tenth student dies
-
మద్యం మత్తే ప్రాణం తీసింది
కదిరి/బెంగళూరు/యశవంతపుర: ఆ విద్యార్థి వయసులో చిన్నవాడైనా ఉన్నతమైన ఆలోచనలతో మెలిగేవాడు. చదువులో అందరికంటే ముందుండేవాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఉపాధ్యాయులకు చెప్పేవాడు. అదే నమ్మకంతో ఉపాధ్యాయులు సైతం అతడిని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. కానీ.. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన అతడి ప్రాణాలను మృత్యువు కబళించింది. డ్రైవర్ మద్యం సేవించి బస్సును నిర్లక్ష్యంగా నడపడమే ఇందుకు కారణమైంది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి–మురిడి మధ్య అటవీ ప్రాంతంలో బెంగళూరు–హొన్నావర్ జాతీయ రహదారి పైనుంచి శుక్రవారం రాత్రి బస్సు లోయలోకి బోల్తా పడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవలీ కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థి టి.బాబాఫక్రుద్దీన్ (15) మృతి చెందాడు. ప్రమాదంలో మరో విద్యార్థి షాహిద్, ఉపాధ్యాయులు ఆదినారాయణరెడ్డి, విశ్వేశ్వరయ్య, నాగిరెడ్డి తీవ్రంగా గాయపడగా.. మరో 26 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిందిలా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 46 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు, నలుగురు వంట మనుషులు కలిసి మొత్తం 60 మంది ఈనెల 2న కర్ణాటకకు చెందిన ప్రైవేట్ బస్సులో విహార యాత్ర నిమిత్తం కర్ణాటక బయలుదేరారు. శుక్రవారం రాత్రికి మురిడి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణం సాగిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో సురేఖ మురిగి వ్యూ పాయింట్ వద్ద బస్సు అదుపు తప్పి ఎడమ వైపున లోయలోకి బోల్తా కొట్టింది. విద్యార్థి బాబాఫక్రుద్దీన్‌పై తోటి ప్రయాణికులు పడటంతో ఊపిరాడక మరణించాడు. మరో విద్యార్థి షాహిద్ తలకు బలమైన గాయమైంది. ఉపాధ్యాయుడు ఆదినారాయణరెడ్డికి చేయి విరగ్గా, మరో ఉపాధ్యాయుడు విశ్వేశ్వరయ్య తలకు, మరో టీచర్ నాగిరెడ్డి దవడకు తీవ్ర గాయాలయ్యాయి. సీఎం వైఎస్ జగన్ ఆరా బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందేవిధంగా అధికారులను అప్రమత్తం చేశారు. విద్యార్థి ఫక్రుద్దీన్ కుటుంబానికి సీఎం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. -
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
పర్వతగిరి: మండల కేంద్రం మోడల్ స్కూల్లోని వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం మడ్డి ప్రసన్న (16) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం.. మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ప్రసన్నను పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు వ్యక్తిగత కారణాలతో తోటి విద్యార్థుల ముందు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై వసతి గృహంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు తెలపటంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రసన్నను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు తెలుపటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురికి ప్రసన్న మృతుదేహన్ని తరలించారు. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు ప్రసన్న మృతితో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రసన్న అందరితో కలివిడిగా ఉండేదని, అందరి మన్ననలు పొందుతూ చదువులో రాణించేదని విద్యార్థులు శోక సముద్రంలో మునిగిపోయారు. -
ఘోరం..
ట్రాక్టర్ బోల్తా.. టెన్త్ విద్యార్థిని మృతి పది మందికి తీవ్రగాయాలు.. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు యల్లనూరు: కూలీలు, విద్యార్థులతో బయల్దేరిన ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. స్పెషల్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోతివా అంటూ మృతి చెందిన విద్యార్థిని తనూజ తల్లిదండ్రులు రాములు, గురక్కలు బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నీర్జాంపల్లి సమీపంలో గ్రామానికి చెందిన పెద్దిరాజు, ఆయన భార్య రామలక్ష్మమ్మ, పెద్దిరాజు తమ్ముడు చంద్రయ్య, ఆయన భార్య జయమ్మలు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ట్రాక్టర్లో ఇసుకను తీసుక తేవడానికి బయల్దేరారు. అదే సమయంలో నీర్జాంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థులు తనూజ(15), భాస్కర్, గంగామహేష్, కామాక్షి, మణికంఠ, భారతి, పృధ్విలు తాము చదువుకుంటున్న పార్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు వెళ్లేందుకు ట్రాక్టర్లో ఎక్కారు. గ్రామం దాటి కొంతదూరం వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తాపడింది. అందరూ తీవ్రంగా గాయపడటంతో హుటిహుటిన పులివెందుల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తనూజ మృతి చెందింది. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థిని భారతిని మెరుగైన వైద్యం కోసం కుప్పం ఆస్పత్రికి తరలించారు. కామాక్షి, మణికంఠలను అనంతపురం, పెద్దిరాజును కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థులు గంగామహేష్, భాస్కర్‌తో పాటు చంద్రయ్య, జయమ్మ, రామలక్ష్మమ్మలు పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శ: రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి పులివెందుల ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు.