Tenth girl student
-
ప్రొద్దుటూరులో టెన్త్ విద్యార్థినిపై దారుణం
ప్రొద్దుటూరు క్రైం: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థి.. మరో విద్యార్థితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరంపై స్కూల్ యాజమాన్యం వద్ద బాలిక మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. బాలికకు ధైర్యం చెప్పాల్సిన పాఠశాల కరస్పాండెంట్.. మరింత బెదిరించడంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రొద్దుటూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఎర్రగుంట్ల మండలానికి చెందిన బాలిక ప్రొద్దుటూరు నేతాజీనగర్‌లోని ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఈ నెల 24వ తేదీన బాలిక హాస్టల్ గదిలో ఉండగా అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడు, ఏడాది కిందట ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన మరో బాలుడు కలిసి బాలికను హాస్టల్ పైఅంతస్తులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. భయంతో వణికిపోయిన బాలిక జరిగిన ఘటన గురించి స్కూల్ కరస్పాండెంట్‌కు చెప్పింది. బాలికకు ధైర్యం చెప్పి ఓదార్చాల్సిన ఆయన.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని.. టెన్త్ క్లాస్ ఫెయిల్ చేయిస్తానంటూ బాలికనే బెదిరించాడు. దీంతో తీవ్ర అవమానభారంతో ఆ బాలిక 25వ తేదీన పాఠశాల మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలు జారిపడినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ పాఠశాల మైదానంలో అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను స్కూల్ యాజమాన్యం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ‘మీ పాప స్కూల్ భవనంపై నుంచి కాలు జారి కింద పడింద’ని స్కూల్ యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. వారు వచ్చేలోపే.. పరిస్థితి విషమించిందని, కర్నూలు ఆస్పత్రికి తరలించాలని బాలికను అంబులెన్స్‌లో ఎక్కించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక 27 సాయంత్రం స్పృహలోకొచ్చింది. బాలికకు నడుము, కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని వైద్యులు చెప్పారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తన చిన్నమ్మకు వివరించింది. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లేందుకు బాలిక కుటుంబ సభ్యులు ప్రయత్నించగా అక్కడ కాపలాగా ఉన్న స్కూల్ యాజమాన్యం మనుషులు వారిని అడ్డుకుని బెదిరించారు. ఈ క్రమంలో తిరుపతి ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి బాలికను గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి.. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రామలింగమయ్య చెప్పారు. -
విద్యార్థిని బ్లాక్మెయిల్ కేసులో మరో ముగ్గురు నిందితులు?
* మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యాధికారులు * ఆత్మహత్యపై కొనసాగుతున్న విచారణ నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి, లైంగికంగా వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసిన కేసులో మరో ముగ్గురు నిందితులున్నారని తెలిసింది. కనిమెల్ల గ్రామానికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్, మైలపల్లికి చెందిన మహేశ్, అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై బాలిక సోదరుడు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వీరు కాకుండా మల్యాడ, సతివాడ, కనిమెల్ల గ్రామాలకు చెందిన మరో ముగ్గురు యువకులు కూడా బాలికను వేధించినట్టు తెలిసింది. విచారణ సమయంలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. బాలికను ఎవరెవరు వేధించారన్న వివరాలు చెప్పకుండా ఈ కేసులో నిందితుడైన మృతురాలి క్లాస్మేట్ నోరును గ్రామపెద్దలు నొక్కేసినట్టు తెలిసింది. ఈ బాలికనేకాకుండా పాఠశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థినులను సైతం వీరంతా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. రెండుగ్రామాల మధ్యనున్న దారిలో అడ్డగించి ఇబ్బందిపెట్టినట్టు సమాచారం. చురుకుగా విచారణ విద్యార్థిని మృతిపై విచారణ చురుగ్గా సాగుతోంది. పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని గురువారం వెలికి తీయించారు. తహశీల్దారు కృష్ణమోహన్, సీఐ రవికుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శవపంచనామా జరిపించారు. జిల్లా కేంద్రాస్పత్రికి చెందిన వైద్యాధికారులు రాజ్యలక్షి తదితరులు మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ కృష్ణప్రసన్న సమక్షంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మాల్యాడ గ్రామంలోని శ్మశానవాటికలో పంచనామా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది. గ్రామపెద్దలను విచారించిన డీఎస్పీ మల్యాడ గ్రామ సర్పంచ్‌తో పాటు మాజీసర్పంచ్, మరికొంతమంది పెద్దలను ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ కృష్ణప్రసన్న వేర్వేరుగా విచారణ చేశారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తరువాత సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని వినిపిస్తున్న ఆరోపణలపై ప్రశ్నించారు. -
యాసిడ్ తాగి టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కాకినాడ: టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పిఠాపురం ఎస్సీ హాస్టల్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్సీ హాస్టల్లో తోటి విద్యార్థినితో గంగ అనే విద్యార్థిని గొడవ పడింది. అనంతరం మనస్థాపానికి గురైన ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గంగ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.