Tencent
-
పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ
టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం టెన్సెంట్ గత పదేళ్లలో తొలిసారిగా లేఆఫ్‌లను ప్రకటించింది. త్రైమాసిక రాబడి అంచనాలు అందుకోలేకపోయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. గత క్వార్టర్లో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలమైనందుకు టెన్సెంట్ దాదాపు 5,500 మంది ఉద్యోగులను సాగనంపింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. జూన్ చివరి నాటికి కంపెనీలో 1,10,715 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది మార్చి నెలలో నమోదైన దానితో పోలిస్తే దాదాపు 4.7 శాతం తక్కువ. ఫలితాలు మెరుగుకాకపోతే.. ఇంటికే కేవలం టెన్సెంట్ మాత్రమే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే, చైనా అతిపెద్ద టెక్నాలజీ కార్పొరేషన్ కూడా ఖర్చు తగ్గింపు చర్యగా ఒక దశాబ్దంలో మొదటిసారిగా నియామకాలను నిలిపివేసింది. ప్రస్తుతం గూగుల్‌తో సహా కొన్ని ఇతర టాప్ టెక్ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా అనేక మంది ఉద్యోగులను తొలగించాయి. మరో చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా ఇటీవల ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కంపెనీలో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, అయితే చాలా తక్కువ మంది మాత్రమే పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ గతంలో కంటే కష్టపడి పనిచేయాలని కోరారు. దీంతో పాటు కొంతమంది టాప్ గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థలో తొలగింపుల గురించి మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ పనితీరును పెంచుకోకపోతే, తొలగింపులకు సిద్ధం కావాలని హెచ్చరించారు. తొలగింపులు జరుగుతాయా లేదా అనేది తదుపరి త్రైమాసిక ఆదాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. చదవండి: గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో -
ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!
సాధారణంగా హై ఎండ్ మొబైల్స్ లో అత్యధికంగా 8జీబీ ర్యామ్ లేదా ఇంకొంచం ఎక్కువ అయితే 12జీబీ ర్యామ్ ఉంటుంది. కానీ, న్యూబియా అనే కంపెనీ టెన్సెంట్ గేమ్స్ తో కలిసి 18 జీబీ ర్యామ్ గల రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ ను చైనాలో తీసుకోని వచ్చింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ప్రస్తుతం చైనాలో కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ లో మూడు వేరియంట్ లు ఉన్నాయి. రెడ్ మ్యాజిక్ 6 ప్రో 18జీబీ ర్యామ్ గల మొబైల్ లో 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొనివచ్చారు. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. రెడ్‌మ్యాజిక్ 6 & రెడ్‌మ్యాజిక్ 6 ప్రో ఫీచర్స్: వీటిలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే పెద్ద బెజెల్స్ ఉన్నాయి. 165 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఉన్న ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంది. 500 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మల్టీ టచ్‌లో 360 హెర్జ్ ఉంటుంంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 888ను తీసుకొచ్చారు. ఇది 5జీకి, వైఫై 6ఈకి సపోర్టు చేస్తుంది. ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్, 3.1 యూఎఫ్ఎస్ స్టోరేజీ ఇస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ మొబైల్లో బ్యాటరీ కూలింగ్ కోసం చిన్న ఫ్యాన్‌ను కూడా అందించారు. బ్యాటరీ వేడిని ఇది 16 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తుందట. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రోలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. దీంతో 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ చేయొచ్చు. రెడ్‌మ్యాజిక్ 6లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ నెల 11 నుంచి చైనాలో, 16 నుంచి ప్రపంచ మార్కెట్లోకి ఈ మొబైల్స్ విక్రయానికి రానున్నాయి. రెడ్‌మ్యాజిక్ 6 ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 3,799 (సుమారు రూ.42,700) 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,099 (సుమారు రూ.46,000) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,500) రెడ్ మ్యాజిక్ 6 ప్రో ధర: 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,550) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,799 (సుమారు రూ.54,000) 16జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 5,299 (సుమారు రూ.59,600) 18జీబీ + 512జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 6,599 (సుమారు రూ.74,200) చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
పబ్జీ లాభాల్లో భారత్ వాటా 1.2 శాతమే...
