నెరవేరిన దంపతుల కల
► 9 మంది కుమార్తెల తరువాత 10వ సంతానంగా వారుసుడు
► కుమారుడితో ఆస్పత్రిలో దంపతులు
► 10వ సంతానం కుమారుడితో రామకృష్ణ
తుమకూరు : వంశోద్ధారకుడి కోసం తపించిన ఆ దంపతుల కల నెరవేరింది. తొమ్మిది మంది కుమార్తెల తర్వాత ఆ దంపతులకు పదవ సంతానంగా కుమారుడు జన్మించాడు. దీంతో వారు పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా, కోడగెనహళ్లి సమీపంలోని కురికనహళ్లిలో రామకృష్ణ, భాగ్యమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు.
15 సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. మొదటి సంతానం కుమార్తె జన్మించగా ఆ బాలిక వయస్సు 14 సంవత్సరాలు. మరో కాన్పులోనూ ఆడబిడ్డ జన్మించింది. కుమారుడు కావాలనే కోరికతో ఉన్న దంపతులకు వరుసగా తొమ్మిది మంది కుమార్తెలు కలిగారు. ఈక్రమంలో మరోమారు ఆమె గర్భం దాల్చడంతో వెంటవెంటనే ఆడపిల్లలు పుట్టడంతో ఎలాగైన వంశాన్ని పెంచడం కోసం కుమారుడు కావాలను కున్నారు. దాంతో 9 మంది ఆడపిల్లలన కన్నారు. 10వ సంతానంగా శుక్రవారం బాగ్యమ్మ (39). మగపిల్లాడి జన్మనివ్వడంతో దంపతూలు సంతోషంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం మహిళలకు పురిటి నొప్పులు వస్తున్న సమయంలో ఆంబూలేన్స్లో హిందుపురంలో ఉన్న ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో మగ శిశువుకు జన్మనివ్వడం జరిగింది. దాంతో 10 సంతానం అయినా కుడ వారసుడు రావడంతో కుటుంబం అంత సంతోషంగా ఉన్నారు.