termers
-
శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని ఎచ్చర్ల, లావేరు మండలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాని ప్రభావంతో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని జనం అంతా భయంతో బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు
ప్ర్రకాశం: ప్రకాశం జిల్లాలోని పామూరు మండలంలో శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బలిజపాలెం, బొట్లగూడురు, మెపాడు పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దాంతో భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ రెండు జిల్లాల్లో పదే పదే భూ ప్రకంపనలు
ప్రకాశం: గత కొన్ని రోజులుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పదే పదే స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం ప్రకాశం జిల్లాలోని పామురు, పీఎస్పురం మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో ఇళ్లలోనుంచి జనాలు పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో భయందోళనకు గురైన జిల్లా వాసులు తమ ఇంట్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. -
భూ ప్రకంపనలు స్థానికమైనవే...
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లాలోని కొన్ని చోట్ల ఆదివారం ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో వచ్చిన భూ ప్రకంపనలు స్థానికమైనవేనని విశాఖపట్నానికి చెందిన రిటైర్డు వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇలా అక్కడక్కడా అప్పుడప్పుడూ భూమి కంపించడం సర్వసాధారణమేనని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో శనివారం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కవిటి, సోంపేట సముద్ర తీరగ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించినట్టు భూకంప కేంద్రం పేర్కొంది. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన జనం ఇళ్లలోనుంచి భయటకు పరుగులు తీశారు.