terrifying moment
-
లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది దీన్నే అవకాశంగా మలుచుకని తమ జీవితాలను మూడుపూవులు ఆరుకాయల్లా మార్చుకున్నారు. ఆ కొంతమందిలో అమెరికాలోని అలబామా, పెల్ సిటీకి చెందిన 32 ఏళ్ల బ్రాంట్లీ గెర్హార్డ్ట్ ఒకడు. లాక్డౌన్ సమయంలో అతనికొచ్చిన ఓ ఐడియా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే.. గ్రిన్చ్ ( ఒళ్లంతా జుట్టు ఉండే ఓ వింత జంతువు) వేషాన్ని ధరించి ఆ పరిసరాలు మొత్తం చక్కర్లు కొట్టడం. అలా ఎందుకంటే.. లాక్డౌన్ సమయం కాబట్టి పిల్లల్ని బయటికి రాకుండా చూడటం వారి తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కనుకు అతను పిల్లలను భయపెట్టి వాళ్లు ఇళ్లలోంచి బయటకు రాకుండా చూడాలి. అతడి ఆలోచన నచ్చి భార్య సరేనంది. దీంతో అతడు గ్రిన్చ్ వేషంలో దగ్గరలోని నిత్యవసర వస్తువుల దుకాణాలు తిరగటం మొదలుపెట్టాడు. అలా ప్రతీ షాపు దగ్గర కొంత సేపు చక్కర్లు కొట్టేవాడు. కొంతమంది పిల్లలు అతడ్ని చూసి భయపడగా, మరికొంతమంది ఫొటోలు తీసుకోవటానికి ఎగబడేవారు. అలా కొంత మేర డబ్బు సంపాదించిన అది సరిపోయేది కాదు. ఓ రోజు గ్రిన్చ్ దుస్తుల్లో బ్రాంట్లీని చూసిన ఓ వ్యక్తి తన పిల్లల్ని భయపెట్టాలని, అందుకోసం 20 డాలర్లు (సుమారు 1500రూపాయలు) ఇస్తానని అన్నాడు. ఆ రోజు నుంచి గత సంవత్సరం వరకు ఆ వ్యక్తి పిల్లలను భయపెట్టేందుకు దాదాపు 20 వేల కుటుంబాలను కలుసుకున్నాడు. రోజుకు కనీసం 20 ఇళ్లలోని పిల్లల్ని భయపెడుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇందులోనూ కొత్తదనం కోరుకుంటూ ఎప్పటికప్పుడు తన వేషాలను మారుస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆ నగరంలో అతనో సెలబ్రిటీలా మారిపోయాడు దీంతో అతడితో ఫొటోలు దిగటానికి జనం ఎగబడుతున్నారట. ప్రస్తుతం అతను పిల్లల్ని భయపెట్టడానికి 30 డాలర్లు(2,251రూపాయలు) వసూలు చేస్తున్నాడు. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు కదా.. బహుశా అది ఇదేనేమో. చదవండి: Niloufer Cafe Hyderabad: కప్పు చాయ్ రూ.1000.. ఎక్కడో తెలుసా? -
అడవిలో కెమెరాలు వదిలిపెట్టి దౌడో దౌడు..
ఆఫ్రికా: ఈ మధ్య అటవీ జంతువులకు మనుషులంటే తెగ కోపమొచ్చేస్తుంది. సరదాగా వాటిని చూసేందుకు వెళ్లినా.. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించినా వెంటపడి తరుముతున్నాయి. కార్లలో కూర్చున్నప్పటికీ గుండెలు జారీపోయేంత పనిచేస్తున్నాయి. దురదృష్టంకొద్ది కారు ఆగిందో ప్రాణాలుపోవడం తప్పని పరిస్థితి ఎదురవుతుంది. మొన్న ప్రముఖ హాలీవుడ్ నటుడికి గుండెల్లో రైల్లు పరుగెత్తించినట్లుగానే రెండు ఖడ్గమృగాలు ఇద్దరు దంపతులకు చుక్కలు చూపించాయి. బ్రతికితే చాలు అన్నంత వేగంగా ఆ ఇద్దరు, మరికొందరు కార్లలో దౌడు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అది ఆఫ్రికాలోని హుహువి పార్క్. ఇద్దరు దంపతులు సఫారీకి వెళ్లారు. ఆ ఓపెన్ వన్యప్రాణి క్షేత్రంలో రెండు కెమెరాలతో కనిపించిన ప్రతి జంతువును ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో దుమ్ముకొట్లాడే రోడ్డులో ఓ రెండు ఖడ్గమృగాలు బలంగా కొట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని తలపించే రీతిలో వాటి బలమైన పదునైన కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు తమ కార్లలో ఉండి కెమెరాల్లో బందిస్తుండగా.. ఓ దంపతులు మాత్రం ఉత్సాహంతో వాటికి సమీపంగా వెళ్లారు. ఆ సమమంలో హాలీవుడ్ సినిమాలో చూపించినట్లుగా పోట్లాటను ఆపేసిన ఖడ్గమృగాలు.. ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకొని స్లోమోషన్లో తలలు ఎత్తి ఏదో మాట్లాడుకున్నట్లుగా తలలు ఊపి వెంటనే ఆ దంపతులవైపు వేగంగా వచ్చాయి. వాటి వేగాన్ని చూసిన ఆ ఇద్దరు కార్లో దూరి దౌడోదౌడు అంటూ పారిపోయారు. ఆ కారును వెంబడించిన తీరు చూస్తే ఒళ్లుగగుర్పొడవాల్సిందే. -
యుద్ధానికి దిగినట్లుగా వేల సాలీడులు..
బ్రిటన్: అదొక అటవీ ప్రాంతంతో నిండిన పార్క్ లాంటి ప్రదేశం. అందులో కొండలు. సరదాగా గడిపేందుకు తమ పిల్లలను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు. సాధారణంగా స్వేచ్ఛగా ప్రకృతిలో విహరించే చిన్నారులంతా ఆ రోజు కూడా గంతులు వేస్తూ ఓ బండరాయి వద్దకు చేరుకున్నారు. దానికి చాలా చోట్ల రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఏమున్నాయా అని తొంగిచూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో కుప్పలుకుప్పలుగా సాలీడు పురుగులు ఉన్నాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయారు. ఇదే విషయం అక్కడ ఉన్న ఓ వ్యక్తికి చెప్పగా ఆశ్చర్యపోతూ.. ఒక వేళ సాలీడులు ఉన్నా అవేం చేయవని, భయపడాల్సిన పనిలేదంటూ వారి భయం పోగొట్టేందుకు ఆ రంధ్రంలో చేయిపెట్టి సాలీడు తుట్టెను కిందపడేశాడు. అంతే.. అందులోని వేలకొలది సాలీడు ఒక్కసారిగా దాడికి దిగినట్లుగా ఎగబాకడంతో భయంతో పిల్లలంతా పరుగులు తీశారు. దానిని బయటకు తీసిన వ్యక్తి కూడా వాటిని చూసి హడలెత్తిపోయాడు. కాసేపట్లోనే వేల సాలీడులు ఆ బండరాయిని చుట్టేశాయి. -
ఆ దృశ్యాన్ని చూసి భయంతో ...
మాస్కో: అది రష్యాలోని మియాస్ నగరం. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ కాస్తోంది. ఓ అపార్ట్మెంట్లో ఎనిమిదవ అంతస్తు కిటీకీ కొద్దిగా తెరుచుకొని ఉంది. ఇంతలో అందులో నుంచి రెండేళ్ల బాలుడు మెల్లగా బయటకొచ్చి నిటారుగా కిటికీలో నిలబడ్డాడు. కొద్దిగా వొంగి రోడ్డుపై వెళుతున్న వాహనాలను చూస్తున్నాడు. దానికి గ్రిల్ లేదు. బాలుడి కాళ్ల కింద ఆసరాగా ఉన్న చెక్క కూడా బలంగా లేదు. ఈ దృశ్యాన్ని గమనించిన బాటసారులకు జరగబోయే దారుణాన్ని ఊహించి ముచ్చెమటలు పోశాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చేలోగానే ఇంట్లోనే మరో గదిలో ఉన్న తల్లి కూడా ఈ దృశ్యాన్ని చూసింది. ఒక్క క్షణంపాటు భయంతో నిశ్చేష్ఠురాలైంది. వెంటనే తేరుకొని, ఎలాంటి కంగారు లేకుండా ‘బాబు, బుజ్జీ, నాన్న! అన్నం తిందురా’ అంటూ లోపలికి పిలిచింది. ఆ రెండేళ్ల బాలుడు ఎలాగైతే బయటకొచ్చాడో, అలాగే లోపలికి పోయాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన బాటసారులు, ఇంతలో అక్కడికొచ్చిన పోలీసులు హమ్మయ్యా! అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. కిటికీలో నుంచి బయటకొచ్చి ప్రమాదం అంచున నిలబడినప్పుడు కూడా ఏ మాత్రం భయపడని ఆ బాలుడు లోపలికెళ్లాక తల్లి పెట్టిన చీవాట్లకు మాత్రం గుక్కపట్టి అరగంట ఏడ్చాడు. ఆ బాలుడి పేరేమిటో, తల్లి వివరాలేమిటో తెలియదుగానీ పిల్లవాడు కిటికీలో నుంచి బయటకు రావడాన్ని, మళ్లీ లోపలికి వెళ్లడాన్ని వీడియో తీసిన ఓ బాటసారి ఆన్లైన్లో దాన్ని పోస్ట్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు.