పునకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. ‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వంగా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. కానీ ఇక్కడో సమస్య ఉంది. 2018లో ఇచ్చిన తీర్పుపై తాజాగా ఈ నవంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్టే ఇచ్చారా? లేదా? అన్నది కీలక ప్రశ్న. స్టే ఇస్తున్నట్లు తీర్పులో ప్రకటించలేదు. కానీ వాస్తవానికి స్టే ఇచ్చినట్లే భావించాల్సి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రచారం కోసం ఆలయానికి రావాలనుకునే మహిళలను ప్రోత్సహించబోమని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
ఇం‘ట్రస్టు’..
భద్రాద్రి దేవస్థానం పాలక మండలిపై నేతల దృష్టి చోటు కోసం ఈసారి ‘కొత్త’ పోటీ భద్రాచలం : ప్రసిద్ధ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థాన పాలక మండలి (ట్రస్టు బోర్డు) ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చోటు కోసం అశావహుల దరఖాస్తులను దేవాదాయశాఖ పరిశీలనకు సిద్ధం చేస్తోంది. గతంలో 9మందితో ఉన్న ట్రస్టుబోర్డు ఈసారి 14మందితో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6తో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియపై సీరియస్‌గా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నామినేటెడ్ పదవుల పందేరానికి తెర తీస్తారా అనేది ప్రస్తుతం సంశయంగా మారింది. అయితే ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు కొనసాగుతున్నందున దసరాకు ముందే దేవస్థానం పాలక మండళ్ల కూర్పు కూడా ఉంటుందని అంతా భావిస్తున్నారు. చైర్మన్, సభ్యుల నియామకాల కోసం తీవ్ర పోటీ నెలకొననుంది. పాలక మండలి ఉంటే గానీ..ఆలయ అభివృద్ధి వేగమందుకుంటుందనే విశ్వాసాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు రాబట్టేందుకు ట్రస్టుబోర్డు కృషి చేస్తుందని విశ్వసిస్తున్నారు. భద్రాద్రి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత, ఇక్కడి ప్రొటోకాల్ దృష్ట్యా ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS పీఠం కోసం పోటీ తీవ్రంగానే ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగానే దేవాదాయశాఖకు ధరఖాస్తులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని పర్యాయాలుగా జరిగిన నియామకాలను భట్టి చూస్తే..చైర్మ¯ŒS పదవి జిల్లా వాసులకే దక్కుతోంది. ఖమ్మం జిల్లా నుంచి దీన్ని ఆశిస్తున్న వారిలో ప్రముఖులు ఉండటంతో గత సంప్రదాయాల ప్రకారం ఈ సారి కూడా దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మొన్నటి దాకా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులు ఉంటే భద్రాద్రి పాలక మండలి పీఠంపై కూర్చోవటం ఖాయమని అనుచరులు ధీమాతో ఉండగా..ఇప్పుడు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు నేపథ్యంలో సీ¯ŒSరివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. చైర్మన్, సభ్యులుగా ఎంపికయ్యేందుకు ఇప్పుడు కొత్తగూడెం జిల్లా నుంచీ గట్టి పోటీనే ఉండబోతోంది. ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS పీఠం ఖమ్మం జిల్లా వాసులకు వస్తుందా..? లేక కొత్తగూడెం జిల్లావారికి వర్తిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చైర్మ¯ŒS పదవి కోసం భద్రాచలానికి చెందిన ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరు ఆధ్యాత్మిక భావాలు ఉన్నవారు, మంత్రి తుమ్మల ఆశీస్సులు కలిగిన వారు. మరొకరు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో నామినేటడ్ పదవుల పందేరంలో ఎవరి మార్కు ఉంటుందనేది దసరా తర్వాత తేలే అవకాశాలున్నాయి.