ముంబై: దేశంలో పబ్జీ యాప్ నిషేధించినప్పటికీ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పబ్జీ మొబైల్ యాప్ 2018లో పారంభమైనప్పటి నుంచి యాప్ వినియోగదారులు 3.5 బిలియన్ డాలర్స్ ఖర్చు చేసినట్లు సెన్సార్ టవర్స్ అనే కంపెనీ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. కేవలం ఈ ఏడాదిలోనే 19.8 కోట్ల డౌన్లోడ్లు కాగా... 1.8 బి.డా(180కోట్లు) సంపాధించడం విశేషం. అంతే కాదు గత 72 రోజుల్లో 50 కోట్ల డాలర్లు పబ్జీ యాప్ ఆర్జించింది. ఈ గణాంకాలు ఇదిలా ఉండగా, భారత దేశంలో ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పబ్జీ యాప్ వినియోగదారుల్లో 24 శాతం మన దేశంలోనే ఉన్నారు. కానీ ఈ యాప్‌కు వచ్చే లాభాల్లో మన దేశం నుంచి కేవలం 1.2 శాతం మాత్రమే. రాయల్ పాస్, రకరకాల రంగులు, ఇంకా యాప్‌లోని కొన్ని పరికరాలు కొనేందుకు మన దేశంలో ఉన్న పబ్జీ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఈ నెల 2న చైనాకు చెందిన 118 యాప్స్‌తో పాటు పబ్జీ కూడా నిషేధించిన విషయం తెలిసిందే. దీన్ని ద్వారా ఈ యాప్ పబ్లిషర్ టెన్సెంట్ కంపెనీకి 34 బి.డా నష్టపోయింది. మన దేశంలో పబ్జీని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. ఇప్పుడు మన దేశంలో ఈ యాప్‌ను డౌన్లోడ్ లేదా అప్డేట్ చేయడం చట్ట విరుద్ధం. రెవెన్యూ పరంగా మన దేశంలో కొంత నిరాశగానే ఉన్నా, మళ్లీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు పబ్జీ కార్పొరేషన్ తెలిపింది. ఈ వివాదాన్ని పరిశీలించి టెన్సెంట్ కంపెనీ నుంచి పూర్తి హక్కులు పొందినట్లు పేర్కొంది. భారత్‌లో మళ్లీ పబ్జీని ప్రారంభించేందుకు స్వదేశీ బ్రాండ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. (చదవండి: భారత్‌లో రీ ఎంట్రీకి పబ్జీ మాస్టర్ ప్లాన్) -
పబ్జీ బ్యాన్ : పబ్జీ కార్పొరేషన్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్‌ని నిషేధంతో ఆందళనలో పడిన పబ్జీ ఫాన్స్ కు భారీ ఊరట లభించనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో పాపులర్ బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్ మళ్లీ దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి పరిణామాల దృష్ట్యా పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ గేమ్‌లకు పబ్లిషింగ్ హక్కులను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇకపై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. (ఇండియన్ పబ్జీ...ఫౌజీ వచ్చేస్తోంది!) ఇండియాలో పబ్జీ రద్దుపై ఈ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్జి కార్పొరేషన్ తాజాగా స్పందించింది. పబ్జీ మొబైల్ వర్షన్‌ను ప్రమోట్ చేస్తున్న చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ కంపెనీతో సంబంధాలను తెగ తెంపులు చేసుకుంటోంది. నిషేధం తదనంతర పరిస్థితిని గమనిస్తున్నామని వెల్లడించింది. ఇకపై పబ్జీ మొబైల్‌కు, టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, పూర్తి బాధ్యతలు తమ ఆధ్వర్యంలోనే ఉంటాయని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. భారతీయ చట్టాలు, నిబంధనలను, ప్రభుత్వం చర్యలను పూర్తిగా గౌరవిస్తున్నామనీ, ఈ విషయంలో ఒక పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని ప్రకటించింది. తద్వారా యాప్‌పై నిషేధం తొలగిపోతుందని పబ్జీ కార్పొరేషన్ భావిస్తోంది. అయితే ఈ విషయంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా గత వారం భారతదేశంలో పబ్జీ నిషేధం తరువాత టెన్సెంట్ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు అంచనా. -
ఎమ్ఎక్స్ ప్లేయర్లో పేటీఎమ్, టెన్సెంట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: టైమ్స్ ఇంటర్నెట్ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్, ఎమ్ఎక్స్ ప్లేయర్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. ఎమ్ఎక్స్ ప్లేయర్లో డిజటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్, చైనా ఇంటర్నెట్ సంస్థ, టెన్సెంట్‌లు ఈ నెలలోనే రూ.860 కోట్ల(12.5 కోట్ల డాలర్ల)మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత ఇంటర్నెట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వ్యూహంలో భాగంగా టెన్సెంట్ కంపెనీ ఈ పెట్టుబడులు పెడుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహంలో భాగంగా పేటీఎమ్ కంపెనీ ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఇన్వెస్ట్ చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలపై ఈ మూడు సంస్థలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 50 కోట్లకు పైగా డౌన్లోడ్స్... ఆండ్రాయిడ్ ప్లాట్ఫార్మ్పై ఎమ్ఎక్స్ ప్లేయర్ డౌన్లోడ్స్ 50 కోట్లకు మించాయి. హిందీ, ఇతర భారత ప్రాంతీయ భాషల్లో ఒరిజినల్ కంటెంట్‌పై ఎమ్ఎక్స్ ప్లేయర్ దృష్టి పెడుతోంది. కాగా టైమ్స్ ఇంటర్నెట్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ‘గానా’లో గత ఏడాది ఫిబ్రవరిలో టెన్సెంట్ కంపెనీ 11.5 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. -
ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన టెన్సెంట్
అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చైనా సోషల్ మీడియాదిగ్గజం షాక్ ఇచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా చైనాకు చెందిన టెన్సెంట్ ఫేస్‌బుక్‌ను బీట్ చేసింది. మంగళవారం ఇన్వెస్టర్ల కోనుగోళ్లతో ప్రపంచ దిగ్గ సంస్థల టాప్ 5లో చోటు దక్కించుకుంది. చైనా సోషల్ మీడియా, వీడియో గేమ్ దిగ్గజం టెన్సెంట్ మార్కెట్ విలువలో ఫేస్‌బుక్‌ను అధిగమించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి టెన్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.15 ట్రిలియన్ హాంకాంగ్ డాలర్లు ( 531 బిలియన్ డాలర్లు)డాలర్లుగా నమోదైంది. దీంతో ప్రపంచంలోని ఐదు అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా టెన్సెంట్ నిలిచింది. కాగా ఫేస్బుక్ మార్కెట్ క్యాప్ 519 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మరో దిగ్గజ సంస్థ ఆపిల్ మార్కెట్ క్యాప్ 873 బిలియన్ డాలర్లుగా ఉంది. -
అమెజాన్‌కు చెక్..ఫ్లిప్‌కార్ట్ మెగాడీల్
-
అమెజాన్‌కు చెక్..ఫ్లిప్‌కార్ట్ మెగాడీల్
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే మెగా డీల్ సాధించింది. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఈబేను కొనుగోలు చేసింది. ఇటీవల భారీగా నిధుల సమీకరణను చేపట్టబోతోందన్న ఊహాగాలను తెరదించుతూ ఫ్లిప్ కార్ట్ ఈ మెగాడీల్ వివరాలను సోమవారం ప్రకటించింది. టెన్సెంట్, ఇ-బే, మైక్రెసాఫ్ట్ల నుంచి భారీ పెట్టుబడులను సాధించినట్టు వెల్లడించింది. సుమారు 11.6బిలియన్ డాలర్లు(75 వేలకోట్ల రూపాయలు) ఎన్ఎస్ఇ లోఅన్ని రిటైల్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించనుంది. ఈ డీల్‌తో తన ప్రధాన ప్రత్యర్థి అమెజాన్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే దేశీయ ఈ కామర్స్ వ్యాపారంలో అతిపెద్ద ఒప్పందంగా నిలవనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్ వాటా కన్నేసిన ఈబే భారత్‌లోని వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. ఈ డీల్ ద్వారా భారీ పెట్టుబడులకు తెరలేచింది. సుమారు1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఫ్లిప్‌కార్ట్ సమకూర్చుకోనుంది. చైనాకి చెందిన టెన్సెంట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ , ఈబే నుంచి సుమారు 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించింది. టెన్సెంట్ వ్యూహాత్మకంగా భాగస్వామిగా ఉండనుంది. ఈబే ఫ్లిప్‌కార్ట్ లో స్వతంత్ర సంస్థగా కొనసాగనుంది. తన వాటాను విక్రయించిన సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇకపై నగదు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ప్రతిపాదిత డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాల కోసం 500 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. తమతో ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌లు జత కలవడం చాలా సంతోషంగా ఉందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తమకు సంబంధించిఇది ఒక ఒక మైలురాయి ఒప్పందమని ఫౌండర్లు సచిన్ బన్సల్, బిన్నీ బన్స్ల్ ప్రకటించారు. కాగా 2007 లో లాంచ్ అయిన ఫ్లిప్క్లార్ 100 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది. ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విస్తరణలో భాగంగా 1.5–2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించే ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే.