ఇం‘ట్రస్టు’..
-
భద్రాద్రి దేవస్థానం పాలక మండలిపై నేతల దృష్టి
-
చోటు కోసం ఈసారి ‘కొత్త’ పోటీ
భద్రాచలం : ప్రసిద్ధ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థాన పాలక మండలి (ట్రస్టు బోర్డు) ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చోటు కోసం అశావహుల దరఖాస్తులను దేవాదాయశాఖ పరిశీలనకు సిద్ధం చేస్తోంది. గతంలో 9మందితో ఉన్న ట్రస్టుబోర్డు ఈసారి 14మందితో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6తో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియపై సీరియస్‌గా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నామినేటెడ్ పదవుల పందేరానికి తెర తీస్తారా అనేది ప్రస్తుతం సంశయంగా మారింది. అయితే ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు కొనసాగుతున్నందున దసరాకు ముందే దేవస్థానం పాలక మండళ్ల కూర్పు కూడా ఉంటుందని అంతా భావిస్తున్నారు. చైర్మన్, సభ్యుల నియామకాల కోసం తీవ్ర పోటీ నెలకొననుంది. పాలక మండలి ఉంటే గానీ..ఆలయ అభివృద్ధి వేగమందుకుంటుందనే విశ్వాసాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు రాబట్టేందుకు ట్రస్టుబోర్డు కృషి చేస్తుందని విశ్వసిస్తున్నారు.
భద్రాద్రి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత, ఇక్కడి ప్రొటోకాల్ దృష్ట్యా ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS పీఠం కోసం పోటీ తీవ్రంగానే ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగానే దేవాదాయశాఖకు ధరఖాస్తులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని పర్యాయాలుగా జరిగిన నియామకాలను భట్టి చూస్తే..చైర్మ¯ŒS పదవి జిల్లా వాసులకే దక్కుతోంది. ఖమ్మం జిల్లా నుంచి దీన్ని ఆశిస్తున్న వారిలో ప్రముఖులు ఉండటంతో గత సంప్రదాయాల ప్రకారం ఈ సారి కూడా దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మొన్నటి దాకా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులు ఉంటే భద్రాద్రి పాలక మండలి పీఠంపై కూర్చోవటం ఖాయమని అనుచరులు ధీమాతో ఉండగా..ఇప్పుడు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు నేపథ్యంలో సీ¯ŒSరివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. చైర్మన్, సభ్యులుగా ఎంపికయ్యేందుకు ఇప్పుడు కొత్తగూడెం జిల్లా నుంచీ గట్టి పోటీనే ఉండబోతోంది. ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS పీఠం ఖమ్మం జిల్లా వాసులకు వస్తుందా..? లేక కొత్తగూడెం జిల్లావారికి వర్తిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చైర్మ¯ŒS పదవి కోసం భద్రాచలానికి చెందిన ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరు ఆధ్యాత్మిక భావాలు ఉన్నవారు, మంత్రి తుమ్మల ఆశీస్సులు కలిగిన వారు. మరొకరు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో నామినేటడ్ పదవుల పందేరంలో ఎవరి మార్కు ఉంటుందనేది దసరా తర్వాత తేలే అవకాశాలున్నాయి.