Tenth class Question Paper
-
టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులు రద్దు
సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రంలో కీలక మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు. ఇంటర్నల్ మార్కుల వల్ల కార్పొరేట్ స్కూళ్లకే లబ్ధి కలుగుతోందనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అందుకే మొత్తం మార్కులకు పదోతరగతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలో ప్రత్యేకంగా ఇచ్చే బిట్ పేపర్ తొలగిస్తామని వెల్లడించారు. ఇకపై బిట్ పేపర్‌ను ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగా చేరుస్తామని వివరించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి. సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8 మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. సబ్జెక్ట్ వారీగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తాం. ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. దీనికి అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం ఇస్తాం. సమాధాన పత్రాలు గతంలో లూజ్ షీట్లు ఉండేవి. దానివల్ల కాపీయింగ్‌కు ఆస్కారం ఉండేది. అందుకే ఇప్పుడు 18 పేజీల బుక్లెట్ ఇవ్వబోతున్నాం. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తాం. మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహిస్తాం. కంప్యూటర్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తాం. దీనికి పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు’’ అని మంత్రి సురేష్ అన్నారు. పేరెంట్స్ కమిటీల పర్యవేక్షణలోనే కార్యక్రమాల అమలు రాష్ట్రంలో 46,635 పాఠశాలలకు తల్లిదండ్రుల (పేరెంట్స్) కమిటీ ఎన్నికలను సజావుగా నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు 45,390 స్కూళ్లకు కమిటీల ఎంపిక పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యాహక్కు చట్టంపై పేరెంట్స్ కమిటీలకు అవగాహన కల్పిస్తామని, పాఠశాలల పర్యవేక్షణ, నియంత్రణలో వారిని భాగస్వాములను చేస్తామని అన్నారు. ఎన్నిక వాయిదా పడిన స్కూళ్లలో 28వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ మాసాంతంలో పేరెంట్స్ కమిటీలకు శిక్షణ ఇస్తామన్నారు. యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, సైకిళ్ల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కొత్త ప్రశ్నాపత్రం ఇలా.. ►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు. ►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు. ►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు. ►1 మార్కు చొప్పున 8 మార్కులు. ►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు. ►2 మార్కులు చొప్పున 16 మార్కులు. ►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు. ►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు. -
కొనసాగుతున్న ‘టెన్త్’ లీక్
పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్‌లో సోషల్–1 పేపర్ కడప ఎడ్యుకేషన్/కాశినాయన/ పోరుమామిళ్ల: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం జరిగిన సోషల్ పేపర్–1 ప్రశ్నపత్రం కూడా లీకైంది. ఉదయం 10 గంటలకల్లా వాట్సాప్‌లో ప్రశ్నపత్రం దర్శనమివ్వడంతో జిల్లాలో కలకలం రేగింది. వైఎస్సార్ జిల్లా నరసాపురంలోని పరీక్ష కేంద్రం నుంచి ఈ ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రం ఆధారంగా పలు కేంద్రాలకు బయట నుంచి సమాధానాలు పంపించినట్లు సమాచారం. దీనిపై డీఈవో శైలజను వివరణ కోరగా.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు నరసాపురం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. చీఫ్ సూపరింటెండెంట్ సుబ్బారావు, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఇన్విజిలేటర్లను విచారిస్తున్నారు. విలేకరిపై పోలీసు జులుం: నరసాపురం పరీక్షా కేంద్రం నుంచి సోషల్–1 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందం టూ ఓ చానల్(సాక్షి కాదు)లో ఉదయం 9.45 గంటలకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దీంతో పోరుమామిళ్ల వచ్చిన మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు.. ఆ చానల్ విలేకరి గోపాల్‌రెడ్డిని స్టేషన్‌కు పిలిపించారు. ప్రశ్నపత్రం ఎలా బయటకొచ్చింది? అసలు ఆ పేపర్ నీ చేతికి ఎలా వచ్చింది? అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ఎస్సై పెద్ద ఓబన్న అయితే ఏకంగా విలేకరి నుంచి ఫోన్ లాగేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానిక విలేకరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో గోపాల్‌రెడ్డిని వదిలివేశారు. కానీ అతని ఫోన్ మాత్రం వారి వద్దే అట్టిపెట్టుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ విలేకరులంతా స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఎస్సై ఓబన్న బయటకు వచ్చి విలేకరులకు సర్ది చెప్పారు. సోషల్ పేపర్–2 ప్రశ్నపత్రం కూడా లీక్! సాక్షి కడప: ఈనెల 30(గురువారం)న నిర్వహించాల్సిన సోషల్ పేపర్–2 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం సైతం లీకైనట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రం మంగళవారమే బ్రహ్మంగారి మఠం మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చేరినట్లు తెలియడంతో పోలీసులు ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అవును.. టెన్త్ పేపర్ లీకైంది!
శాసనసభలో అంగీకరించకనే అంగీకరించిన చంద్రబాబు ⇒ ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్ చేశాక లీకేజీలపై స్పందించిన సీఎం సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకయినట్లు సీఎం చంద్రబాబు అంగీకరించకనే అంగీకరించారు. నెల్లూరు లోని ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్లో పనిచేసే వాచ్‌మన్ ప్రవీణ్ ఈనెల 25న ఉదయం 9.25 గంటలకు సెల్‌ఫోన్ ద్వారా పదో తరగతి ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో పంపారని శాసనసభలో చెప్పారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే.. పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రం లీకైనట్లు సీఎం చంద్రబాబే అంగీకరించినట్లు స్పష్టమైంది. కానీ.. ఇది లీకేజీ కాదని మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం సభలో లేని సమయంలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్లో పనిచేసే వాటర్ బాయ్ ప్రవీణ్ సెల్ఫోన్లో ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి.. వాట్సప్‌లో పంపారని తెలిపారు. అదే పశ్నపత్రాన్ని నెల్లూరు సాక్షి టీవీ విలేకరి 10.25 గంటలకు డీఈవోకు వాట్సాప్‌లో పంపారని చెప్పారు. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్‌కు 11.15 గంటలకు డీఈవో ఫిర్యాదు చేశారని.. ఆ వెంటనే ఆ పరీక్ష కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌ను, జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర పరిశీలకుడిని పంపి విచారణ చేయించామని చెప్పారు. పరీక్ష కేంద్రంలో ఏడో నెంబర్ గదిలో పరీక్ష పత్రం లీకైందని గుర్తించి.. ఇన్విజిలేటర్ మహేష్‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించి.. విచారణ చేయాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించామని.. దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పుకొచ్చారు. పశ్నపత్రం ‘సాక్షి’ టీవీ విలేకరికే ఎలా వచ్చిందని.. డీఈవోకు ఎందుకు పంపారని.. ఇందులో ఏదో కుట్ర ఉందని.. విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతాయని చెప్పారు. ఇది మాల్‌ప్రాక్టీస్ మాత్రమేనని. లీకేజీ కాదంటూ చెప్పుకొచ్చారు.